లావణ్య… అరియలూర్ జిల్లాలో, మైకేల్‌పత్తిలో Sacred Heart of Jesus Higher Secondary School అని ఓ క్రిస్టియన్ స్కూల్… దానికి అనుబంధంగా St. Michael’s Hostel… అందులో ఈ లావణ్య చదువుకునేది… మతం మారాల్సిందిగా ఆమెకు వేధింపులు… చివరకు భరించలేక ఈ పన్నెండో తరగతి అమ్మాయి సూసైడ్ చేసుకుంది… ఎవరు ఎలా వేధించారో ఓ వీడియోలో చెప్పుకుంది…
హిందూ అమ్మాయి కదా, ఎవరూ పట్టించుకోలేదు మొదట… తరువాత ఈ వీడియో సోషల్ మీడియాలో రచ్చ అయిపోయి, డీఎంకే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుండేసరికి, పోలీసులు కేసు పెట్టారు… ఆ కేసులో మొదటి ముద్దాయి ఆ హాస్టల్ వార్డెన్ సగయ మేరీ… ఈలోపు ఓ సీనియర్ మంత్రి ‘ఈ సూసైడ్ కేసులో మతమార్పిడి అనే కోణం లేదు’ అని ఎక్కడో కామెంట్ చేశాడు…
దీంతో ఇక పోలీసులు కేసును తొక్కేస్తారనే ఆందోళన చెలరేగింది మళ్లీ… హైకోర్టు కూడా సీబీఐకి అప్పగించాలని చెప్పింది… కానీ స్టాలిన్ ప్రభుత్వం ససేమిరా అంటూ సుప్రీంకోర్టు దాకా పోయింది… సుప్రీం కూడా సీబీఐ దర్యాప్తు చేస్తే తప్పేమిటని ప్రశ్నించి, తోసిపుచ్చింది… సీబీఐకి అప్పగించాలనే తీర్పు చెప్పినప్పుడు హైకోర్టు ఒక హిందీ, మరో తమిళ సినిమాలోని మాటల్ని ప్రస్తావించింది… దీనిపై ధర్మపురి డీఎంకే ఎంపీ పార్లమెంటులో మాట్లాడుతూ… మన జడ్జిలు కొందరు సినిమా డైలాగులు విని తీర్పులు చెబుతున్నారంటూ వెటకరించాడు…
Ads
ఇదంతా ఏం సూచిస్తోంది..? స్టాలిన్ ప్రభుత్వం ఎలాగోలా లావణ్య కేసును తమ చేతుల్లోని ఉంచుకుని, పక్కదోవ పట్టించేద్దామని చూస్తోంది..! అప్పుడే అయిపోలేదండి… సదరు మొదటి ముద్దాయిొ సగయ మేరీకి తంజావూరు కోర్టు బెయిల్ ఇచ్చింది, కేసులో మరో ముద్దాయికి యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇచ్చింది… ఈ మేరీ బయటికి రాగానే తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యే ఇనిగో ఇరుదయరాజ్ శాలువా కప్పి సత్కరించాడు… అంటే ఏమిటి అర్థం..? ‘‘నువ్వు మంచి పనిచేశావు’’ అని అభినందన…
ఈయన ఎవరు..? Christhuva Nallenna Iyakkam ఆర్గనైజేషన్ నడిపిస్తుంటాడు… క్రిస్టియన్ మత కార్యక్రమాల్ని పెద్దగా ఆర్గనైజ్ చేస్తుంటాడు… వాటికి గతంలో కరుణానిధి, స్టాలిన్ కూడా హాజరయ్యారు… ఈ ఎమ్మెల్యేకు టికెట్టు ఇచ్చింది డీఎంకే… ఎహె, ఆఫ్టరాల్ హిందువులదేముంది..? దోమలు, ఇట్టే నలిపేయవచ్చు… ముస్లింలు, క్రిస్టియన్లు కలిసికట్టుగా ఉంటే చాలు… ఇలాంటి ప్రసంగాలు బోలెడు… ఆ జిల్లాలో క్రిస్టియన్ల ప్రాబల్యం ఎక్కువ…
ఇక్కడ ప్రశ్న ఏమిటంటే… సీబీఐకి అప్పగించకూడదు అంటుంది ప్రభుత్వం… మతమార్పిడి కోణంలో లేదంటాడు సీనియర్ మంత్రి… కోర్టుల తీరును పార్లమెంటులో తప్పుపడతాడు… నిందితురాలికి బెయిల్ రాగానే ఓ ఎమ్మెల్యే వెళ్లి సత్కరిస్తాడు… స్టాలిన్ ఎవరినీ ఏమీ అనడం లేదు… అంటే పరోక్షంగా మద్దతునిస్తున్నట్టే కదా…! అంటే మతమార్పిళ్లకు సుముఖుడినే అని చెబుతున్నట్టే కదా… ఈమధ్య కాస్త పాలనలో, రాజకీయంలో పరిపక్వత చూపిస్తున్నాడు సుమీ అని మంచిపేరు తెచ్చుకుంటూ… మతమార్పిళ్ల పట్ల ఈ మౌనమేంటి..? ఏకంగా ఓ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే నిందితులకు మద్దతు ఏంటి..? ఇది మీ ప్రభుత్వ, పార్టీ విధానమా స్టాలిన్..? ఇది స్టాలిన్ మరో మొహమా..?!
Share this Article