జగన్ ముందస్తు ఎన్నికలకు రెడీ అయిపోతున్నాడా..? గతంలో కేసీయార్ చూపిన బాటలోనే తనూ అడుగులు వేయబోతున్నాడా..? ఇప్పుడు ఉన్నతాధికారుల బదిలీలు ఒక ‘ఎలక్షన్ టీం’ అనే దిశలో సాగే ప్రయాణంలో భాగమేనా..? వచ్చే మూడు నాలుగు నెలల్లో జగన్ ఓ సీరియస్ కార్యాచరణ అమలు చేయబోతున్నాడా..? మూడు రాజధానులు అనే కాన్సెప్టుకు కొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా..? ఈ నాలుగైదు నెలల కీలక కసరత్తులన్నీ ముగిశాక మళ్లీ జనంలోకి వెళ్లిపోనున్నాడా…?
వినవచ్చే సమాచారం మాత్రం అవుననే అంటోంది… జగన్ తాజా నిర్ణయాల్లో ఒకటి తన కార్యాలయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌ను అక్కడి నుంచి తప్పించడం… “దాదాపు యాక్టింగ్ సీఎంగా… కొన్నిసార్లు అంతకుమించి వ్యవహరించిన ప్రవీణ్ ప్రకాష్‌ను ఎట్టకేలకు జగన్ బయటికి పంపించేశాడు, జగన్‌కు తన తత్వం అర్థమైపోయింది, అందుకే వదిలించుకున్నాడు…” అనే ప్రచారం సాగుతోంది…. కానీ అది నిజం కాకపోవచ్చు…
ఢిల్లీ ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పంపించాడు… కోపమో, అసంతృప్తో ఉంటే జగన్ పక్కకు పెట్టేస్తాడు తప్ప ఢిల్లీకి ఎందుకు పంపిస్తాడు… ఢిల్లీలో ప్రవీణ్ భార్య భావన సక్సేనా ఇప్పుడు కేంద్ర సర్వీసులోకి చేరింది… ఇకపై ప్రవీణ్ ద్వారా ఢిల్లీ లాబీయింగ్ సాగుతుంది… ఆల్‌రెడీ అక్కడ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉన్నాడు… ఇక డీజీపీ సావంగ్ బదిలీ కథ వేరు… బహుశా జగన్‌కు కోపం వచ్చి ఉంటుంది… ప్రత్యేకించి ఉద్యోగుల చలో విజయవాడ ఆందోళన సక్సెస్ కావడం మీద కూడా కావచ్చు…
Ads
సావంగ్‌కు ఎక్కడా పోస్టింగు కూడా ఇవ్వలేదు… కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డిని కొత్త డీజీపీగా తెచ్చాడు జగన్… ఇక ఎన్నికల వరకూ తనే పోలీస్ బాస్… బహుశా సీఎం కార్యాలయ కార్యదర్శిగా రావత్‌ను తీసుకొస్తాడు… ఆయన ప్రస్తుతం ఆర్థిక కార్యదర్శి… ఈ కీలక మార్పులైపోయాక జగన్ ఇక కొత్త జిల్లాల కసరత్తు పూర్తిచేస్తాడు… కలెక్టర్లు, ఎస్పీల పోస్టింగుల దగ్గర్నుంచి కొత్త జిల్లాలు సెట్ చేశాక, బహుశా ఏప్రిల్‌లో లేదా మే నెలలో వైజాగ్ బాట పడతాడు…
అధికారికంగా అడ్మినిస్ట్రేషన్ కేపిటల్ అని ప్రకటించకపోయినా, సీఎం ఎక్కడ ఉంటే సహజంగా అక్కడే అధికారుల యాక్టివిటీ తప్పదు… అమరావతి నుంచి కర్నూలు వెళ్లే విషయంలో కోర్టుపరంగా వ్యతిరేకత వ్యక్తమయ్యే సూచనలుంటే… ఇక అమరావతిలోనే జుడిషియల్ కేపిటల్ కొనసాగవచ్చు… అలాగైతే పొలిటికల్ కేపిటల్‌ను రాయలసీమకు మార్చవచ్చు… కాకపోతే రాజధానులు అనే పదాలకు బదులు ఒక రాజధాని, రెండు ఉపరాజధానులు అని వ్యవహరిస్తారేమో టెక్నికల్‌గా, లీగల్ సౌలభ్యం కోసం…! సో, జగన్ ఈ మూడు రాజధానుల విషయంలో ఏం చేయబోతున్నాడో చూడాలి…
ఇది కాస్త సెట్టయ్యాక గానీ ఆయన మంతివర్గంలో మార్పుల జోలికి పోడు… పనిలోపనిగా పార్టీ ప్రక్షాళన కూడా తప్పదు… ఎలాగూ ఎలక్షన్ టీం వైపు దృష్టి సారిస్తున్నాడు కాబట్టి పెద్దగా జనంలో పేరు సంపాదించలేని నాయకులు, తనకు అసంతృప్తి ఉన్న నాయకులను డిమోట్ చేసి, కొత్త బాధ్యుల నియామకం ఉంటుంది… ఇవన్నీ అయ్యాక ఇక జనంలోకి వెళ్లిపోవడమే… అంటే ఎన్నికల వైపు వేసే అడుగులే… ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరి లేదు… ఒకవేళ యూపీ ఎన్నికల్లో బీజేపీ గనుక ఓడిపోతే జగన్ ధోరణిలో కూడా మార్పులు రావచ్చు…!!
Share this Article