Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దీప్ సిద్ధూ..! ఈ ఎర్రకోట ముద్దాయిని ఖతం చేశారా, తనే ఖతమయ్యాడా..!?

February 17, 2022 by M S R

పార్ధసారధి పోట్లూరి……………  కత్తిని నమ్ముకున్నవాడు చివరికి ఆ కత్తికే బలి అవుతాడు అన్నట్లు ట్రాక్టర్ ని నమ్ముకున్న వాడు చివరికి ఆ ట్రాక్టర్ కే బలి అవుతాడని కొత్తగా చెప్పుకోవాల్సి వస్తున్నది! ఇక్కడ నమ్ముకోవడం అంటే హింస అని అర్ధం చేసుకోవాలి!  పంజాబీ సినిమా నటుడు, సామాజిక కార్యకర్తగా చెప్పబడిన దీప్ సిద్ధూ గత సంవత్సరం రిపబ్లిక్ డే రోజున ఎర్రకోట కోట మీదకి పోలీస్ బారికేడ్లని చేధించుకుంటూ ట్రాక్టర్ మీద చేరుకొని, ఖలిస్తానీ జెండా ఎగురవేసిన సంఘటనలో కుట్రదారు మరియు ప్రధాన ముద్దాయి… 2021 లో బెయిల్ మీద బయటికి రాగానే మళ్ళీ అరెస్ట్ అయ్యాడు. మళ్ళీ కోర్టు బెయిల్ ఇచ్చింది. వివిధ సెక్షన్ల కింద పలు కేసులు నమోదు అయ్యాయి… వాటిలో ప్రధానంగా జాతీయ జెండాని అవమానపరచడం అనేది ప్రధాన కేసు.

2022, ఫిబ్రవరి 15 మంగళవారం రోజున రాత్రి 9.30 కి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించాడు దీప్ సిద్ధూ ! డిల్లీ నుండి పంజాబ్ లోని భటిండాకి రోడ్డు మార్గంలో తన తెల్ల రంగు మహీంద్రా స్కార్పియో SUV లో వెళుతుండగా, ఖార్ఖోడ టోల్ [Khar Khoda Toll]దగ్గర ఈ ప్రమాదం జరిగింది. దీప్ సిద్ధూ డ్రైవ్ చేస్తున్న స్కార్పియో ముందు వెళుతున్న ట్రైలర్ ట్రక్కుని వెనక నుండి బలంగా డీకొట్టినది. స్కార్పియోలో పక్కనే దీప్ సిద్ధూ స్నేహితురాలు రీనా రాయ్ కూడా ఉంది.

deep siddu

Ads

ప్రత్యక్ష సాక్షి మొహమ్మద్ యూసఫ్ ఏమంటాడంటే… ‘‘నేను సిద్ధూ నడుపుతున్న స్కార్పియో వెనకాలే వస్తున్నాను. సిద్హూ తన కారుని 100 kmph వేగంతో నడుపుతున్నాడు. నాకు ఒక్కసారిగా పెద్ద శబ్దం వినపడింది. వెంటనే నా కారుని పక్కన పార్క్ చేసి, ముందుకి వెళ్లి చూడగా సిద్ధూ డ్రైవింగ్ సీట్లో గాయాలతో కనపడ్డాడు. వెంటనే సిద్దూని బయటికి లాగి పక్కనే పేవ్‌మెంట్ మీద పడుకోపెట్టాను అలాగే పక్క సీట్లో ఉన్న రీనా రాయ్ ని కూడా బయటికి లాగి, పేవ్మెంట్ మీద పడుకోపెట్టాను. రీనా రాయ్ స్పృహలోనే ఉంది… వెంటనే సిద్హూ సోదరుడి ఫోన్ నంబర్ ఇచ్చి ఫోన్ చేయమని అడిగింది. నేను సిద్హూ సోదరుడికి ఫోన్ చేశాను… ఒక గంటలో మనుషులని పంపిస్తాను అన్నాడు. ప్రమాదం జరిగిన తరువాత సిద్ధూ బ్రతికే ఉన్నాడు. అరగంట తరువాత అంబులెన్స్ వచ్చింది. ధిల్లీ హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. కానీ అప్పటికే దీప్ సిద్ధూ చనిపోయినట్ల్డు డాక్టర్లు చెప్పారు అని రీనారాయ్ చెబుతోంది…

ప్రమాదం మీద అనుమానం దేనికి ?

‘‘ప్రమాదం జరగకముందు… మా ముందు వెళ్తున్న ట్రాలీ ట్రక్కు మాకు సైడ్ ఇచ్చినట్లే ఇచ్చాడు, మళ్ళీ మా ముందుకు వచ్చేయడం చేస్తూ వచ్చాడు. సిద్హూ అసహనంతో ఉన్నాడు. మాకు సైడ్ ఇచ్చాడు అని ఓవర్ టెక్ చేయడానికి ప్రయత్నించడం, అదే సమయంలో ట్రక్కు మాకు అడ్డంగా రావడం ఇలా మూడు సార్లు జరిగింది. చివరికి ఈసారి ఎలా అయినా ఓవర్ టేక్ చేసి వెళ్లాలని నిర్ణయించుకొని మరింత వేగంగా ముందుకు పోనిచ్చాడు… కానీ ఈసారి ట్రక్కు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో మా స్కార్పియో అప్పటికే వేగంగా ఉండడంతో ట్రక్కు వెనుక భాగాన్ని బలంగా డీ కొట్టింది స్కార్పియో…. ఇదీ దీప్ సిద్ధూ గర్ల్ ఫ్రెండ్ రీనా రాయ్ కథనం.

మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిపబ్లిక్ డే దుస్సంఘటన వెనక ఉన్న సూత్రదారులు ఎవరు ? పాత్రధారుల్లో ప్రధాన వ్యక్తిని ఇలా చట్టబద్ధంగా హత్య ఎవరు చేయించారు అనేది తాజా డౌట్… అది కేవలం యాక్సిడెంటులా లేదు… పంజాబ్ లో ఎన్నికల జరుగుతున్న వేళ ఈ ప్రమాదపు హత్య జరగడం మీద పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీప్ సిద్ధూ ఎంతటి ఆవేశపరుడో గత సంవత్సరం రిపబ్లిక్ దినోత్సవం రోజున మనం కళ్ళారా చూసాం ! దీప్ సిద్ధూ ఆవేశంలో ఎలా స్పందిస్తాడో బాగా తెలిసిన వారు ఈ పథక రచన చేసి ఉండవచ్చు. పైగా పక్కనే తన గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది.

ప్రమాదం జరిగిన ప్రదేశం కుండ్లి –మనేసర్ –పల్వాల్ ఎక్స్ప్రెస్స్ వే [Kundli-Manesar-Palwal (KMP) Expressway ]. ఇది పంజాబ్ రాష్ట్ర పరిధిలోకి వస్తుంది. స్థలం కూడా తమకి అనుకూలంగా ఉండే విధంగా ప్లాన్ చేసారు. అదే ధిల్లీ పరిధిలో అయితే అక్కడి పోలీసులు విచారణ చేస్తారు కాబటి పంజాబ్ లో ప్లాన్ చేసారు. ఇంతకీ ప్రమాదం జరిగింది అని ఫోన్ చేస్తే దీప్ సిద్ధూ సోదరుడు ఎవరినో పంపిస్తాను అని చెప్పాడు కానీ తానే స్వయంగా ఎందుకు వెళ్ళలేదు ప్రమాద స్థలానికి ? చాల ప్రశ్నలతో పాటు అనుమానాలు ఉన్నాయి కానీ చెప్పేది ఎవరు ? దీప్ సిద్ధూ తో ఆగిపోతుందా లేకపోతె మరిన్ని పెద్ద తలకాయలు కూడా పోతాయా ? పాపం శమించుగాక…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions