Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆలీకి రాజ్యసభ సీటిస్తేనే ఆశ్చర్యం… ఆ లెక్కలు చాలా కాంప్లికేటెడ్…!!

February 17, 2022 by M S R

జరుగుతున్న ప్రచారం నిజమై… నిజంగానే సినిమా నటుడు ఆలీకి జగన్ గనుక రాజ్యసభ సభ్యత్వం అవకాశమిస్తే అది గొప్ప విశేషమే అని చెప్పుకోవాలి..! మొన్నొకసారి ఆలీ భుజం మీద తట్టి జగన్ త్వరలో శుభవార్త అన్నాడు… తరువాత ఆలీ జగన్ ఇంటికి వెళ్లొచ్చాడు… ఇంకేం..? ఆలీకి రాజ్యసభ సీటు అని ఊహాగానాల్ని మీడియా స్టార్ట్ చేసింది… అది వైసీపీ హెడ్డాఫీసు నుంచి లీకైందా..? లేక మీడియా సొంత సృష్టా తెలియదు… కానీ అదే నిజమైతే మాత్రం ఆసక్తికరమే… నిజమేమిటో, తన ఆలోచనలేమిటో జగన్ ఎవరికీ చెప్పడు, కాబట్టి అప్పటివరకూ ఎవరికి తోచింది వాళ్లు రాసుకోవడమే…

సో వాట్..? ఆలీ రాజ్యసభ సభ్యుడు ఎందుకు కాలేడు..? ఎందుకు కావొద్దు అనే ప్రశ్నలిక్కడ అనవసరం… ఎందుకంటే..? ఆలీ కాలేడనీ, కావొద్దనీ కాదు… సాధ్యాసాధ్యాల గురించిన పొలిటికల్ చర్చ… అదే జరుగుతోంది ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిళ్లు, టాలీవుడ్ సర్కిళ్లలో…! సాధారణంగా ప్రాంతీయ, కుటుంబ పార్టీల లెక్కలు వేరే ఉంటయ్… రాజ్యసభ సీటు ఇవ్వాలంటే బోలెడు ఈక్వేషన్స్ ఆలోచిస్తయ్… జస్ట్, విధేయతను మాత్రమే పరిగణనలోకి తీసుకోవు…

మీకు పరిమళ్ నత్వానీ గుర్తున్నాడా..? తనకూ వైసీపీకి ఏ సంబంధమూ లేదు… అయితేనేం, వైసీపీ తనకు రాజ్యసభ సీటు ఇచ్చింది… అంబానీ కోసం… అంబానీతో సత్సంబంధాల కోసం… అంబానీకి నత్వానీ రాజ్యసభలో ఉండాలి… ప్రజాసమస్యలు, చర్చలు గట్రా అవన్నీ ఏమీ ఉండవ్… జస్ట్, లాబీయింగ్ పని చేయాలి… సో, ఒక్కో రాజ్యసభ సీటు వెనుక డబ్బు లెక్కలు, ఆర్థిక సంబంధాల లెక్కలు, రాజకీయపరమైన లెక్కలు, విధేయత లెక్కలు, భావి అవసరాల లెక్కలు, కులం లెక్కలు గట్రా చాలా ఆలోచించాలి… (చంద్రబాబు ఎంపీ సీట్ల పంపిణీని ఓసారి పరిశీలించండి…)

Ads

ఆలీ డబ్బు అనేది పక్కన పెడదాం… జగన్‌కు అది జుజుబీ… 1) తను చిన్నప్పటి నుంచే నటుడు, చదువు ఎంతవరకో మనకు తెలియదు… రాజ్యసభ సభ్యుడిగా తను ఏమీ జగన్‌కు లాబీయింగ్‌కు ఉపయోగపడే చాన్స్ లేదు… 2) ఆమధ్య వైసీపీలో చేరాడు తప్ప, అంతకుముందు పవన్ క్యాంప్… జగన్‌కు ఇప్పుడు విధేయుడే కావచ్చుగాక, కానీ విధేయత మాత్రమే సరిపోదు… 3) తనేమీ జగన్ ప్రచారంలో పాల్గొన్నవాడు కాదు, యాక్టివ్ పొలిటిషియన్ కూడా కాదు… 4) మైనారిటీ కోటాలో గనుక ఇవ్వదలిస్తే వైసీపీకి హార్డ్ కోర్, డెడికేటెడ్, కమిటెడ్, ఎడ్యుకేటెడ్, మైనారిటీ లీడర్లు బోలెడు మంది ఉన్నారు… ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నవాళ్లు కూడా…!

5) పోనీ, భవిష్యత్తులో రాజకీయంగా ఏమైనా ఉపయోగమా అంటే అదీ లేదు… తనేమీ పాపులర్, జనాకర్షక హీరో ఏమీ కాదు… 6) సినిమా వ్యక్తికి ఇవ్వాలీ అనుకుంటే బంధువు మోహన్‌బాబు ఉన్నాడు… గతంలో పృథ్వి మొదటి నుంచీ జగన్ ఫాలోయర్… ఎంత ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గలేదు, కానీ ఏం జరిగింది..? సుబ్బారెడ్డి దెబ్బకు బలయ్యాడు, ఇప్పటికీ మళ్లీ ఏ చిన్న పదవీ లేదు… జగన్ ప్రేమించలేని కమ్మ కులస్థుడే అయినా సరే, జగన్ కోసం గొంతు చించుకున్న పోసానికీ ఒరిగిందేమీ లేదు… 7) ఎన్నికల్లో ఓడిపోతే, ఎక్కడో ఓచోట అకామిడేట్ చేయాల్సిన వ్యక్తులు కొందరుంటారు… ఆలీ ఆ కోవలోకి కూడా రాడు…

8) అంబానీ మనిషికి ఇచ్చాడు కదా, ఇప్పుడు ఒకటి నేరుగా ఆదానీకే ఇచ్చే చాన్సుంది… అవి హార్ధిక, ఆర్థిక సంబంధాలు… నేరుగా కేంద్రంతో లాబీయింగుకు పర్‌ఫెక్ట్ రూట్… డబ్బు ఇక్కడ అంశమే కాదు… 9) విజయసాయిరెడ్డి ప్రాధాన్యం ఈమధ్య కత్తిరించినట్టున్నాడు గానీ జగన్ మళ్లీ తనకు రాజ్యసభ సీటు ఇవ్వవచ్చు… తను కూడా ఢిల్లీ పనులకు పర్‌ఫెక్ట్ ఉపయోగకరం…

10) సినిమా వాళ్లకే ఇవ్వదలిస్తే చిరంజీవిని అలుముకుని, అవకాశం ఇచ్చే చాన్సుంది… ఏపీ కులసమీకరణాల్లో, జనసేన కోణంలో గానీ అది జగన్‌కు బాగా ఉపయోగకరం… తను జనంలో తిరిగి ప్రచారం చేయగలిగితే మరింత బెటర్… 11) ఒకవేళ ఆలీకి పదవి ఇవ్వాలని అనుకుంటే రాష్ట్ర స్థాయిలో ఏదైనా సముచిత పదవి ఇస్తాడేమో… ఐనా ఇవన్నీ రకరకాల ఈక్వేషన్ల గురించి మనం బుర్రలు బద్ధలు కొట్టుకోవడమే గానీ, జగన్ లెక్కల్ని అర్థం చేసుకోవడం కష్టం… ఏమో, ఆలీ రాజ్యసభ సభ్యుడు అవుతాడేమో కూడా…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions