‘‘వీళ్లిద్దరితోనే భారతీయ జనతా పార్టీ యాత్ర మొదలయ్యింది…!! ఒకరు చందుపట్ల జంగారెడ్డి గారు,? మరొకరు డాక్టర్ AK పటేల్ గారు, జంగారెడ్డి గారు హన్మకొండలో పీవీ గారి మీద ఎంపీగా గెలిచారు. AK పటేల్ గారు? గుజరాత్ రాష్ట్ర మెహసానా నుండి ఎంపీగా గెలిచారు. 2 సీట్లతో మొదలైన భారతీయ జనతా పార్టీ జైత్రయాత్ర నేడు 303 సీట్లకు చేరి?అప్రహతిహాతంగా? కొనసాగుతున్నది….!!’’
………. ఈ మెసేజ్ వాట్సప్ గ్రూపుల్లో తెగ షికారు చేస్తోంది… దీని ప్రయోజనం ఏమిటో ఆ మెసేజ్ ఎడాపెడా షేర్ చేస్తున్నవాళ్లకే తెలియాలి… ఎక్కడో మొదలై ఎక్కడికో ఎదిగాం అనే ఓ తృప్తి తప్ప, దీంతో వచ్చే ఫాయిదా ఏమీ లేదు… నిజానికి 1984 లోకసభ ఎన్నికల్లో బీజీపీ నిఖార్సయిన గెలుపు జస్ట్, ఒక్క స్థానమే… ఆశ్చర్యంగా ఉందా… నిజమే…
Ads
ఇదుగో వీళ్లే… 1984 ఎన్నికల్లో బీజేపీ జాతీయ స్థాయిలో గెలిచిన ఇద్దరు ఎంపీలు… ఒకరు చందుపట్ల జంగారెడ్డి, మరొకరు ఏకే పటేల్… ఏకే పటేల్ వయస్సు 89 ఏళ్లు… జంగారెడ్డి వయస్సు 85 ఏళ్లు…
అప్పట్లో… అంటే… 1984… భారతీయ జనతా పార్టీ పుట్టి నాలుగేళ్లు… ఆ పార్టీ తొలి ఆకాంక్షలపై ఇందిరిగాంధీ మరణం నీళ్లు గుమ్మరించింది… సానుభూతి పవనాల్లో కాంగ్రెస్ 400 పైచిలుకు సీట్లు సాధించింది… కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తెలుగుదేశం హవా ఆ సానుభూతిని కూడా దాటేసి, ఎన్టీయార్‌కు మస్త్ రిజల్ట్ చూపించింది… అదుగో ఆ హవాలో గెలుపొందిన సీటు హన్మకొండ… అది బీజేపీ వాపు తప్ప బలుపు కాదు…
సో, గుజరాత్లో గెలిచిన ఆ ఒక్క సీటే నిఖార్సయింది… బీజేపీ నుంచి అతిరథ మహారథులే మట్టిగొట్టుకుపోయారు ఆ ఎన్నికల్లో… అదొక సునామీ… అంతే… ఇదే జంగారెడ్డి మళ్లీ నిలబడ్డాడు… ఓడిపోయాడు… ఆ తరువాత తను ప్రధాన రాజకీయ తెర మీద కనిపించడమే ఆగిపోయింది… కానీ ఏకే పటేల్ ఆ 1984 ఎన్నికల తరువాత కూడా 1998 దాకా వరుసగా అదే స్థానం నుంచి, అదే బీజేపీ నుంచి గెలుస్తూ వచ్చాడు… తరువాత రాజ్యసభ సభ్యుడయ్యాడు… కొద్దికాలం వాజపేయి ప్రభుత్వంలో మంత్రిగా కూడా చేశాడు…
వోకే.., కాషాయధారులు తమ ప్రస్థానం ఎక్కడ స్టార్టయిందో తలుచుకుని, ప్రజెంట్ స్టేటస్‌తో ఖుషీ కావడంలో తప్పేమీ లేదు… కానీ అప్పటి బీజేపీ వేరు… ఇప్పటి బీజేపీ వేరు… ఆర్ఎస్ఎస్ మూలాల్నుంచి ఎదిగి, ఆ భావజాలంతోనే బతికిన జంగారెడ్డి, పటేల్ వంటి నేతలు ప్రజెంట్ బీజేపీలో ఇమడగలరా..? అంతటి పార్టీ వ్యవస్థాపకుడైన ఆ అద్వానీయే తెరమరుగయ్యాడు… మిగతా పాతతరం నాయకులెంత..?!
Share this Article