పార్ధసారధి పోట్లూరి……… పాకిస్థాన్ FATF [Financial Action Task Force] బ్లాక్ లిస్టు లోకి వెళ్ళబోతున్నది! రేపటి నుండి అంటే February 21 until March 4, 2022 వరకు పారిస్ లో జరగబోయే FATF ప్లీనరీ లో పాకిస్తాన్ దేశాన్ని ‘Grey List ‘ నుండి ‘Black List ‘ లోకి ప్రమోట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ పారిస్ నుండి ఒక విశ్లేషకుడు వెల్లడించాడు.
పూర్తి స్థాయి FATF ప్లీనరీ తోపాటు వర్కింగ్ గ్రూప్ మీటింగ్స్ [Working Group Meetings] కూడా జరగబోతున్నాయి. నిపుణులు ఎందుకు పాకిస్థాన్ ని బ్లాక్ లిస్టు లోకి వెళ్ళబోతున్నదో కారణం చెప్తున్నారు. గ్లోబల్ యాంటీ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ మరియు యాంటి మనీ లాండరింగ్ వాచ్ డాగ్ [global anti-terrorist financing and anti-money laundering watchdog] గ్రూపు ప్రధానంగా పాకిస్థాన్ మరియు టర్కీ ల మీద దృష్టి పెట్టబోతున్నాయని చెప్తున్నారు. గత సంవత్సరం టర్కీ ని కూడా GREY లిస్టులో పెట్టింది FATF.
జూన్ 2018 నుండి పాకిస్తాన్ grey లిస్టులో కొనసాగుతూ వస్తున్నది. అందుకే గత 4 ఏళ్ళ నుండి పాకిస్థాన్ ఆర్ధిక పరిస్థితి దిగజారుతూ వస్తున్నది. అంతకు ముందు పాకిస్తాన్ GDP 5% గా ఉండగా ఈ రోజున అది 2.5% కి దిగజారింది. చైనా నుండి ఋణం తీసుకొని నెట్టుకుంటూ వస్తున్నా, అదీ చాలక పోవడంతో గత సంవత్సరం సౌదీ అరేబియా నుండి 3$ బిలియన్ డాలర్లు ఋణంగా తీసుకున్నది. కానీ దాని గడువు మరో రెండు నెలల్లో ముగియబోతున్న తరుణంలో తాజాగా ఖజకిస్థాన్ దేశాన్ని ఋణం కోసం అభ్యర్ధించింది.
Ads
UN రెజిల్యూషన్ 2462 [The UN resolution 2462] ని అనుసరించి పాకిస్థాన్ లోని టెర్రర్ గ్రూపులు వాటికి నాయకత్వం వహిస్తున్న వారికి విదేశాల నుండి నిధులు, ఆయుధాలు అందకుండా చర్యలు తీసుకోవాలి అలాగే ఆ టెర్రర్ గ్రూపుల మీద చట్ట పరమయిన చర్యలు తీసుకొని వాటిని మూసేయాలి. దాదాపుగా ఇవే నియమ నిబంధనలు కూడా FAFT స్టాండర్డ్స్ ఉన్నాయి కానీ ఇమ్రాన్ ఖాన్ గత 2018 నుండి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు కంటి తుడుపుగా ఉన్నాయి తప్పితే తీవ్ర చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గత నెలలో ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి త్రిమూర్తి సభని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాదులని ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాలతో గృహ నిర్భందంలో ఉంచి మళ్ళీ స్వేచ్చగా వదిలేసింది పాకిస్తాన్ అంటూ ఆధారాలతో సహా నిరూపించారు.
మరోవైపు అమెరికా హాఫిజ్ సయీద్ మీద ప్రకటించిన $10 మిలియన్ డాలర్ల బహుమతి ప్రకటించి ఇప్పటికే 4 ఏళ్ళు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు… పైగా హాఫిజ్ సయీద్ మీద పెట్టీ కేసులు పెట్టి కొన్ని రోజులు హౌస్ అరెస్ట్ చేసి, ఆ వార్త అంతర్జాతీయ వార్తలలో రాగానే వెంటనే విడుదల చేసింది. హఫీజ్ సయీద్ మీద 26/11 ముంబై దాడుల సూత్రధారి అని తెలిసీ ఇంతవరకు ఎలాంటి చర్యా తీసుకోలేదు. మరో వైపు 2001 లో పార్లమెంట్ మీద జరిగిన దాడి సూత్రధారి మసూద్ అజహర్ స్వేచ్చగా తిరుగుతున్నాడు. వీళ్ళని ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదులుగా ప్రకటించింది కూడా… కానీ ఎలాంటి చర్య తీసుకోలేదు ఇప్పటివరకు. గత సంవత్సరం ఫ్రాన్స్ రాయబారిని దేశ బహిష్కరణ చేయించిన తెహ్రిక్ –ఇ-తాలిబాన్ పాకిస్థాన్ సంస్థ సమాంతరంగా పాకిస్థాన్ లో పాలన చేస్తున్నది అనే సంకేతాలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాయి.
2020, అక్టోబర్ లో FATF అధ్యక్షుడు మార్కస్ ప్లేయర్ [Dr Marcus Pleyer] మాట్లాడుతూ మేము పాకిస్థాన్ కి ఇచ్చిన 30 సమస్యల మీద చర్యలు తీసుకోవాలి అని వివరంగా చెప్పాము కానీ ఇంతవరకు వాటిలో కొన్నింటిని మాత్రమే, అదీ అరా కోర చర్యలతో సరిపెట్టింది. ఇప్పటికే 3 ఏళ్ళు గడిచినా తీవ్రవాదులకి ఆయుధాలు, విదేశాల నుండి విరాళాలు రావడం మీద మాత్రం చర్య తీసుకోలేదు. ఇది పాకిస్థాన్ ని బ్లాక్ లిస్టులో పెట్టడానికి మాకు అధికారమిస్తున్నది అని అన్నారు. తీసుకోవాల్సిన చర్యల కోసం FATF ఇప్పటికే 4 సంవత్సరాల సమయం ఇచ్చింది కాబట్టి ఇక బ్లాక్ లిస్టు లో పెట్టక తప్పనిసరి పరిస్థితి అయ్యింది.
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వానికి అంతర్జాతీయంగా లభించే సహాయాన్ని పాకిస్థాన్ దారి మళ్ళించే యోచనలో ఉండడం చూసి చాలా దేశాలు సహాయం చేయడానికి నిరాకరిస్తున్నాయి. ఇప్పుడు ఐక్యరాజ్యసమితి ఇచ్చే ఆహారం, మందులు మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ కి అందుతున్నాయి, అవీ చాలా కొద్ది మొత్తంలో… వీలు ఉన్నంత వరకు పాకిస్తాన్ ప్రభుత్వం నుండి దూరంగా ఉంటేనే కానీ తమ దేశంలో ఆకలి చావులని ఆపలేమని తాలిబన్లు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసారు.
ఇప్పుడు పాకిస్థాన్ ని బ్లాక్ లిస్టులో పెడితే IMF, World Bank, ADB ల నుండి అసలు ఋణం లభించదు. ఇక విదేశీ వాణిజ్యం కోసం విదేశాలతో ఎలాంటి లావాదేవీలు జరపలేదు. ఒకవేళ లావాదేవీలు జరిపినా అవి డాలర్ల రూపంలో చేయలేదు. వస్తు మార్పిడి లేదా ఆయా దేశాల కరెన్సీల రూపంలో తీసుకోవాల్సి వస్తుంది.
పాకిస్థాన్ సైన్యం, ISI లు ఉన్నంతవరకు ఉగ్ర గ్రూపులు ఉంటాయి, కొత్తవి పుట్టుకొస్తూ ఉంటాయి. అక్కడి పౌర ప్రభుత్వాలు అవి ఏవయినా సరే సైన్యాన్ని కాదని పనిచేయలేవు. పాకిస్తాన్ ని బ్లాక్ లిస్టులో పెట్టగానే వెంటనే ఇమ్రాన్ ఖాన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి పదవిలో నుండి దింపేస్తుంది అక్కడి సైన్యం. పాకిస్థాన్ ఆర్ధికంగా దెబ్బతినడంలో ఇమ్రాన్ ఖాన్ పాత్ర ఉందని నిరూపించే ప్రయత్నం ఇది. ఉగ్ర గ్రూపుల మీద పౌర ప్రభుత్వం చర్య తీసుకోనీదు పాక్ సైన్యం.
POK ని స్వాధీనం చేసుకోవాలి అనే డిమాండ్ నేరవేరాలి అంటే అది పాకిస్థాన్ ఆర్ధికంగా కోలుకోలేని విధంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. కానీ అది ఇంకా సుదూరంలో ఉంది అనే చెప్పాలి. పాకిస్థాన్ బ్లాక్ లిస్టు లోకి వెళ్ళిపోయిన తరువాత హీన పక్షం మరో రెండేళ్ళు పడుతుంది… అది తన జెట్ ఫైటర్స్ కి ఇంధనం సరఫరా చేయలేని స్థితికి రావాలంటే. అప్పటి వరకు వేచి చూద్దాం !
Share this Article