వెళ్లాడు… కేసీయార్ యాంటీ-బీజేపీ కూటమి నిర్మాణం కోసం ఒకప్పటి బీజేపీ దోస్త్ ఉద్దవ్ ఠాక్రేతో చర్చల కోసం ముంబై వెళ్లాడు… ప్రత్యేక విమానం వేసుకుని వెళ్లాడు… గుడ్… శరద్ పవార్‌ను కూడా కలుస్తాడు… ఆయనతోపాటు కవిత, బీబీ పాటిల్ కూడా టీంలో కనిపిస్తున్నారు… బీబీ పాటిల్ టీంలో ఉండటం మరాఠీ భాష నుంచి కాస్త దుబాసీ పనికి ఉపయోగపడుతుందేమో… ఐనా కేసీయార్‌కు ఎవరూ అవసరం లేదు… ఈ టీం, ఈ సభ్యులు కూడా ఏదో నామ్‌కేవాస్తే…
అటువైపు ఠాక్రేకు అప్పాజీ వంటి సంజయ్ రౌట్ ఉంటే చాలు… ఇంకెవరూ అక్కర్లేదు… నిజానికి ఆయననే హైదరాబాద్ పంపించి ఉంటే సరిపోయేది… మధ్యవర్తిత్వానికి ప్రశాంత్ కిషోర్ ఉండనే ఉన్నాడు… ఆయన కస్టమర్లలో ఇప్పుడు ఠాక్రే, కేసీయార్ ఇద్దరూ ఉన్నారు కదా… ఇవన్నీ సరే, వీళ్ల భేటీలో టీఆర్ఎస్, శివసేన వాళ్లు పలువురు కనిపిస్తున్నారు… ఏదో మర్యాద కోసం అనుకుందాం… కానీ, దేనికీ సంబంధం లేని మరో కేరక్టర్ కనిపిస్తోంది…
Ads
ప్రకాష్ రాజ్… టీఆర్ఎస్ వైపు నేతలతో పాటు నిలబడ్డాడు… ఫోటోలకు ఫోజు కూడా ఇచ్చాడు… అదే హాశ్చర్యం… తనకు శివసేనతో సంబంధం లేదు, టీఆర్ఎస్‌తో లేదు… కాస్తోకూస్తో లెఫ్ట్ భావజాలంతో అప్పుడప్పుడూ యాంటీ-మోడీ వ్యాఖ్యలు చేస్తుంటాడు… ఈ రెండు పార్టీల భేటీలో తను ఎందుకు ఉన్నాడో ఎవరికీ అర్థం కాని విషయం… ‘‘మా’’ ఎన్నికల్లో జగన్ క్యాంపు దెబ్బకు ఘోరంగా ఓడిపోయి.., గెలవలేదు కాబట్టి, తన మీద నాన్-లోకల్ ముద్ర వేశారు కాబట్టి, ఇక ఆ సంఘానికే రాజీనామా చేస్తానంటూ కొన్ని వింత వ్యాఖ్యలు చేసి, తరువాత ఇక సైలెంట్ అయిపోయాడు… ఎక్కడా కనిపించడం లేదు…
పోనీ.., తను తెలంగాణ కాదు, మహారాష్ట్ర కూడా కాదు… తను పుట్టింది బెంగుళూరు… నాస్తికుడు… హైదరాబాదులో ఉంటాడు కాబట్టి తెలంగాణైట్ అనుకుందాం… కానీ టీఆర్ఎస్‌తో ఏ సంబంధాలూ లేవు తనకు… అందుకే కేసీయార్, ఠాక్రే భేటీలో ఆయన పాత్ర ఏమిటనేది పెద్ద ఆశ్చర్యార్థకం… తను యాక్టివ్ పొలిటిషియన్ కూడా కాదు… కేవలం ఓ సినిమా నటుడు… ఇలా ఏ కోణంలో చూసినా సరే, ప్రకాష్ రాజ్ అనే సినిమా కేరక్టర్ తనకు ఎలాంటి సంబంధమూ లేని ఈ రాజకీయ దృశ్యంలోకి ఎలా, ఎందుకు జొరబడిందనేది అర్థం కాదు… పైగా కెసిఆర్ తో పాటు వెళ్ళాడట… అవున్లెండి, వర్తమాన ‘‘కూటమి రాజకీయాలే’’ ఎవరికీ అర్థం కావడం లేదు… ఇదెంత..! ప్రపంచంలోకెల్లా అతి పెద్ద హిందువు, హిందూ అతివాదమే పునాదిగా ఎదిగిన శివసేనాని నడుమ హిందూ పార్టీకి వ్యతిరేక కూటమి దిశగా ఒక నాస్తిక దౌత్యం..! Wow…!!
Share this Article