మందు అంటే మగాడి సొత్తా..? పొరపాటున మగువ మద్యం ముడితే పాపమా..? అదేదో పాపకార్యం అయినట్టు..? చేయరాని ద్రోహమేదో చేసినట్టు..? హేమిటో ఈవార్త …? మందు కొడితే మైలపడినంత బిల్డప్..!! ఒక పత్రిక కీలక స్థానాల్లో ఉండేవాళ్లకు ఓ సోయి, చారిత్రిక, నైతిక అంశాలపై ఓ లైన్ అంటూ ఉంటే కదా… దిగువ స్థాయి వరకూ పాత్రికేయులకు ఓ లైన్ ఇవ్వగలిగేది… ఆలోచనల్లో క్లారిటీ, క్వాలిటీ ఉన్న ఓ క్వాలిటీ సెల్ ఉంటే కదా ఓ డైరెక్షన్ ఇవ్వగలిగేది… ఈ వార్త చూడండి… ‘‘వాడెవడో రాశాడు కదా నిన్న… తెలంగాణలో సగం మంది మందుబాబులే’ అని…. సేమ్, అలాంటి స్టోరీయే…
నిజామాబాద్ జిల్లాలో దాదాపు పది శాతం మగువలు మందు తాగుతున్నారట… సోవాట్..? తాగితే ఏమిటట..? హవ్వ, చూశావా వదినా ఈ విడ్డూరం అని అడుగుతున్న ట్టు… జగన్ ఏమైనా తన జేబులో నుంచి డబ్బులు కడుతున్నాడా వాళ్లకు..,? ఎస్, తెలంగాణ కల్చర్, కష్టం తెలియని సోది మొహాలేవో ఆ జిల్లా పత్రికను లీడ్ చేస్తున్నట్టున్నవి…
Ads
కష్టపడే కుటుంబాలు మగాడితో సమానంగా ఓ కల్లు గ్లాసో, ఓ సారా గ్లాసో, ఓ లిక్కర్ పెగ్గో ఖాళీ చేస్తే ఏంటట.,.? ఎస్, జాతీయ కుటుంబ సర్వే చెప్పింది, అయితేనేం..? ఆ సర్వే అంశాలే దిక్కుమాలినవి అని ఓ విమర్శ ఆల్ రెడీ ఉంది… మతిమాలిన ప్రశ్నలు, పనికిమాలిన అంశాలపై సర్వే ఉంటుంది… ఎక్కువగా ఏ అంశాలు కుటుంబాలకు నష్టకారకాలు, ఏయే అనారోగ్యాలు అధికంగా ఉంటున్నయ్ వంటివి గాకుండా… నువ్వు మందు తాగుతావా..? నువ్వు పొగతాగుతావా..? నువ్వు గుట్కా వేసుకుంటావా..? వంటి ప్రశ్నలే అధికం… అంతే తప్ప నీకు ఏ వయసులో పెళ్లయింది, ఏ ఆహారం తీసుకుంటావు, ఎందరు పిల్లలు, రోజుకి ఎన్ని గంటలు కష్ట పడతావ్ …. ఈ ప్రశ్నలు మాత్రం ఉండవ్…
పొగాకు వినియోగంలో, మద్యపానంలో రాష్ట్ర సగటుకంటే మహిళలు ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్నారట… తెగ బాధపడిపోయింది పాపం ఈ పత్రిక… సో వాట్..? కొన్ని జిల్లాల్లో, మరీ ప్రత్యేకంగా అటవీప్రాంతాలు అధికంగా ఉన్న జిల్లాల్లో… మగవాళ్లతోపాటే ఆడవాళ్లు కూడా మద్యం సేవించడమో, పొగ తాగడమో ఉండటం సహజం… శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఉండే అడ్డపొగ అనే అలవాటు గురించి కూడా ఈ జిల్లా బాధ్యులకు వీసమెత్తు కూడా తెలిసినట్టు లేదు…
అనేక పేద కుటుంబాల్లో మంచికీ చెడుకూ అందరూ కలిసి కూర్చుని మందు కొడతారనీ, అసలు తెలంగాణలోని చాలా కుటుంబాల్లో మందు అనేది మర్యాదసూచిక అనీ, ఇతర ఆహారం వంటిదే మందు కూడా అని తెలియనట్టుంది ఆ ఘన పాత్రికేయులకు… సమాజ పోకడను కించపరచడం పత్రికల హక్కు అన్నట్టుగా ఉంది ఇది…
అవును బ్రదరూ… ఓసారి పట్నాల్లోని పబ్బుల్లో, క్లబ్బుల్లో జరిగే బాగోతాలు ఏమిటో, ఎందరు మందు కొడతారో ఓసారి సర్వే చేయరాదూ..? ఆ దిక్కుమాలిన కుటుంబ సర్వే ఎందుకు..? నువ్వే ఓ వార్త రాసుకోవచ్చు…
అవునూ, 40 శాతం మంది మందు తీసుకున్నట్టు చెబుతూనే…. ఆఫ్టరాల్ పది శాతం మంది మగువలు మద్యం తీసుకుంటే తప్పుగా తేల్చేయడం ఏమిటి అసలు..? ఇంతాచేస్తే సర్వే చేసిన కుటుంబాలు 900 లోపు… దాంతో ఆ జిల్లాలో మహిళలు తాగుబోతులు, పొగబోతులు అన్నట్టుగా రాయడం తప్పే… తప్పున్నరే… ఐనా జగన్ పత్రిక కదా… ఇంతకుమించి ఏం ఆశిస్తాం..? తాగితే పాపిష్టోళ్లు… తాగకపోతే పత్తిత్తులు… అంతేనా జగన్ భయ్యా… ఫాఫం, నీ పత్రిక…!!
Share this Article