కేజ్రీవాల్‌తో చర్చల కోసం కేసీయార్ ఢిల్లీ వెళ్లాడు… అక్కడి నుంచి వారణాసి వెళ్లి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాడని కూడా సాక్షి పత్రిక ఓ వార్త రాసింది… అప్పట్లో తలసాని నేతృత్వంలో టీఆర్ఎస్ టీమ్స్ యూపీ వెళ్లి ప్రచారం చేస్తాయని ఊదరగొట్టారు కదా, అదేమైందో మరి..? వారణాసి ప్రచారం కూడా అంతే… జాతీయ రాజకీయాల్లో ఫుల్లు యాక్టివ్ అయిపోవాలనీ, మోడీ అంతు చూడాలనీ అప్పట్లో చంద్రబాబులాగే కేసీయార్ కూడా ఇప్పుడు శివాలూగుతున్నాడు కదా…
అప్పట్లో స్టాలిన్‌ను కలిశాడు, పినరై విజయన్‌ను, మొన్న ఉద్ధవ్ ఠాక్రేను, శరద్ పవార్‌ను కూడా కలిశాడు… తేజస్విని హైదరాబాద్ రప్పించుకున్నాడు… (కేసీయార్‌తో భేటీని తేజస్వి చాలా లైట్ తీసుకున్నాడని ఆంధ్రజ్యోతి వార్త రాసింది)… ఇప్పుడు కేజ్రీవాల్… కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నాడు… సరే, బీజేపీపై పోరాటం అనే దిశలో తను వ్యూహాలు, ఆలోచనలు వేరు… వాటి అంతిమ లక్ష్యం ఏమిటో ఎవరికీ అంతుపట్టవు… దాన్నలా వదిలేస్తే…
ఒకవైపు తెలంగాణ క్షేత్రంలోనే వ్యతిరేకత పెరుగుతోంది తన మీద… దాన్ని అధిగమించడానికి ప్రశాంత్ కిషోర్ కావల్సి వచ్చాడు… మరి పీకే అంటే మాటలా..? వందల కోట్లు… బోలెడన్ని మానిప్యులేషన్ల దందా అది… ప్రపంచంలో ఎవరికీ అంతుపట్టని రీతిలో ప్రకాష్‌రాజ్‌ను వెంటేసుకుని తిరుగుతున్నాడు… అసలు ఈ నటుడు స్థాయేమిటి..? అవసరమేమిటి..? ఎందుకు తెలంగాణ తెర మీద రుద్దబడుతున్నాడనేది కేసీయార్‌కు తప్ప ఇంకెవరికీ తెలియదు… బహుశా ప్రకాష్‌రాజ్‌కు కూడా సమగ్రంగా తెలిసి ఉంటుందానేది డౌటే…
Ads
ఒకవైపు కేసీయార్ రాజకీయ ముఖచిత్రం ఇలా ఉంటే… ఇంకోవైపు కాస్త రియాలిటీ ఏమిటో కూడా చూడాలి… ఈయన ఠాక్రేను కలిసి వచ్చినప్పుడు ఏదేదో చెప్పాడు కదా, తెల్లవారే శివసేన కీలక నాయకుడు సంజయ్ రౌట్ ‘‘కాంగ్రెస్ లేకుండా బీజేపీ ప్రత్యామ్నాయం సాధ్యం కాదు’’ అని కుండ బద్ధలు కొట్టేశాడు… తేజస్వి లైట్ తీసుకున్నాడని చెప్పుకున్నాం కదా… ఆ రెండు పార్టీలు కాంగ్రెస్ కూటమిలో ఉన్నయ్…
నిన్న చెన్నైలో ఏ మీటింగ్ జరిగింది… స్టాలిన్ రాసిన ఓ పుస్తకావిష్కరణకు రాహుల్ వచ్చాడు… దీనికి కేరళ సీఎం విజయన్, జమ్ము-కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్, ఆర్జేడీ నేత తేజస్వి తదితరులు వచ్చారు… దీనికి చంద్రబాబు, కేసీయార్, జగన్‌లకు ఆహ్వానం కూడా లేదట… సరే, జగన్ ఇప్పటికీ తన అవసరాల రీత్యా బీజేపీ ఫోల్డ్‌లోనే ఉన్నాడు… చంద్రబాబు బీజేపీ దోస్తీకి ప్రయత్నిస్తున్నాడు… వాళ్లు సరే, మరి బీజేపీ మీద అగ్గిఫైరవుతున్న కేసీయార్‌ను ఎందుకు పిలవలేదు..?
‘బీజేపీ ముక్త భారత్’ అని నినదిస్తున్న పోరాట యోధుడిని ఎందుకు పట్టించుకోలేదు స్టాలిన్..? ఎందుకంటే… కేసీయార్ ఆలోచనల్లో స్థిరత్వాన్ని వాళ్లు నమ్మడం లేదు… క్రెడిబులిటీని విశ్వసించడం లేదు… అసలు కాంగ్రెస్ లేకుండా ‘యాంటీ బీజేపీ’ పోరాటం, ప్రత్యామ్నాయం అసాధ్యం అని రాజకీయ పండితులంతా చెబుతున్నదే… ప్రాంతీయ పార్టీల సమాఖ్య అనేది గతంలోనే పెద్ద విఫల ప్రయోగం అని అందరూ గుర్తుచేస్తున్నదే… ఐనాసరే, కాంగ్రెస్ లేని ‘యాంటీ బీజేపీ కూటమి’ పేరిట కేసీయార్ తిరుగుతూనే ఉన్నాడు..!!
Share this Article