చంద్రబాబుకు తల్నొప్పి వంటి వోటుకునోటు కేసు మళ్లీ కదులుతోంది… ఉదయసింహా అరెస్టు… రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించబోతున్నారని అనుకుంటున్న తరుణంలో… తెలంగాణలో కాంగ్రెస్‌ను, ఏపీలో చంద్రబాబును ఫిక్స్ చేసే ప్రయత్నాల్లో బీజేపీ బిజీగా ఉన్నట్టుంది… జగన్‌తో, కేసీయార్‌తో అమిత్ షా మాటామంతీలో ప్రధానంగా ఇవి కూడా చర్చకొచ్చినట్టు ఓ సమాచారం… చంద్రబాబుకు సపోర్టుగా ఉండే సెక్షన్లను క్రమేపీ బీజేపీ ఫిక్స్ చేస్తోంది… అదే పని జగన్ కూడా చేస్తున్నాడు…
బీజేపీతో సత్సంబంధాల కోసం చంద్రబాబు ఎన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నా సరే, బీజేపీ హైకమాండ్ ఇంట్రస్టు చూపించడం లేదు… చంద్రబాబును రాజకీయాల నుంచి డియాక్టివేట్ చేస్తే… తెలుగుదేశం బలహీనపడేకొద్దీ ఆ ఖాళీలోకి జొరబడాలనేది బీజేపీ ప్లాన్‌గా అర్థమవుతోంది… ఏపీలో ఏర్పడే పొలిటికల్ వాక్యూమ్‌లోకి ప్రవేశించడానికి మరో లీడర్ లేడు… అప్పట్లో చిరంజీవి, మొన్న పవన్ కల్యాణ్ అందులో ఫెయిలయ్యారు… కనుచూపు మేరలో మూడో ప్రత్యామ్నాయం ఏమీ లేదు…
Ads
సో, తెలుగుదేశాన్ని బలహీనపరచడమే బీజేపీకి పొలిటికల్‌గా లాభదాయకం… చంద్రబాబుతో మళ్లీ దోస్తీ చేస్తే, అది చంద్రబాబు నిలబడటానికి ఉపయోగపడుతుందే తప్ప బీజేపీకి నయాపైసా ఫాయిదా ఉండదు… (కాకపోతే ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీలతో లాబీయింగుకు చంద్రబాబు బాగా ఉపయుక్తం)
ఈ స్థితిలో నిజానికి జగన్ కూడా చంద్రబాబు ఎంతోకొంత ఫీల్డులో ఉండాలనే కోరుకోవాలి… చంద్రబాబు ఉనికి, తెలుగుదేశం మనుగడ నిజానికి జగన్‌కే మంచిది… రాజకీయాల్లో లోతు తెలిసినవాళ్లకు ఇది ఎందుకో అర్థమవుతుంది… ఒక్కసారి తెలంగాణ ఉదాహరణ చూడండి…
కాంగ్రెస్‌ను కొట్టీ కొట్టీ కేసీయార్ దాన్ని బలహీనం చేస్తూ వచ్చాడు… సామదానభేదదండోపాయాలన్నీ ప్రయోగించాడు… పార్టీని కకావికలం చేశాడు… దాంతో ఏమైంది… కేసీయార్ వ్యతిరేకత వల్ల ఏర్పడే పొలిటికల్ స్పేస్‌లోకి బీజేపి ఎంటరైంది… దుబ్బాక కావచ్చు, గ్రేటర్ కావచ్చు… కాంగ్రెస్ ఎంత వీకయితే బీజేపీకి అంతబలం… అదిప్పుడు కేసీయార్‌కు తల్నొప్పిగా మారింది… ఎంతోకొంత కాంగ్రెస్ పటిష్టంగా ఉంటే బీజేపికి ఈ స్పేస్ దొరికేది కాదు… తను చేసిన తప్పేమిటో కేసీయార్‌కు ఇప్పుడు తెలిసొస్తున్నది…
రేప్పొద్దున జగన్‌కూ అంతే… చంద్రబాబు సినిమా ముగిసేకొద్దీ మరో బలమైన ప్రత్యామ్నాయం తెరమీదకు వస్తుంది… అదొక అనివార్యత… సో, ప్రత్యర్థిగా తనకు చంద్రబాబు ఉండటం ముఖ్యమా..? చంద్రబాబును బలహీనపరచడం ద్వారా బీజేపీకి తనే స్పేస్ క్రియేట్ చేసి ఇస్తున్నాడా..? ఇది జగన్ ఆలోచించుకోవాలి…
తెలంగాణలోనూ రేవంత్‌రెడ్డి గనుక పీసీసీ పీఠమెక్కితే… తను పాదయాత్ర మొదలుపెడితే… రెడ్లు తనతో ర్యాలీ అవుతారని బీజేపీ డౌటు… సో, వోటుకునోటు కేసు మళ్లీ కదిలింది… కదిలించారు… రేవంత్‌ను చికాకు పెట్టడం ఖాయం… అటు కేసీయార్, ఇటు బీజేపీ… రెండింటికీ టార్గెట్… సరే, వాటిని తట్టుకుని తను ఎలా నిలబడతాడు, ఎలా కలబడతాడు అనేది వేరే సంగతి… ఇప్పటికీ పల్లెల్లో బలంగానే ఉన్న పార్టీ కేడర్‌ను తను ఎలా తన వెంట కదిలించగలడు అనేది కాలం చెప్పాల్సిన అంశం…
బీజేపీ నిజంగానే ఇక చంద్రబాబు అన్నిరకాలుగా ఫిక్స్ చేయడానికి సిద్ధమైందా అనేది ఓ డిబేటబుల్ అంశం… తనను అరెస్టు చేసి, కొన్నాళ్లు జైలులో ఉంచినా… తెలుగుదేశం చేయగలిగేదేమీ లేదు… తెలంగాణలో పార్టీ ఉనికే ప్రశ్నార్థకం… ఏపీలో ఇప్పుడు తనకు తెగబడి పోరాడే సీన్ లేదు…
జాతీయ స్థాయిలో రచ్చ చేయడానికీ తను యూపీయేలో లేడు.., అసలు కాశ్మీర్లో నెలల కొద్దీ ఆ రాష్ట్ర ముఖ్యులను గృహనిర్బంధంలో ఉంచితేనే మాట్లాడినవాడు లేడు… ఇప్పుడు చంద్రబాబు బలహీనపడొద్దని మనస్పూర్తిగా కోరుకోవాల్సింది జగన్ మాత్రమే… విచిత్రంగా ఉన్నా రాజకీయంగా అదే సరైన లెక్క…! అబ్బే, ఏపీలో బీజేపీకి అంత సీన్ లేదు, చంద్రబాబును మళ్లీ లేవలేకుండా తొక్కేయడమే బెటర్ అంటారా..? మొన్నటిదాకా కేసీయార్ కూడా అలాగే అనుకున్నాడు…!! రాజకీయాల్లో సరైన ప్రత్యర్థిని కొన్నిసార్లు మనమే సేవ్ చేసుకోవాలి… ఇది నవ్వొచ్చే ఒక పారడాక్స్…!!
Share this Article