Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాకిస్థాన్ అంటే అంతే… మెల్లిగా చైనాతోనే గేమ్స్ మొదలుపెట్టింది… శుభం…

March 3, 2022 by M S R

పార్ధసారధి పోట్లూరి …….. సీపెక్ [CPEC] ని పక్కన పెట్టేస్తాం :: పాకిస్థాన్…. ఇమ్రాన్ ఖాన్ రష్యా పర్యటనలో ఉండగానే అమెరికా 55 మిలియన్ డాలర్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. స్వదేశం రాగానే రష్యా మీద అమెరికా, యూరోపు, ఆస్ట్రేలియా, జపాన్ లు ఆర్ధిక ఆంక్షలు విధించిన సంగతి కూడా తెలిసిందే ! ఇక ఇప్పట్లో రష్యా కోలుకునేది లేదు, పాకిస్థాన్ కి గాస్ పైప్ లైన్ వేసేది ఉండదు… ఇప్పటికే పాకిస్థాన్ లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర వేలల్లోకి వెళ్ళిపోయింది. చాలా హోటళ్ళు, రెస్టారెంట్లు కట్టెల పొయ్యిలకి మారిపోయాయి. ఇక గృహ అవసరాల కోసం వాడే సిలిండర్ ధర అయితే మూడు వేల పైమాటే…

చైనా ఇక సహాయం చేయలేదు. ఇక మిగిలింది అమెరికానే. ఆసియా టైమ్స్ కధనం ప్రకారం…….. ఇమ్రాన్ మళ్ళీ అమెరికా ముందు మోకరిల్లి ఎలాగో అలా బయట పడదాము అనుకుంటున్నాడు. రేపు తైవాన్ మీద చైనా దాడి చేస్తే, చైనా మీద కూడా అన్ని దేశాలు ఆంక్షలు విధిస్తాయి కాబట్టి చైనా కూడా రష్యాలాగే ఇబ్బందుల్లో పడుతుంది… అప్పుడు చైనా తమకి సహాయం చేసే స్థితిలో ఉండదు.. ఇదీ పాకిస్తాన్ విదేశీ వ్యూహకర్తల ఆలోచన. యూ-టర్న్ తీసుకోవడంలో మన దేశీయనేతల్ని మించిపోయాడు ఇమ్రాన్ !

మోయీద్ యూసఫ్ [Moeed Yusuf]… ఇతను అమెరికా పాకిస్తాన్ తరపున లాబీయింగ్ చేయడానికి నియమింపబడ్డాడు. గత దశాబ్ద కాలంగా పాకిస్థాన్ తరపున లాబీయింగ్ చేస్తూనే ఉన్నాడు… యునైటెడ్ స్టేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ [United States Institute of Peace] తరపున… కానీ కాంగ్రెస్ పెద్దలు వాళ్ళ వ్యూహాలు వాళ్లకి ఉంటాయి కదా ? ఆఫ్ఘనిస్థాన్ లో అమెరికాకి ఇక పనిలేదు అందుకనే చివరి తాత్కాలిక ఆఫీస్ ని కూడా మూసేసింది అమెరికా కాబూల్ లో !

Ads

cpec

చివరికి ఆఫ్ఘనిస్థాన్ తో ఏదన్నా మాట్లాడాలంటే తమ తరపున డిప్లొమాటిక్ ఏజెంట్ గా ఖతార్ దేశాన్ని నియమించింది కానీ పాకిస్థాన్ ఊసే లేకుండా చేసింది… దాంతో అమెరికా మీద ఆశలు వదులుకుంది పాకిస్థాన్… ఇప్పుడు చైనాతో కూడా తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపుతున్నది అమెరికాకి… చైనాలో బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు చైనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడాన్ యూనివర్సిటీ [China Institute of Fudan University] డైరెక్టర్ ఎరిక్ లీ [Eric Li] కి ఇంటర్వ్యూ ఇస్తూ, చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ [CPEC ] తమకి లాభదాయకమని, ఇంతకంటే మంచి అవకాశం తమకి దొరకదనీ ప్రశంసించాడు… ఇప్పుడేమో CPEC ని పక్కన పెట్టేస్తాం, ఇలాంటి అవకాశం అమెరికా కనుక ఇస్తే అంటూ ప్రకటన చేశాడు !

పాకిస్థాన్ లో ఆ దేశ వ్యూహకర్తల తెలివితేటలకి జోహార్లు ! అసలు చైనాకి చెందిన 2.3 ట్రిలియన్ డాలర్లు అమెరికాలోని ట్రెజరీలో బాండ్ల రూపంలో పెట్టుబడులుగా ఉన్నాయి… అదీ కాక చైనా అమెరికాకి చేసే ఎగుమతుల వల్ల వచ్చే డాలర్లని అక్కడే ఉంచి లావాదేవీలు చేస్తున్నది కానీ వాటిని ఇతర అవసరాల కోసం వాడుకోవట్లేదు. రష్యా మీద విధించిన పూర్తి స్థాయి ఆంక్షలు చైనా మీద ప్రయోగించలేదు అమెరికా.

ఇక యూరోపు దేశాల దిగుమతులు 80 % చైనా మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి యూరోపియన్ యూనియన్ కూడా ఆంక్షలు విధించలేదు. ఇప్పటికే జెర్మనీ ఆటో పరిశ్రమ ఆటో మొబైల్ పరిశ్రమకి కావాల్సిన ఎలెక్ట్రానిక్ చిప్ ల కొరతని ఎదుర్కొంటున్నది… ఇక వీళ్ళు చైనా మీదా ఆంక్షలు విధించగలరా ? ఈ ప్రకటన వల్ల చైనాకి కోపం వచ్చినా బయట పడదు కానీ రేపు మాపు అంటూ వాయిదాలు వేస్తుంది. ఇంతకీ ఇప్పటికే చైనా అధీనంలో ఉన్న గ్వాదర్ పోర్ట్ ని కూడా అమెరికాకి ఇచ్చేస్తానంటున్నది పాకిస్థాన్ ! చూద్దాం, చైనా రియాక్షన్ ఎలా ఉండబోతున్నదో…! సీపీఈసీకి బ్రేకులు అనే మన కోరిక మాత్రం ఆ దేశ గంధర్వులే తీరుస్తున్నారు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions