ఫేస్బుక్లో ఓ మిత్రుడి వాల్ మీద ఓ ఫోటో చూస్తే ఆశ్చర్యమేసింది… నిజంగానే ఇంట్రస్టింగ్… విషయమేమిటంటే… ఈమధ్య మంచు విష్ణు తన పర్సనల్ హెయిర్ స్టయిలిస్ట్ నాగ శ్రీను మీద పోలీస్ కేసు పెట్టాడు… 5 లక్షల విలువ చేసే హెయిర్ స్టయిల్ పరికరాలు, సామగ్రిని శ్రీను చోరీ చేశాడనేది అభియోగం… విష్ణుకు పర్సనల్ హెయిర్ స్టయిలిస్ట్, 5 లక్షలకు ఎందుకు కక్కుర్తి పడతాడు అనే డౌట్ వచ్చింది అందరికీ… శ్రీను తనే ఓ వీడియో రిలీజ్ చేస్తూ… తనను బండబూతులు తిట్టేవారనీ, వేధించేవారనీ, కొలువు మానేస్తే, తన మీద తప్పుడు కేసు పెట్టారనీ చెప్పుకొచ్చాడు…
తరువాత బీసీ సంఘలు కూడా మోహన్‌బాబు ధోరణికి వ్యతిరేకంగా, నాగశ్రీనుకు మద్దతుగా నిలబడ్డయ్… సరే, ఇదంతా ఓ కథ… ఇక్కడ ట్విస్టు ఏమిటంటే… చిరంజీవి తమ్ముడు నాగబాబు ఆ నాగశ్రీనుకు 50 వేల ఆర్థికసాయం చేశాడు… ఫేస్బుక్ వాల్ మీద కనిపించిన ఫోటో అదే… ఓసారి చూడండి…
Ads
ఎందుకు ఇంట్రస్టింగుగా కనిపించింది అంటే… ఇలాంటి సందర్భాల్లో ఒకరి స్వవిషయాల్లో మరొకరు కలగజేసుకోరు… కానీ ఆమధ్య మా అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి కదా… మంచు విష్ణుకు వ్యతిరేకంగా ప్రకాష్ రాజ్ నిలబడ్డాడు… నాగబాబు సహా తమ వర్గం అంతా ప్రకాష్ రాజుకు సపోర్ట్ చేసింది… అప్పట్లో మాటల యుద్ధం జరిగింది…
తరువాత ఏపీలో సినిమా టికెట్ల ధరలకు సంబంధించి చిరంజీవి నేతృత్వంలో ఓ టీం జగన్‌తో సంప్రదింపులు జరిపింది… దానికి మోహన్‌బాబును పిలవలేదు… కారణాలు ఏమైనా కావచ్చుగాక… తరువాత విష్ణు ఒక్కడే వెళ్లి జగన్‌తో మధ్యాహ్నభోజనం చేశాడు… సో, మా అసోసియేషన్ ఎన్నికల బాపతు హీట్ కంటిన్యూ అవుతూనే ఉంది… పైగా జగన్‌కు విష్ణు బంధువు, పవన్ కల్యాణ్-నాగబాబు ప్రత్యర్థులు…
ఈ నేపథ్యంలో మంచు విష్ణును ఇరకాటంలో పెట్టేలా నాగబాబు ఇలా నాగశ్రీనుకు ఆర్థికసాయం చేయడమే విశేషం… ఇప్పుడు దీనిపై విష్ణు, మోహన్‌బాబు కిమ్మనలేరు, ఖండించలేరు… ఏం నాగబాబూ, మేం కేసు పెట్టిన వ్యక్తికి నువ్వు డబ్బు ఇస్తావా అని అడగలేరు..? మరోవైపు నాగబాబు మీద బీసీ సెక్షన్‌కు అభిమానం పెరుగుతుంది… ఓహ్, తెలివైన ఎత్తుగడ… అప్పుడప్పుడూ కొన్ని పిచ్చి కామెంట్లు చేస్తుంటాడు గానీ నాగబాబుకు ఈ చమత్కారపు అడుగులు వేసే కోణం కూడా కనిపిస్తోంది… అవునూ, ఇప్పుడు విష్ణు ఎలా ప్రతిస్పందించాలి..?!
Share this Article