పార్ధసారధి పోట్లూరి ……… గత మూడు రోజులుగా పశ్చిమ దేశాల ప్రాపగాండా వార్తలు తగ్గిపోయాయి ! అంటే దీనర్ధం ఉక్రెయిన్ లో రష్యా పై చేయి సాధిస్తున్నది అని అర్ధం ! అసలేంటి పుతిన్ ఉద్దేశ్యం ? ఉక్రెయిన్ ని మొత్తం రష్యా లో కలిపేసుకుంటాడా ? పుతిన్ కి మొత్తం ఉక్రెయిన్ ని స్వాధీనం చేసుకొనే ఉద్దేశ్యం లేదు. అలా చేస్తే అది తనకి గుదిబండ అవుతుంది అని తెలుసు. నాటో, అమెరికాలు ఉక్రెయిన్ వైపు చూడడానికి కారణం అక్కడి సహజ వనరులు అయిన గ్యాస్, క్రూడ్ ఆయిల్ తో పాటు అరుదయిన ఖనిజ సంపద [Rare Earth Minerals]. బ్లాక్ సీ [నల్ల సముద్రం ] తీరం.
తనకి చెక్ పెట్టడానికి ఉక్రెయిన్ ని యూరోపులో కలుపుకొని నల్ల సముద్రంని తమ అధీనంలోకి తీసుకొని రష్యాని నియంత్రించాలి అనే దుర్భుద్ధి అమెరికా, నాటో దేశాలది. అయితే సోవియట్ జమానాలో చాలావరకు డిఫెన్స్ కి సంబంధించి ముఖ్యమయిన ఫాక్టరీలు ఉక్రెయిన్ లో ఉన్నాయి. ముఖ్యంగా యుద్ధ టాంకులు తయారు చేసే ఫాక్టరీలు సోవియట్ నాటివి.. అయితే క్రమంగా వాటిని అప్ గ్రేడ్ చేసుకుంటూ పోయింది ఉక్రెయిన్. ఉక్రెయిన్ ని కనుక యూరోప్ లో కలుపుకుంటే అమెరికాతో పాటు నాటో దేశాలు కూడా చవకగా దొరికే కార్మిక శక్తిని వాడుకొని తమ ఆయుధాలని ఉక్రెయిన్ లో తయారుచేయిన్చుకోవచ్చు.
సరిగ్గా వీటిని ఆపడానికే పుతిన్ ప్రయత్నిస్తున్నాడు. మరి ఉక్రెయిన్ రాజధాని కీవ్ మీద దాడి చేస్తున్నది ఎందుకు? ప్రస్తుత రాజకీయ నాయకత్వంతో పాటు అధ్యక్షుడు జేలేన్ స్కీ పూర్తిగా అమెరికా కీలు బొమ్మ అయ్యాడు. జేలేన్స్కీ ని పదవీచ్యుతుడిని చేసి తనకి అనుకూలురు అయిన వారిని ఉక్రెయిన్ అధ్యక్షుడుగా నిమమించాలి అని పుతిన్ ప్లాన్.
Ads
గతంలో ఇరాక్,లిబియా, ఆఫ్ఘనిస్తాన్ లలో అమెరికా ఇదే పని చేసింది కదా ? కాకపొతే సిరియాలో అమెరికా ఆటలు చెల్లలేదు. ఇక ఆఫ్ఘనిస్తాన్ లో అయితే 20 ఏళ్ళు కష్టపడ్డా తనకి అనుకూలం అయిన ప్రభుత్వాన్ని ఏర్పరచలేక ఒట్టి చేతులతో వెనక్కి వచ్చేసింది.
పశ్చిమ దేశాల మీడియా చెప్పనిది, చూపించనివి :
1. ఉక్రెయిన్ కి సంబంధించి మొత్తం 1502 మిలటరీ ఎస్టాబ్లిష్మెంట్ ఇంస్టలేషన్స్ ని పూర్తిగా ధ్వంసం చేసింది రష్యా !
2. 51 కమాండ్ మరియు కమ్యునికేషన్ సెంటర్ లని ధ్వంసం చేసింది.
3. 38 S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని పూర్తిగా నాశనం చేసింది. యాంటి రేడియేషన్ మిసైళ్ళ ని వాడి వీటిని ధ్వంసం చేసింది.
4. Buk M-1 and Osa anti-aircraft missile systems ఇవి 30ఏళ్ళ నాటి పాతవి కానీ ఇప్పటికీ కొన్ని దేశాలు వాడుతున్నాయి వీటిని కూడా ధ్వంసం చేసింది రష్యా.
5. 51 రాడార్ స్టేషన్లని ద్వంసం చేసింది.
6. 472.. T-72, T-80 యుద్ధ టాంకులని మరియు ఇతర ఆర్ముర్డ్ పర్సనల్ కారియర్స్ , అర్ముర్డ్ కంబాట్ వెహికిల్స్ తో పాటు లెక్క లేనన్ని మిలటరీ ట్రక్కులని ధ్వంసం చేసింది.
7. 206 ఫీల్డ్ ఆర్టిలరీ గన్స్ తో పాటు 336 స్పెషల్ మిలటరీ ట్రక్కులని ధ్వంసం చేసింది.
8. 46 UAV ల తో పాటు ఉక్రేనియన్ సైన్యానికి చెందిన 47 జెట్ ఫైటర్స్ ని ధ్వంసం చేసింది. ఇక రన్ వే మీద ఉన్న 11 విమానాలాని గాల్లోకి లేచే ముందే ధ్వంసం చేసింది.
ఉక్రెయిన్ లోని మొత్తం ఎయిర్ స్పేస్ ని తన అధీనంలోకి తీసుకుంది రష్యా. ఇక అందరూ గగ్గోలు పెట్టిన ఉక్రెయిన్ లోని జాపోరిఝిఝియా[ ZAPORIZHIZHIA ] అణు విధ్యుత్ కేంద్రం మీద వచ్చిన పుకార్లు నిజం కావు. నిజానికి యూరోపులోనే అతి పెద్ద అణు విధ్యుత్ కేంద్రంని స్వాధీనం చేసుకొనే ప్రక్రియలో అక్కడి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో నక్కిన ఉక్రెయిన్ సైనికుల మీద కాల్పులు జరిపినప్పుడు బిల్డింగ్ లోపల ఉన్న ఉక్రేనియన్ సైనికులు ఫర్నిచర్ కి నిప్పు పెట్టారు. దాంతో మంటలు పైకి ఎగిసి అవి చూసేవారికి అణు విద్యుత్ కేంద్రం మీద రష్యా దాడి చేసింది అని పుకార్లు పుట్టించారు
.
అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యన్ బలగాలు స్వాధీనం చేసుకొని మంటలని ఆపివేశారు తరువాత. అణు విద్యుత్ కేంద్రం సురక్షితంగానే ఉంది. అక్కడ ఎలాంటి అణు ధార్మికత లీక్ కాలేదు. అణు విద్యుత్ కేంద్రం స్వాధీనం చేసుకోవడం అనేది యుద్ధం సందర్భంగా ఏ దేశమయినా చేసే పని అది దాని వల్ల విద్యుత్ సరఫరాని ఆపివేసి శత్రువుని దెబ్బ తీస్తారు.
వార్తలు వ్రాసే లేదా ప్రసారం చేసే మేధావులు తెలుసుకోవాల్సింది ఏమిటంటే… ఏదన్నా అణు విద్యుత్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ఆ దేశం ఒక ప్రత్యక యూనిట్ ని దాని కోసం కేటాయిస్తుంది. ఆ యూనిట్ లో స్పెషల్ ఫోర్స్ తో పాటు అణు విద్యుత్ కేంద్రం ఆపరేట్ చేయడంలో నిష్ణాతులు అయిన సైంటిస్ట్ బృందం కూడా ఉంటుంది. ఈ మొత్తం యూనిట్ అణు విద్యుత్ కేంద్రం దగ్గరికి చేరుకోవడానికి మరో స్పెషల్ కమాండో బృందం సహాయం చేస్తుంది. ఒక స్పెషల్ కమాండో బృందం స్పెషల్ యూనిట్ ని అణు విద్యుత్ కేంద్రం చేర్చే వరకు అందులో ఉన్న స్పెషల్ ఫోర్స్ ఎలాంటి కాల్పులకి దిగదు. అణు విద్యుత్ కేంద్రం చేరుకున్నాకే తమ పని ప్రారంభిస్తారు. రష్యా స్పెషల్ కమాండో బృందం ఈ పనిని విజయవంతంగా పూర్తీ చేసి అణు విద్యుత్ కేంద్రాన్ని అధీనంలోకి తీసుకుంది… అదీ సంగతి…
Share this Article