Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ టికెట్ల కొత్త జీవోకన్నా… ఆ సన్నాఫ్ ఇండియా సినిమా చాలా బెటర్…

March 8, 2022 by M S R

మూడు రాజధానుల బిల్లు, సీడీఆర్ఏ చట్టం రద్దు… కానీ త్రిరాజధాని తప్పదు… అదెలా చేస్తారో తెలియదు… దీన్ని యూటర్న్ అనాలా..? డబ్ల్యూ టర్న్ అనాలా..? వీ టర్న్ అనాలా..? ఏమోలెండి… సినిమా టికెట్ రేట్లపై జగన్ ప్రభుత్వ నిర్ణయాలు, అడుగులు సేమ్, అంతే గందరగోళం.,. ఇలాంటి వింత ప్రభుత్వ ఉత్తర్వులు ఈమధ్యకాలంలో రాలేదేమో బహుశా… నవ్వు, జాలి ఒకేసారి పుట్టిస్తుంటయ్ ఇలాంటి జీవోలు…

మంత్రులు ఏమన్నారు..? హీరోల రెమ్యునరేషన్‌ను ప్రస్తావించారు, పేదవాడు సినిమాలు చూడొద్దా అనడిగారు, మా ప్రభుత్వం పేదల కోణంలో మాత్రమే ఆలోచిస్తుంది అన్నారు… ప్రభుత్వాన్ని విమర్శించేవాళ్లంతా పేదల వ్యతిరేకులు అని ముద్రలేశారు… మరి ఆ ఆదర్శం ఇప్పుడేమైంది..? ఏపీలో పేదవాడు రాత్రికిరాత్రి ధనికుడైపోయాడా..? తెలుగు సినిమాలు చూసేంత డబ్బు సమకూరిందా..? అఖండ, బీమ్లానాయక్ సినిమాలకు ముందు పేదవాళ్లు కాస్తా ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ నాటికి ఆస్తిపరులు అయిపోయారా..?

వంద కోట్లకు పైగా నిర్మాణవ్యయం ఉన్న సినిమాలైతే అవి సూపర్ హై బడ్జెట్ ఫిలిమ్స్ అట… వాటికి మొదటి పదిరోజులూ ప్రత్యేక రేట్లు దండుకోవచ్చునట… అంటే పేదవాడు పెద్ద సినిమాలు చూడొద్దా అధ్యక్షా..? అవునూ, బెనిఫిట్, ప్రీమియర్ షోల మాటేమిటి..? ఆ క్లారిటీ ఏది..? అది సరే, ఒక నిర్మాత ఎంత ఖర్చుతో నిర్మించాడు అనేది తన బడ్జెట్, తను ఎంచుకునే యాక్టర్లు, తను పెట్టే ఖర్చు… ఎవరైనా ఎక్కువ ఖర్చు పెడితే, దాన్ని రికవరీ చేసి ఇవ్వాల్సిన తీట ప్రభుత్వానికి దేనికి..? అసలు సపోర్ట్ చేయాల్సింది చిన్న నిర్మాతలకు కదా…!!

Ads

పోనీ, ఆ ఖర్చులన్నీ ఏపీలోనే వసూలు చేసుకోవాలని ఉందా..? ప్రస్తుతం పెద్ద సినిమాలన్నీ ఏపీ, తెలంగాణ మాత్రమే కాదు, పాన్ ఇండియా పేరిట పలు భాషల్లోకి, పలు రాష్ట్రాల్లోకి వెళ్తున్నయ్… టీవీ హక్కులు, ఓటీటీ హక్కులు, ఓవర్‌సీస్ హక్కులు కూడా ఉన్నయ్… రేట్లు పెంచకపోయినా సరే పుష్ప, శ్యామసింగరాయ్, అఖండ, బంగార్రాజు సినిమాలకు లాభాలు రాలేదా..?

movie

టికెట్ రేట్లను అలా వదిలేయండి… అసలు నిర్మాణవ్యయం 100 కోట్లు దాటిందని ఎవరు నిర్ధారించాలి..? నిర్మాత స్వయంధ్రువీకరణ ఇస్తే చాలా..? అది క్రెడిబులేనా..? పోనీ, ఆడిటర్లు సర్టిఫై చేయాలా..? మంత్రి, ఇతర అధికారులు అన్నీ పరిశీలించి, నిగ్గుదేల్చి, వడబోసి కొత్త రేట్లకు సినిమాలవారీగా పర్మిషన్లు ఇవ్వాలా..? అసలు సినిమారంగంలో బయటికి వసూళ్లు, ఖర్చుల గురించి ఏం చెప్పుకున్నా సరే అసలు లెక్కలు వేరే ఉంటయ్… బ్లాక్, వైట్ మన్నూమశానం చాలా కథలుంటయ్…

ఐనా హీరో, హీరోయిన్, దర్శకుల పారితోషికాల్ని ఈ నిర్మాణవ్యయం లెక్కల నుంచి ఎందుకు మినహాయించాలి..? ప్రభుత్వ ముఖ్యులు, మంత్రులు ముందు నుంచీ హీరోల రెమ్యునరేషన్ల గురించే కదా లొల్లి పెడుతున్నది… సపోజ్, సంగీతదర్శకుడు, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్, విలన్, సెకండ్ హీరోయిన్, కొరియోగ్రాఫర్లకు నిర్మాత పారితోషికానికి బదులు మూడునాలుగు జిల్లాల హక్కులు ఇచ్చేశాడు అనుకుందాం… అది ఏ లెక్కలో, ఎలా చూపించాలి..? ఏమిటీ జీవో..?! కొత్త సినిమాలు ఐదు షోలు వేసుకోవచ్చా, ఎన్ని రోజులు..!?

tollywood

పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ వారీగా రేట్లు దేనికి..? సినిమా ఎక్కడైనా సినిమాయే కదా… ఏ థియేటర్‌లో ఆడినా నిర్మాత వాటా, బయ్యర్ వాటా, ఎగ్జిబిటర్ వాటా సేమ్ కదా… థియేటర్ మెయింటెనెన్స్‌లో కూడా అంత భారీ తేడా ఏమీ ఉండదు… సరే, ఏదో కోణంలో అది సమర్థనీయమే అనుకుందాం… ఏసీని బట్టి, కుర్చీ తీరును బట్టి రేట్లు కూడా సరే అందాం… మళ్లీ ప్రీమియం, నాన్ ప్రీమియం ఏమిటి..? ఓహో, నాన్ ప్రీమియం అంటే పేదల కేటగిరీయా..? అంటే నేల క్లాసా..? అసలు ఎప్పుడైనా థియేటర్లలో ఈ కేటగిరీలు అమలవుతున్నాయా లేదా ఒక్కరైనా చెక్ చేశారా..? ఈ 25 శాతం కోటా అమలవుతోందా..?

అవును సార్, ఇది రెట్రాస్పిక్టివ్ జీవోయా..? ప్రాస్పెక్టివ్ జీవోయా..? ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలకు వర్తించదు అంటారేమిటి మంత్రి గారూ… అదెలా..? ఏపీలో 20 శాతం షూటింగ్ జరుపుకుంటేనే ఈ కొత్త రేట్లు అన్నారు కదా… మరి ఇప్పుడు షూటింగులు ముగిసి పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్న ఇతర సినిమాలకు కూడా ఈ మినహాయింపు, ఈ ఔదార్యం వర్తిస్తాయా సార్..? ఈ 20 శాతం షూటింగును ఎవరు నిర్ధారించాలి..? ఎవరు సర్టిఫై చేయాలి..? ఇన్నిరకాల మెలికలా జీవోలో..? ఇంత గందరగోళమా..? జగన్ సార్, ఈమధ్య చాలా అంశాల్లో తేడా కొట్టేస్తోంది… ఇదీ ఓ ఉదాహరణే…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions