Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆయనకు ఒకాయనతో… ఆమెకు మరొకామెతో… అదోతరహా మూవీ, బాగానే తీశాడు…

March 13, 2022 by M S R

….. Review :: John Kora…….   బధాయ్ దో.. (శుభాకాంక్షలు చెప్పండి) ”నిన్ననో మొన్ననో ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేట వరకు వెళ్లడానికి మెట్రో ఎక్కిన… స్టార్టింగ్ పాయింటే అయినా ఎల్బీనగర్‌లో స్టాండింగ్ పొజిషన్‌లో జర్నీ ప్రారంభించిన… దిల్‌షుక్‌నగర్ రాగానే మెట్రో ఫుల్ అయ్యింది… నా వెనుకే ఒక అంకుల్ పొట్టేసుకొని నిలబడ్డాడు… ప్రతీ స్టేషన్‌లో బ్రేక్ పడ్డ ప్రతీసారి ఆయన పొట్ట నాకు తగలడం… నాకు పరమ కంపరంగా అనిపించడం జరుగుతూనే ఉన్నది… సాటి మనుషులంటే నాకు ప్రేమే… కానీ తోడి ప్రయాణికుడి స్పర్శే నాకు ఇబ్బందిగా అనిపించింది…

ఎందుకంటే నా మగ మనసు ఒక ఆడ స్పర్శను కోరుకుంటుంది. అంతే కాని ఇలా మగ స్పర్శను కోరుకోదు. ఎందుకంటే.. నేను Straight.. అదే.. కేవలం ఆడవారికి మాత్రమే ఆకర్షించబడతాను” ఈ ముచ్చట పక్కన పెడితే… ఆడ మగ ఆకర్షణ.. ప్రేమ.. శృంగారం అనేది బాలీవుడ్, టాలీవుడ్ సహా ఏ వుడ్‌లో అయినా మంచి సబ్జెక్ట్. కానీ ఇక్కడ హర్షవర్దన్ కుల్‌కర్ణి అనే ఒక డైరెక్టర్ చాలా డేరింగ్ స్టెప్ వేశాడు.

ఆడ-మగ మధ్య ఉండే సహజమైన సంబంధాలకు భిన్నంగా… మనం రాసుకునే అసహజమైన సంబంధాల్ని సపోర్ట్ చేస్తూ ఒక సినిమా తీశాడు…ఇంత సోది.. ఇంత రాత అనవసరం.. కానీ మీకు చెప్పాలని అనిపించింది. ఎందుకంటే. ఇవాళ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన ‘బదాయ్ దో’ సినిమా చూసిన… ఆ సినిమా డైరెక్టర్ హర్షవర్దన్ కుల్‌కర్ణి చాలా డేర్ స్టెప్ తీసుకున్నాడు. చాలా సున్నితమైన అంశాన్ని చక్కగా డీల్ చేశాడు.

Ads

అసలు ఈ సినిమా కథ ఏంటంటే.. హీరో ఒక హోమో.. హీరోయిన్ ఒక  లెస్బో.. అంటే స్వలింగ సంపర్కులు… ఇద్దరి ఇళ్లలో కూడా కుటుంబ సభ్యులకు వారి గురించి తెలియక.. పెళ్లి చేసుకోమని పోరు పెడుతుంటారు. ఒక అనుకోని సంఘటన ద్వారా హీరో హీరోయిన్లకు పరిచయం అవుతుంది. కుటుంబ సభ్యుల కోసం పెళ్లి చేసుకొని.. ఎవరి లైఫ్ వాళ్లు బతుకుదామని డిసైడ్ అవుతారు. కానీ ఆ తర్వాత సమస్యలు మొదలవుతాయి.

హీరోకి ఒక బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్.. ఇంకో బాయ్ ఫ్రెండ్‌తో పరిచయం. హీరోయిన్‌కి ఇంకో అమ్మాయితో ప్రేమ. ఇంతలో ఇద్దరి కుటుంబ సభ్యులు పిల్లలు ఎందుకు పుట్టట్లేదని పోరు. చివరకు ఏమవుతుంది? ఇంట్లో తెలుస్తుందా? ఒక క్లిష్టమైన కథను దర్శకుడు ఎలా ముగించాడు? ఇది తెలుసుకోవాలంటే ‘Badhaai Do’ సినిమా చూడాల్సిందే.

హిందీలో హిట్ అయిన ‘Badhaai Ho’కి ఇది స్పిరిట్యువల్ సీక్వెల్. అంటే గత సినిమా నుంచి స్పూర్తి పొందినా.. ఆ కథకు కొనసాగింపు కాని కొత్త కథతో తీసిన సినిమా. మన దేశంలో LGBTQ వర్గాన్ని చాలా చిన్న చూపు చూస్తారు. వాళ్లేదో రోగగ్రస్తుల్లాగ.. దేశ ద్రోహుల్లాగ పరిగణిస్తుంటారు. కానీ వాళ్లూ అందరి లాంటి మనుషులే.. అది వారికి పుట్టుకతో వచ్చిన సహజమైన లక్షణం అని గుర్తించరు.

ఇలాంటి సున్నితమైన లైన్‌తో వచ్చిన ఒక చూడదగిన సినిమా. ఇంకాస్త బాగా తీయవచ్చు. కానీ దర్శకుడు మధ్యలో కాస్త తడబడినట్లు అనిపించింది. ఎండింగ్‌లో పిల్లాడు, దత్తత అనే కాన్సెప్ట్ కాకుండా వేరే విధంగా వారి వారి పార్ట్‌నర్స్‌తో కలపాల్సిందని నేను అనుకున్నా. మొత్తానికి హాయిగా చూసేయవచ్చు.

రాజ్ కుమార్ రావ్, భూమి పడ్నేకర్ ఇప్పటికే మంచి నటులు అని నిరూపించుకున్నారు. ఈ సినిమా కోసం రాజ్ కుమార్ కండలు పెంచి మిస్టర్ ఇండియాలాగ తయారయ్యాడు. భూమీ కూడా చాలా ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఇద్దరూ నటనలో పోటీ పడ్డారు. అయితే బధాయ్ దో సినిమా ఫిబ్రవరి 11నే థియేటర్లలో రిలీజ్ అయ్యింది. కానీ మహారాష్ట్ర సహా మిగతా ఉత్తర భారతంలో థియేటర్లు తెరవక పోవడంతో పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు. అయితే తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions