Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ది కశ్మీర్ ఫైల్స్… అనూహ్య ఆదరణ… అప్పుడే ఏడ్పులు, పెడబొబ్బలు షురూ…

March 14, 2022 by M S R

కశ్మీరీ ఫైల్స్… ఇప్పుడు ఇదొక సంచలనం… హైదరాబాదులో మొన్న 10 షోలు… నిన్న 40 షోలు… రేపు 100 షోలు అట… కుటుంబాలతో వెళ్లి చూస్తున్నారు సినిమాను… హౌజ్ ఫుల్… ఓ మిత్రుడు ఇలా రాసుకున్నాడు ఫేస్‌బుక్‌లో… ‘‘సినిమా అయిపోయింది. చాలా మంది ఎమోషనల్ గా ఉన్నారు. ఓ పాతికేళ్ల అమ్మాయి కన్నీళ్లు తుడుచుకుంటూ బయటికి వెళ్తోంది. వృద్ధులు బాగా ఎమోషనల్ అయిపోయి సీట్లలో నుంచి త్వరగా లేవడం లేదు. ఎక్స్ ప్రెషన్లు భారంగా ఉన్నాయి.

ఉన్నట్టుండి ఓ పెద్దాయన గట్టిగా భారత్ మాతాకి జై అని అరవడం మొదలుపెట్టారు. ఊహించని విధంగా జనం నుంచి ఫుల్ కోరస్. షాక్ అయ్యాను. ఆ తర్వాత శివాజీ మహరాజ్ కి జై అని, వందేమాతరం అని డోర్ దాటే దాకా స్లొగన్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఎవరైనా ఇది చెబితే నమ్మేవాడిని కాదు కానీ నేనే ప్రత్యక్ష సాక్షిని కావడంతో చివరి నిమిషంలో వీడియో తీయగలిగాను. నమ్మశక్యం కాని విషయం మొదటిసారి చూశాను మరి…

Ads

https://muchata.com/wp-content/uploads/2022/03/275687337_650381669573373_521834130591876880_n.mp4

దేశమంతటా ఇదే ట్రెండ్… ఐఎండీబీ ర్యాంకు 9.9… కొందరు టికెట్లు స్పాన్సర్ చేయడానికి ముందుకొస్తున్నారు… దేశమంతా షోల సంఖ్య పెరిగింది… రైట్ వింగ్ బలంగా ప్రమోట్ చేస్తోంది… మూడు రాష్ట్రాలు వినోదపన్ను రద్దు చేశాయి… ఒక్కసారిగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి పేరు మారుమోగిపోతోంది… సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ…

ఎవరో పిల్ వేశారు… సినిమాను ఆపేయాలట… ఎందుకంటే, మతవిద్వేషాలు పెచ్చరిల్లుతాయట… నిజానికి ఇదేమీ కల్పన కాదు… కమర్షియల్ సినిమా కాదు… ఆర్ఆర్ఆర్ వంటి పేర్లతో ప్రజానాయకులుగా ప్రాణాలకు తెగించి పోరాడినవారి చరిత్రల్ని భ్రష్టుపట్టించే చెత్తా ప్రయత్నం కూడా కాదు… స్మగ్లర్లను హీరోలుగా చూపించే పుష్పం కూడా కాదు… హీరోలు, హీరోయిన్లు, పిచ్చి గెంతులు, బూతుపాటలు, వెకిలి కామెడీలు, చెత్తా ఫైట్ల ఫార్ములా సినిమా కాదు… కశ్మీరీ పండిట్లపై వేర్పాటువాదులు, మతం పేరిట సాగించిన దుర్మార్గాలనే దర్శకుడు చూపించాడు… కథ ఓ చరిత్ర… దాచాలంటే దాగేది కాదు…

the kashmir files

ఎన్ని వేల మంది మరణించారో, ఎన్ని లక్షల మంది వలస వెళ్లారో… లెక్కలేదు…!! అక్కడ మెజారిటీగా ఉన్న మతం మరో మతం ఉండకూడదని నరమేధానికి పాల్పడితే… అది చూపిస్తే అందులో తప్పేముంది..? విచిత్రం ఏమిటంటే..? చీమ చిటుక్కుమన్నా సరే బీజేపీయే కారణమని తిట్టిపోసే ఒక బ్యాచ్ ఉంటుంది కదా, అప్పుడే ఈ సినిమాపై నెగెటివ్ రాతలకు దిగాయి…

దీనికి తగినట్టే రైట్ వింగ్ సినిమాను బాగా ప్రమోట్ చేస్తుండటంతో ఇక అకారణ హిందూ ద్వేషులకు చిర్రెత్తుకొస్తోంది… అసహనం ఆపుకోలేకపోతున్నారు… కశ్మీర్‌‌లో వేర్పాటువాదాన్ని, హింసను సమర్థించడమే హక్కులవాదం, లౌకికవాదం, ప్రజాస్వామ్యవాదం ఇన్నాళ్లూ… రాజకీయ నాయకులు, మీడియా, సోకాల్డ్ మేధావులు… అందరూ బాధితుల్ని వాళ్ల కన్నీటికి వాళ్లను వదిలి, నిందితుల పక్షాన నిలబడ్డారు…

పంజాబ్‌లో ఖలిస్తానీయుల హింస, ఇందిర హత్యానంతరం సిక్కులపై సాగిన హత్యాకాండ, గోద్రా దుర్మార్గం, గుజరాత్ అల్లర్లు… దేశవిభజనవేళ మతవిద్వేష జ్వాలలు… అంతెందుకు..? ఈరోజుకూ అఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో మైనారిటీల దుర్గతి ఏంటి..? వాళ్లపై సాగుతున్న దాడులు, వలసలు… ఇవన్నీ సంఘటనలు… పత్రికల్లో వార్తలు, టీవీల్లో వార్తలు రావడం లేదా..? ఈ సినిమా కూడా అంతే… నాటి కశ్మీర్ ఊచకోతల గురించి నేటితరం తెలుసుకుంటుంది, తప్పేముంది..?

నిజానికి కశ్మీరీ హిందువుల ఊచకోత మీద సినిమా ఇదే తొలిసారి ఏమీ కాదు… గత ఏడాదే విదు వినోద్ చోప్రా ‘షికారా’ అనే సినిమా తీశాడు… కానీ పెద్దగా క్లిక్ కాలేదు… ఇప్పుడు తీసిన కశ్మీరీ ఫైల్స్ కొంత డాక్యుమెంటరీ తరహాలో… రా రియాలిటీ (కచ్చా బాదం) సీన్లు రాసుకుని, వయోలెన్స్ డోస్ పెంచారు…

ఇదేమీ బీజేపీ సినిమా కాదు, సంఘ్ సినిమా కాదు… హిందుత్వ భావనావాహిని కూడా కాదు… ప్రతిదీ యాంటీ-బీజేపీ కళ్లద్దాలతో చూడాల్సిన పనిలేదు… ఇంటినీ ఊరినీ వదిలేసి, ప్రాణభయంతో, ఊచకోతల్ని తప్పించుకుని, ఎక్కడెక్కడికో పారిపోయి బతికే సగటు కశ్మీర్ హిందువు జీవనవిషాదం ఈ సినిమా..!! చివరగా :: గుజరాత్ ఫైల్స్ తీయాలనేది తాజా డిమాండ్… తీయాలి, ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు… కానీ గోధ్రా రైలు దురాగతాన్ని వదిలేసి తీయకూడదు… సోకాల్డ్ ఇండియన్ మేధావుల డొల్ల బుర్రల్లాగా…!! (ఇది ఆ సినిమా మీద రివ్యూ కాదు…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions