Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కేసీయార్‌కు బండి సంజయ్ థాంక్స్ చెప్పాలి… ఖాళీగా ఉంచడం లేదు…

March 14, 2022 by M S R

నిజానికి బండి సంజయ్ కేసీయార్‌కు, కేటీయార్‌కు, టీఆర్ఎస్‌కు థాంక్స్ చెప్పాలి… సంజయ్ చేతిలో అస్త్రాలు ఏమీ లేనప్పుడు, బాధపడకు, మేం ఇస్తాం కదా అస్త్రాలు అని ముందుకొస్తున్నారు కేసీయార్, కేటీయార్… పార్టీలోనే సంజయ్‌కు తలనొప్పులున్నయ్, తనను వీక్ చేసే ప్రయత్నాలూ ఉంటయ్… పైగా మాటిమాటికీ కేసీయార్‌ను జైలులో వేస్తాం అనే నిరర్థక మాటలు తప్ప సంజయ్ దగ్గర ప్రభుత్వంపై విరుచుకుపడే అస్త్రాలేమీ ఉండటం లేదు… తెరవెనుక బీజేపీ, టీఆర్ఎస్ నడుమ సత్సంబంధాలే ఉన్నాయనే సందేహాలు కూడా తెలంగాణ సమాజంలో ఉన్నయ్…

కాకపోతే బీజేపీకి తెలంగాణ మీద ఆశ ఉంది… రాజకీయ పార్టీగా అందులో తప్పులేదు… అధికారాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నం టీఆర్‌ఎస్ కూడా చేస్తుంది, అదీ సహజమే… అందుకే కేసీయార్‌తో బీజేపీ, బీజేపీతో కేసీయార్ ‘‘తెలివైన గేమ్’’ ఆడుతున్నారు… అయితే తెర మీద ప్రజలకు ఏం కనిపిస్తున్నదో దాన్నే ఓసారి విశ్లేషించుకుందాం ఓసారి…

గతంలోనైతే బీజేపీని పులుసులో ఈగలాగా తీసిపారేసేవాడు కేసీయార్… కానీ ఇప్పుడలా లేదు… కాంగ్రెస్‌లో ఉన్నట్టుగానే బీజేపీలోనూ ‘‘తన మనుషులున్నారట’’… అయితే గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఏకంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్నాక కేసీయార్‌కు కాస్త ఆలోచన మొదలైంది… దుబ్బాకలో ఓటమి మరో షాక్… ఇక హుజూరాబాద్ ఓటమి అయితే కేసీయార్‌ పొలిటికల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ షాక్… ఇప్పుడు తను బీజేపీనే ప్రధాన ప్రత్యర్థిగా పరిగణిస్తున్నాడు…

Ads

నిజానికి కేసీయార్ ప్రభుత్వం మీద, మరీ అరాచకంగా వ్యవహరిస్తున్న కొందరు ప్రజాప్రతినిధుల తీరు మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను బీజేపీ వాడుకోలేకపోతోంది… ఫీల్డ్‌లో పెద్ద యాక్టివిటీ ఏమీ లేదు… ఈలెక్కన రేవంత్‌రెడ్డే నయం కాస్త… నేరుగా జనంలోకి వెళ్తున్నాడు… తనకు పగ్గాలేసి వెనక్కి లాగడానికి కాంగ్రెస్‌లోనే బోలెడు మంది ఉన్నా సరే, జనం కంటాక్టులో ఉంటున్నాడు… బీజేపీలోనే అప్పుడప్పుడూ నైరాశ్యం కనిపిస్తోంది… అలాంటప్పుడు బండి సంజయ్‌కు కేసీయారే అపద్బాంధవుడిలా కనిపిస్తున్నాడు, విమర్శలకు స్కోప్ తనే క్రియేట్ చేస్తున్నాడు…

గ్రేటర్ ఎన్నికలప్పుడు కేసీయార్ మీద ‘‘యాంటీ-హిందూ’’ ముద్ర వేసింది బీజేపీ… కేసీయార్ క్యాంపు ఉలిక్కిపడింది… దేశంలోకెల్లా పెద్ద హిందువు అనే క్యాంపెయిన్ చేసుకుంది… ఒవైసీతో పొత్తు లేదు అని తూతూమంత్రం ప్రకటనలకు దిగింది… ఐనా జనం పెద్దగా నమ్మలేదు… కేసీయార్‌కు చేదు ఫలితాలు కనిపించినయ్… బండి సంజయ్ హార్డ్‌కోర్ మిలిటెంట్ తరహా నాయకుడు… తనకు చాలా సబ్జెక్టుల్లో గ్రిప్ లేకపోవచ్చు గానీ అవసరమైతే హఠాత్తుగా ఫీల్డులోకి స్వయంగా దిగిపోయే బాపతు… అది కేసీయార్ గుర్తించలేక, సంజయ్‌ను ఇంకా కరీంనగర్ కార్పొరేటర్ రేంజులోనే చూస్తున్నట్టున్నాడు…

మొన్నామధ్య సర్జికల్ స్ట్రయిక్స్ ఆధారాలు చూపించాలన్నాడు కేసీయార్… చైనా మన ప్రాంతాల్ని ఆక్రమించేసుకుంటోందనీ అన్నాడు… ఏవో పత్రికల్లో వచ్చే వార్తల ఆధారంగా ఆరోపణలు… పైగా సర్జికల్ స్ట్రయిక్స్, ఆధారాలు అడగడం వంటివి మరీ రాహుల్, మమతల స్థాయి నాసిరకం పొలిటికల్ దాడులు… అవీ పాతబడ్డయ్, కేసీయార్ ఆ విఫల అస్త్రాలను పట్టుకున్నాడు దేనికో… కేసీయార్ యాంటీ హిందూ మాత్రమే కాదు, యాంటీ నేషన్ కూడా అనే ముద్ర వేయడానికి బీజేపీకి అవకాశమిచ్చాడు… ఇస్తున్నాడు…

ఇక ఇప్పుడు తాజాగా కేటీయార్ ఆర్మీ మీద బెదిరింపులకు దిగాడు… అదీ శాసనసభలోనే… కంటోన్మెంట్‌కు పవర్, వాటర్ కట్ చేస్తామన్నాడు… బండికి మళ్లీ దొరికిపోయారు… టీఆర్ఎస్ మీద ప్రతిదాడికి, పొలిటికల్‌గా వాడుకోవడానికి విమర్శలు స్టార్ట్ చేసేశాడు… నిజానికి ఆర్మీ వ్యవహారాలతో కాస్త జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది… అదీ మెచ్యూర్డ్ పాలిటిక్స్… ఆర్మీతో గోక్కుంటే కొన్నిసార్లు అనవసర ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉంది… పైగా కాస్త పెట్రోల్ పోయడానికి బీజేపీ రెడీగా ఉంది… కేసీయార్ యాంటీ నేషన్ అని ఇంకా బలంగా ముద్ర వేయడానికి చేజేతులా కేసీయారే చాన్స్ ఇస్తున్నాడు…

ఎస్, కంటోన్మెంట్ ఏరియాలో కొన్ని ఇష్యూస్ ఉన్నయ్… రక్షణ శాఖతో డీల్ చేయడానికి చాన్సుంది… ఇదే కేసీయార్ గతంలో ఓసారి అసలు కంటోన్మెంట్ భూమికీ ఆర్మీకి సంబంధం లేదనీ, పాత నిజాం రాజు ఆ భూమిని అధికారికంగా ఏమీ ఇవ్వలేదనీ మాట్లాడాడు… దాంతో ఒరిగేది ఏముంది..? అప్పటి హైదరాబాద్ రాజ్యం ఇప్పుడు లేదు, మూడు ముక్కలై మూడు రాష్ట్రాల్లో కలిసిపోయింది… ఎప్పుడైతే నిజాం రాజు తలదించుకుని, తన రాజ్యాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేశాడో ఆ దేశానికి సంబంధించిన అన్ని ఆస్తులూ భారత ప్రభుత్వం సొంతం అయిపోయాయి…

ఇప్పుడు కొత్తగా ఆ ప్రాంత యాజమాన్య హక్కుల మీద మాట్లాడటంతో వచ్చే పొలిటికల్ ప్రయోజనం ఏముంది..? కేసీయార్ బయటికి ఏం మాట్లాడుతున్నా ఒక నిజాన్ని మరిచిపోతున్నాడు… ఈ దేశంలో ఫెడరల్ స్పిరిట్ అనేది జస్ట్, మాటల్లో చెప్పుకోవడానికే… మన రాజ్యాంగం, మన చట్టాల ప్రకారం కేంద్రమే అల్టిమేట్… రాష్ట్రాల అధికారాలు చాలా పరిమితం…

బీజేపీ దీన్ని ఇంకా మార్చి, ఇంకా బలమైన కేంద్రం కావాలని, చిన్న రాష్ట్రాలు ఉండాలని, అప్పుడే దేశం సుస్థిరంగా ఉంటుందనీ, ప్రాంతీయ రాజకీయ శక్తులు బలపడితే దేశానికి అరిష్టమనీ భావిస్తుంది… ఈ స్థితిలో ఆర్మీ మీద బెదిరింపులకు దిగడం, పొలిటికల్లీ నాట్ కరెక్ట్..! అప్పుడే కొందరు ఆర్మీ అధికారులు కేటీయార్ మీద సోషల్ మీడియాలోనే విమర్శలకు దిగారు… ఇలాంటి పరిణామాలు మంచివి కావు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions