హేమయ్యా రాజమౌళీ… ఓ కేపిటల్ అమరావతీ ప్లానరూ… సరే, జగన్‌ను కలిశావు, టికెట్ల ధరలు పెరిగినయ్… నీకు హేపీ… నువ్వు నీ సినిమా భారీ అని చెప్పడానికి 177 కోట్ల ఖర్చు చూపించావుట… నిజమేనా..? కాదు, కాదు, 350 కోట్లు చూపించాడు అని మరో వార్త… జీవో ప్రకారం హీరో, హీరోయిన్, దర్శకుడి పారితోషికాలు మినహాయించి అట…. అవునూ, హీరోలు, హీరోయిన్లు అనాలా..? లేక ఒకరే హీరో చూపించావా..? అయితే ఆ హీరో ఎవరు..? ఆ హీరోయిన్ ఎవరు…?
ఎందుకంటే..? నీ ప్రతి అడుగు ఓ దందా… క్రియేటివిటీ లేదు, మన్నూమశానం ఏమీ లేదు, కాపీ చేస్తున్నామా..? జనాన్ని పిచ్చోళ్లను చేస్తున్నామా అనేది వేరే కథ… ఇందులో నువ్వు హీరోగా చూపించింది ఎవరిని..? ఎహె, ఆ పేర్ని నానిని వదిలెయ్… తనకేం తెలుసు..? జగన్‌కు ఎవరో పాత హీరోయిన్లు తెలిసి ఉంటారు తప్ప, రాజకీయాల్లో వచ్చాక ఏ హీరోయిన్ కనబడదు తనకు…
అప్పట్లో ఏం చెప్పారు..? తొలి లుక్కు అంటూ ఏం చూపించారు…? ఎవరో హాలీవుడ్ హీరోయిన్ అన్నావు… పేరు ఒలివియా మోరిస్… ఇప్పటికీ నీ సినిమా వికీలో ఆమె పేరు కనిపిస్తోంది నటీనటుల జాబితాలో…? ఆమె మాత్రమే కాదు… అలిసన్ డూడీ పేరు కూడా…! ఇంతకీ వాళ్లు ఉన్నారా భయ్యా..? నువ్వు ఏది చెప్పినా అబద్ధమే కాబట్టి డౌటొస్తోంది…
Ads
బాగా ఎండుకుపోయిన ఆ ఆలియా భట్ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది… డాన్సులు చేస్తోంది… ప్రమోషన్ యాక్టివిటీస్‌లో ఉంది… చివరకు ఆ కపిల్ శర్మ షోలో కూడా కనిపించింది… సరే గానీ… మరి ఈ హాలీవుడ్ హీరోయిన్లు ఉన్నట్టా..? లేనట్టా..? సగటు ప్రేక్షకుడిగా… రెండుమూడు వేల కోట్లకు స్పాట్ పెట్టావు కదా, మా పైసలే కదా… అందుకే అడగాలని ఓ కుతూహలం మాకు…! నువ్వు చెప్పే ఆ మూడు నాలుగు వందల కోట్ల ఖర్చు అనేదే పెద్ద డౌట్… అఫ్కోర్స్, ఆడిట్ ఎవడు చేయాలి..? అదంతా వదిలేస్తే ఆ తెల్ల మొహాలు ఉన్నట్టా..? లేనట్టా..?
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ యాక్టివిటీలో ఎక్కడా వీళ్లిద్దరి జాడలేదు… చివరకు శ్రియాసరన్ పేరు కూడా వినిపించడం లేదు… రాంచరణ్, ఎన్టీయార్, ఆలియా… ప్లస్ నువ్వు… అంతేనా..? ఇక వేరే వాళ్లు ఎవరూ లేరా సినిమాలో… బొచ్చెడు భాషలు అంటున్నవ్, పాన్ వరల్డ్ అంటున్నవ్, డోల్బీ అంటున్నవ్, త్రీడీ అంటున్నవ్, వేల కోట్లు అంటున్నవ్… మరి వీళ్లేమయ్యారు..? చెప్పాలి కదా…
మొత్తం కథ నుంచే కత్తిరించి పారేశావా..? అప్పట్లో ఓ తెల్ల హీరోయిన్ షూటింగుకు హాజరైందని వార్తలు కూడా కనిపించినయ్… అసలు వీళ్లంతా ఏమయ్యారు..? సస్పెన్స్, సర్ప్రయిజ్ ఫ్యాక్టరా..? అవునులే, బ్రిటిష్ పోలీసుగా కనిపించే రాంచరణ్‌ను మించిన సర్ప్రయిజ్, షాకింగ్ ఏముంటుంది..? ఫాఫం, వీళ్ల గతేమైందో చెప్పాలి కదా… అరె, సగటు ప్రేక్షకుడిగా మా ప్రశ్న బాస్ ఇది… నువ్వెలాగూ ఓపెన్‌గా ఉండవు… ప్రతిదీ జనాన్ని మోసగించేదే… కనీసం నీ హీరోయిన్ల దుర్గతి ఏమిటో చెప్పు భయ్…!! డీజే టిల్లు హీరోయిన్ బాడీ మీద పుట్టుమచ్చలు అడిగే ఆ వెగటు జర్నలిస్టులైనా ఓమాట అడగొచ్చు కదా…!!
Share this Article