ఫాఫం సాక్షి… ఫాఫం జగన్… వ్యర్థ కథనాలతో తెల్లారిలేస్తే బోలెడు జగన కీర్తనలు అచ్చేసే పత్రిక కొన్ని సందర్భాల్లో మాత్రం జగన్ వాయిస్‌లా మారలేక చతికిలపడుతోంది… జగన్ భజన తప్ప దానికి వేరే దిక్కులేదు, పత్రిక పెట్టుకున్నదే తన కోసం… దాని కేరక్టర్ అదే… దాగుడుమూతలు, పాత్రికేయ పాతివ్రత్యాలు కుదరవు… అదే ఆంధ్రజ్యోతి చూడండి, చంద్రబాబుకు ఓ కుడిభుజంగా పనిచేస్తోంది… పార్టీ నేతలకూ చేతకాని రీతిలో కష్టపడుతోంది…
ఎటొచ్చీ సాక్షికే చేతకావడం లేదు… పెగాసస్… ఆమధ్య రచ్చ రచ్చ అయ్యింది కదా… ఇజ్రాయిల్ నుంచి మోడీ ప్రభుత్వం ఈ స్పైవేర్ కొని… జర్నలిస్టులు, నాయకులు, జడ్జిలు, న్యాయవాదులు, ఉద్యమకారులు, ప్రజాస్వామికవాదులు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాళ్ల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్టు ఆరోపణలతో మోడీ ప్రభుత్వం కాస్త ఆత్మరక్షణలో పడ్డ సంగతి తెలుసు కదా… మరి ఆ వివాదాస్పద స్పైవేర్‌ను చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేసినట్టు సాక్షాత్తూ ఓ ముఖ్యమంత్రి మమత బెనర్జీ వెల్లడించింది…
తన దగ్గరకు కూడా ఆఫర్ వస్తే తిరస్కరించానని చెబుతోంది ఆమె… అధికారికంగానే చెప్పింది… వెంటనే వైసీపీ క్యాంపు పట్టుకోవాలి కదా… ప్రత్యేకించి సాక్షి పత్రిక, సాక్షి టీవీ పట్టేసుకుని డిబేట్‌కు పెట్టాలి కదా… జగన్ ప్రభుత్వమే కదా అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీవెంకటేశ్వరరావును బజారుకీడ్చి రచ్చ చేసింది… ఆయన కొడుకు పేరిట పెట్టబడిన కంపెనీ ద్వారా ట్యాపింగ్, హ్యాకింగ్ పరికరాల కొనుగోలుకు ప్రయత్నాలు చేసినట్టు జగన్ ప్రభుత్వమే కదా ఆరోపించింది…
Ads
చంద్రబాబు క్యాంపు దాన్ని ఖండిస్తూ వచ్చింది కదా… అలాంటప్పుడు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం దాన్ని కొనుగోలు చేసిందని చెప్పినప్పుడు వెంటనే సాక్షి అందుకోవాలి కదా… అబ్బే, తుస్… సేమ్, వైసీపీ హెడ్డాఫీసులో ఇలాంటివి వెంటనే పట్టుకుని, ఎవరెవరికి ఏ సూచనలు చేయాలో చెప్పేవాళ్లు లేరు, మళ్లీ జగన్ రంగంలోకి దిగి, ఆయా అంశాల పొలిటికల్ ఇంపార్టెన్స్ గ్రహించి స్పందిస్తే తప్ప… మమత వ్యాఖ్యల తరువాత సాక్షిలో పేలిపోయే స్టోరీ వస్తుందని బాబు వ్యతిరేకులు ఆశపడ్డారు… కానీ ఏం జరిగింది..?
ఫస్ట్ పేజీలో, న్యూస్ రీల్ అంటూ ఓ చిన్న ముక్క పెట్టి… లోపల పేజీలో ఆరేడు వాక్యాలతో కట్టె కొట్టె తెచ్చే తరహాలో మమ అనిపించి చేతులు దులుపుకుంది… (నిజంగా ఆంధ్రజ్యోతి ఆ ప్లేసులో ఉండి ఉంటే రచ్చ రచ్చ చేసేది…) మెల్లిగా మేల్కొన్న వైసీపీ అంబటి రాంబాబుతో ఏదో ప్రెస్‌మీట్ పెట్టించింది… కానీ సజ్జల వంటి ప్రధాన సలహాదారు మాట్లాడి ఉంటే బాగుండేది… అంబటితో సమస్య ఏమిటంటే హావభావాలు ఎక్కువ, విషయ వివరణ తక్కువ…
నిజానికి లోకేష్ భుజాలు తడుముకుని, మమతకు సరైన సమాచారం తెలిసినట్టు లేదు అని స్పందించాక గానీ వైసీపీకి వెలగలేదు… తరువాత మరో టీడీపీ నాయకుడు కూడా… ‘‘అబ్బే, అదేమీ లేదు, ఐనా సదరు పెగాసస్ కొనలేదని మొన్నటిదాకా మీ డీజీపీగా ఉన్న గౌతమ్ సావంగే చెప్పాడు కదా’’ అని వ్యాఖ్యానించాడు… మెల్లిగా కళ్లు తెరుచుకుని, నులుముకుని, సాక్షి టీవీలో ఓ స్టోరీ వేశారు… సాక్షి పత్రిక కూడా ఇక తప్పదు అన్నట్టుగా అశ్శరభశ్శరభ అంటూ ఫస్ట్ పేజీలో బ్యానర్ కుమ్మేసింది…
ఆ కథనంలో కూడా వోటర్ల డేటా తస్కరణ, ఐటీ గ్రిడ్స్ వంటి పెగాసస్‌కు సంబంధం లేని అంశాలు రాసుకుంటూ పోయింది… ఏబీ వెంకటేశ్వరరావు కొనుగోలు చేయాలనుకున్న పెగాసస్ వేరు… (లేదా అంతకుమించిన నిఘా సాఫ్ట్ వేర్, పరికరాలు కూడా కావచ్చు)… సరే, మీడియాను ఉపయోగించుకోవడం అనేది జగన్ క్యాంపుకి తెలియదు… సొంత మీడియా వాడకంలోనూ ఇలా పూర్… వాళ్ల సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ కథలు మరీ అయోమయం, గందరగోళం…
ఇవన్నీ సరే గానీ… ప్రజాశక్తిలో ఓ చిన్న బిట్ భలే ఇంట్రస్టింగుగా అనిపించింది… ఏమండీ, మమత అలా చెబుతోంది కదా, మీరేమంటారు, పెగాసస్ కొనలేదని గౌతమ్ సావంగే స్వయంగా చెప్పాడు కదాని తెలుగుదేశం చెబుతోంది, నిజమేమిటి అని విలేఖరి అడిగితే… అదేమిటో సావంగ్‌నే అడగండి అని డీజీపీ ఆఫీసు దులిపేసుకుందట… సదరు విలేఖరి సావంగ్‌కు ఫోన్ చేసి, అడిగితే… నేనిప్పుడు డీజీపీగా లేను కదా అని పెట్టేశాడట..!!
Share this Article