నిజంగా ఇది కేవలం సాక్షి సమస్య మాత్రమే కాదు… ఇన్నాళ్లు పత్రికల మేనేజ్‌మెంట్ తీరు వేరు… ఇప్పుడు ప్రింట్ మీడియా మునుపెన్నడూ లేనన్ని సవాళ్లను ఎదుర్కుంటోంది… సంక్షోభం వైపు వెళ్తోంది… మూలిగే నక్క మీద అన్నట్టుగా కరోనా వచ్చి మరింత దెబ్బ తీసింది… చాలా షట్టర్లు మూతపడ్డయ్… తాళాలు పడ్డయ్… వేగంగా మీడియా సంస్థలు డిజిటల్ ఎడిషన్స్, వీడియో ఎడిషన్స్ వైపు వెళ్లిపోతున్నయ్… ఈ స్థితిలో సస్టెయినబులిటీ కోసం పలు మీడియా సంస్థలు ‘మేనేజ్‌మెంట్ మాడ్యూల్స్’ మార్చుకుంటున్నయ్… ప్రయోగాలు చేస్తున్నయ్… ఇప్పుడు సాక్షి చేస్తున్నదీ అదే…
పైస్థాయిలో సిస్టం మార్చుకుంటూ వెళ్తే సరిపోతుందా..? దిగువ లేయర్స్‌లో కమిట్‌మెంట్, క్వాలిటీ, డైరెక్షన్ మాటేమిటి అనేది ఓ కీలకప్రశ్నే… కానీ ఇప్పుడు ప్రింట్ మీడియా ఉన్న దురవస్థలో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ తప్ప వేరే మార్గం లేదు… కొత్త ప్రయోగాల ఫలితాల్ని అప్పుడే అంచనా వేయలేం, వేచిచూడాల్సిందే… అయితే సాక్షిలో ఏం జరుగుతోంది..?
ఇప్పటిదాకా సీఈవోగా ఉన్న వినయ్ మహేశ్వరి బయటికి వెళ్లిపోయాడు… కారణాలు ఏమైనా కావచ్చు… కానీ అడ్మినిస్ట్రేషన్ కోణంలో ఓ కుదుపు… ఆయన స్థానంలోకి జగన్ సన్నిహితుడు, ఆడిటర్ సనత్‌రెడ్డి వచ్చి చేరాడు… మొత్తం భౌగోళికంగా సాక్షిని నాలుగు భాగాలు చేశారు… 1) మెట్రోస్, అంటే ప్రధాన నగరాలు 2) తెలంగాణ, అంటే రూరల్ తెలంగాణ 3) హైదరాబాద్, అంటే జంటనగరాలు, నిజానికి సర్క్యులేషన్, మార్కెటింగ్, బ్రాండ్ ఇమేజీ వంటి కోణాల్లో ఇది ఏ మీడియా సంస్థకైనా గుండెకాయ 4) ఆంధ్రప్రదేశ్, అంటే పొలిటికల్‌గా సాక్షికి కీలకమైన ప్రాంతం… నాలుగు భాగాలకు నలుగురు ఇన్‌చార్జుల్ని పెట్టారు… ఆయా ప్రాంతాలకు ఇక వాళ్లే సీఈవోలు, ఎండీలు, బాసులు, హెడ్డులు, చీఫులు…
వాళ్ల అధికార పరిధులు, బాధ్యతల మీద ఇంకా ఎవరికీ స్పష్టత లేనట్టుంది… కానీ తమ పరిధిలోని అన్ని అంశాలను పరిశీలిస్తూ, సమీక్షిస్తూ, అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ అల్టిమేట్‌గా డైరెక్టర్స్ బోర్డుకు, చైర్‌పర్సన్ భారతిరెడ్డికి రిపోర్ట్ చేయాలి… ఆచరణలో కొన్ని సవాళ్లు ఉంటయ్… బట్, సహజం… తమకు కేటాయించిన ప్రాంతాల్లో సస్టెయినబులిటీ, ప్రోగ్రెస్… ఇవీ లక్ష్యాలు… నిజానికి ఒక్కో మీడియా సంస్థలో ఒక్కో తీరు…
Ads
ఉదాహరణకు నమస్తే తెలంగాణలో ఎడిటర్ సుప్రీం… తను కేసీయార్‌కు జవాబుదారీ… ఇప్పుడు యూనిట్ ఇన్‌చార్జులను బలోపేతం చేసి, ఎక్కువ అధికారాలను, బాధ్యతలను అప్పగించారు… ఇదొక మాడ్యూల్… ఈనాడులో కూడా యూనిట్ ఇన్‌చార్జులకు పెత్తనాలు ఇచ్చారు… కానీ అది సత్ఫలితాలు ఇవ్వకపోగా, వికటిస్తోందని తాజాగా అనంతపురం మేనేజర్ కథ చెబుతోంది…
ఆంధ్రజ్యోతి వేరు… సర్వాధికారి ఎండీ… బేసిక్‌గా ఏపీ, తెలంగాణ, హైదరాబాద్, అన్ని ఎడిషన్లకూ హెడ్డు… హైదరాబాద్ హెడ్డాఫీసే… భౌగోళికంగా వేర్వేరు పగ్గాలు, పెత్తనాలు లేవు… ఇక వాట్సప్ ఎడిషన్స్, ఫ్రాంచైజీ ఎడిషన్స్, నామ్‌కేవాస్తే ఎగ్జిస్టెన్స్, వెబ్ పత్రికల యాజమాన్యాలు వేరువేరు… టీవీ మీడియా మరింత డిఫరెంట్…
తెలుగు పత్రికలే కాదు, జాతీయ పత్రికలు, ఇతర రాష్ట్రాల్లో మంచి సర్క్యులేషన్ ఉన్న పెద్ద పత్రికలు కూడా చాలా ప్రయోగాలు చేస్తున్నయ్… బ్రాండ్ ఇమేజీ పెంచుకోవడం, క్వాలిటీ పెంచుకోవడం, ఈ డిజిటల్ యుగంలో పత్రికను కొత్త దిశలో తీసుకుపోవడం, దశ మార్చడం, కొత్త తరహా యాడ్స్… అన్నీ సవాళ్లే… తప్పదు, పత్రికారంగం మనుగడలో స్థిరత్వం కోసం ప్రయోగాలు తప్పవు…
జగన్, భారతిరెడ్డి ప్రయారిటీలు, పనుల ఒత్తిడిలో సాక్షి మీద కాన్సంట్రేట్ చేయడం అస్సలు కుదరదు, నమ్మకస్తులు కావాలి… మేనేజ్‌మెంట్ తెలిసిన పెద్ద తలకాయలు కావాలి… దాంతో వాళ్లు అనుకున్న మార్పులు చేయకతప్పడం లేదు… అయితే దిగువ స్థాయిలో పెచ్చుపెరిగిన వాల్యూ డిగ్రెడేషన్ మాటేమిటి..? సాక్షిలో మాత్రమే కాదు, అన్ని పత్రికల్లోనూ..! అన్ని మీడియా సంస్థల్లోనూ..!! అవునూ… సాక్షి టీవీలోనూ ఇలా ఏమైనా మార్పులు ఉంటాయా ప్రభూ..?!
Share this Article