ది కశ్మీర్ ఫైల్స్ రచ్చ ఇప్పట్లో ఆగదు… మనం ఇప్పుడు ఆ చర్చలోకి అడుగు పెట్టడం లేదు… అది సరేగానీ, ఒక వార్త సుబ్రహ్మణ్యస్వామి బాపతు సైటులో కనిపించింది… అస్సలు నమ్మబుల్ అనిపించలేదు మొదట్లో… ఆ వార్త ఏమిటంటే..? ‘‘జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం (లెఫ్టినెంట్ గవర్నర్) ఆర్టికల్ 370 ఎత్తేసిన తరువాత గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆహ్వానించి, పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాల్లో పడింది… అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన అత్యున్నత బిజినెస్ టీం ఒకటి పెట్టుబడుల అవకాశాల్ని పరిశీలించడానికి ఆల్‌రెడీ కశ్మీర్‌కు రానుంది…
ఈ ప్రభుత్వం శ్రీనగర్‌లో నాలుగు రోజుల గల్ఫ్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ నిర్వహిస్తోంది… దాదాపు 36 దేశాలకు ప్రాతినిధ్యం వహించే 34 మంది డెలిగేట్స్ అటెండవుతున్నారు… వీరిలో ఇండియన్ రూట్స్ ఉన్నవాళ్లు కూడా ఉన్నారు… మంగళవారం ఈ సమ్మిట్‌కు హాజరైన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సింహా మాట్లాడుతూ ఇప్పటికి 27 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి అన్నిరకాల అనుమతులనూ క్లియర్ చేశామని చెప్పాడు…
అవన్నీ గ్రౌండయితే ఆరేడు లక్షల మందికి ఉపాధి దొరుకుతుందన్నాడు… కనీసం 70 వేల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని తీసుకురాగలమనే నమ్మకం ఉంది… మా ప్రయత్నాలు కొనసాగుతాయి… రెండు నెలల క్రితం సింహా దుబయ్ వెళ్లి పలు ఎంవోయూలపై సంతకాలు చేసి వచ్చాడు… దానికి కొనసాగింపే ఈ గల్ఫ్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్… జమ్ముకశ్మీర్ పరిశ్రమలు, వాణిజ్యం విమానయాన శాఖ బిజినెస్ సెక్రెటరీ రంజన్ ప్రకాష్ ఠాకూర్ మాట్లాడుతూ అరబ్ ఎమిరేట్స్ మాత్రమే గాకుండా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్‌తోనూ సంప్రదింపులు సాగుతూనే ఉన్నాయన్నాడు…
Ads
ఇప్పటికే దుబయ్‌లోని జుమెరాహ్ టవర్స్‌లో ఓ మేజర్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏర్పాటు చేశామని ఠాకూర్ వివరించాడు… ప్రస్తుతం గల్ఫ్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌కు వచ్చిన ప్రతినిధుల బృందం టూరిజం, హాస్పిటాలిటీ రంగాల్లో పెట్టుబడుల అవకాశాల్ని పరిశీలించడానికి దక్షిణ కశ్మీర్ (పహల్‌గావ్), ఉత్తర కశ్మీర్ (గుల్‌మార్గ్) పర్యటించనుంది… గత జనవరిలో జమ్ముకశ్మీర్ ప్రభుత్వం అల్ మాయ గ్రూప్, MATU ఇన్వెస్టెమెంట్స్, జీఎల్ ఎంప్లాయ్‌మెంట్ బ్రోకరేజ్, సెంచురీ ఫైనాన్షియల్, నూన్ ఈ-కామర్స్ తదితర సంస్థలతో ఎంవోయులను కుదుర్చుకుంది…’’
…… ఇదండీ వార్త… కశ్మీర్‌లో, అదీ శ్రీనగర్‌లో అనేక దేశాల ప్రతినిధులతో పెట్టుబడుల సదస్సు అనే వార్త చదవడానికే ఆశ్చర్యంగా ఉంది… ఆల్‌రెడీ 27 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయనడం ఆ ఆశ్చర్యాన్ని రెట్టింపు చేస్తోంది… ఆర్టికల్ 370 ఎత్తేసిన తరువాత ఆ ప్రాంతంలో యాక్టివిటీ పెరిగింది… ఇన్నేళ్లూ అక్కడ ఎవరూ స్థిరాస్తి కొనడానికి లేదు, పెట్టుబడులు కావు కదా, అసలు టూరిస్టులు కూడా ఆయా ఏరియాల్లో పర్యటించడానికి వణికే పరిస్థితి… పెద్ద ఎత్తున ఆస్తులన్నీ ఆ కొన్ని పొలిటికల్ కుటుంబాల అదుపాజ్ఞల్లోనే ఉండేవి… నిజంగా ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తాయా, లేదా పక్కన పెట్టండి… ఇప్పుడు కశ్మీర్‌లో భిన్న దృశ్యాలు కనిపిస్తున్నయ్… పాత కశ్మీర్ మీద ఆశల్ని కలిగిస్తూ…!!
Share this Article