ఫాఫం… ఆమె చేసిన పాపం ఏమిటీ అంటే..? తనకు తెలిసిన కళ మోహినీ అట్టం కళను ప్రదర్శించడమే… ఆమె పేరు డాక్టర్ నీనాప్రసాద్… కేరళలో ఓ స్కూల్ ఆవరణలో నాట్యప్రదర్శన ఏర్పాటు చేస్తే వెళ్లింది, ప్రదర్శించసాగింది… ఆమె అల్లాటప్పా కళాకారిణి ఏమీకాదు… శాస్త్రీయ నృత్య రీతుల్ని అభ్యసించిన నాట్యగత్తె… ప్రదర్శన మధ్యలో పోలీసులు వచ్చారు, ఛల్, ఆపేయండి అన్నారు… ఎందుకు అన్నారు నిర్వాహకులు…
ఆ స్కూల్ వెనుక వైపు ఓ జిల్లా జడ్జి, పేరు కలాం పాషా… నివసిస్తున్నాడు… ఇదంతా న్యూసెన్స్, శబ్దకాలుష్యం అట… పోలీసులకు ఫోన్ చేసి, ఆపేయండి అని ఆదేశించాడు… పోలీసులకు జడ్జిలంటే వణుకే కదా, వెంటనే ఆపేశారు… ప్రోగ్రాం ఆగిపోయింది, ఆమె అవమానంతో అక్కడి నుంచి నిష్క్రమించింది… నిర్వాహకులు, ఆమె, ఇతర ప్రజలు కూడా సదరు జడ్జి వ్యవహారశైలిని విమర్శించారు… ఆయనకు ఇదేమీ కొత్త కాదట, స్కూల్‌లో ఇలాంటి ఏ ప్రోగ్రాం జరిగినా సహించడు అట…
ఆగండాగండి… ఎక్కడా చదవలేదు అనకండి… మన సెక్యులర్ ప్రాతివ్రత్యానికి భంగకరం అని ఏ మీడియా హైలైట్ చేయలేదు… చేయదు కూడా… అంతెందుకు..? అసలు కశ్మీర్‌లో హిందూ సమాజం ఊచకోతకు గురికాలేదు, హిందువులే తీటతో కశ్మీర్ వదిలి, స్వస్థలానికి ద్రోహం చేస్తూ వలస పోయారు అని రాసిపారేసే సెక్యులర్ మేధస్సులు కదా మనవి… మన మీడియా కూడా అంతే కదా…
Ads
ఒక జడ్జి న్యూసెన్స్ అని భావించినా సరే, శబ్దకాలుష్యంగా భావించినా సరే, నేరుగా పోలీసులకు ఫోన్ చేసి ఓ ప్రదర్శనను ఆపేయవచ్చా..? రేప్పొద్దున ఏ కళాప్రదర్శన అయినా సరే, ఏ నినాదాలు, ఏ ప్రార్థనలు అయినా సరే, మాకు న్యూసెన్స్ అని కాల్ చేస్తే పోలీసులు ఇలాగే స్పందిస్తారా..? ఇది పెద్ద ప్రశ్న.,.. పోనీ, సదరు జడ్జి సూమోటోగా కేసు పెట్టేసుకుని, తనే విచారించి, తనే తీర్పు చెప్పవచ్చు కదా… సుప్రీంకోర్టు దిగువ కోర్టుల జడ్జిల తీర్పులపైనే కాదు, వాళ్ల వ్యక్తిగత వ్యవహారశైలి మీద ఏమైనా స్పందిస్తుందా అని అమాయకంగా అడక్కండి… మీ సెక్యులర్ శీలం చెడిపోయే ప్రమాదం ఉంది…
కేరళలో హిందువులంటేనే అసహ్యించుకునే సీపీఎం ప్రభుత్వం… మోహినీ అట్టం కాదు కదా… భారతీయ శాస్త్రీయ నృత్యరీతుల్ని నరనరాన ద్వేషించే ప్రభుత్వం ఉంది సరే… పైగా ఓ జడ్జి కళ్లురిమాక గజగజా వణకడమే తప్ప మరోరకంగా స్పందించే వెన్నెముక పినరై విజయన్‌కు ఎక్కడ ఉంది..? కానీ మరో ప్రశ్న… చివరకు మనం భారతీయ శాస్త్రీయ నృత్యరీతుల్ని కూడా మోడీ, బీజేపీ, హిందుత్వ ప్రతీకలుగా భావిస్తున్నామా..?
ఒక స్కూల్ ఆ నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయడం నేరమా..? సమాజద్రోహమా..? రేప్పొద్దున ఎక్కడ ఏ సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేసినా, అవి నచ్చకపోతే, న్యూసెన్స్ అని ఆరోపిస్తే వెంటనే పోలీసులు వెళ్లి వాళ్లను ఆపేసి, తరిమేస్తారా..? సమాధానాలు లేని ప్రశ్నలు… ఐనా ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం హిందువులను ద్వేషించి, తన్ని తరిమేయడమే కదా అభ్యుదయ పథం… చివరకు నాట్యాల్ని, సంగీతాల్ని కూడా హిందూ ప్రతీకలుగా, సూచికలుగా భావిస్తేనే కదా మేధస్సు..?!
సర్.., పినరై విజయన్, అమెరికా చికిత్స పూరిచేసుకుని వచ్చి ఉంటావుగా… ఆ నాట్యకారిణిని వీలైతే జైలులో పారేయండి.,. ద్రోహి, శాస్త్రీయ నాట్య ప్రదర్శనకు పాల్పడుతుందా..? అంతటి సమాజద్రోహాన్ని చూస్తూ ఊరుకోవద్దు సార్… మన మార్క్సిజానికి, మన తెలివికి, మన అవగాహనకు, మన సమసమాజ స్పృహకే ఇది భంగకరం… వీలయితే ఆ స్కూల్ మూసేయించండి సార్, ఏమిటీ న్యూసెన్స్… అసలు మోహినీ అట్టం కళనే నిషేధిస్తే పోలా…? పనిలోపని, కథాకళి తదితర నృత్యరీతుల్ని కూడా సమాజద్రోహం అని ప్రకటించేయండి..!!
Share this Article