ఓ మెయిన్ స్ట్రీమ్ పత్రికే… రజినీకాంత్, కమల్‌హాసన్‌తో రాజమౌళి ఓ సినిమా చేయబోతున్నాడని రాసిపారేసింది… బహుశా ఏదో యూట్యూబ్ చానెల్‌లో చూసి ఇన్‌స్పయిర్ అయిపోయి ఉంటుంది… ఆర్ఆర్ఆర్ సినిమా హైప్ క్రియేటై ఉంది.., ఫిలిమ్ ఇండస్ట్రీలో మొత్తం రాజమౌళి పేరు మారుమోగిపోతోంది… బాహుబలి రికార్డులు, ఈ సినిమాకైన 400 కోట్ల ఖర్చు, వేలాది థియేటర్లలో అయిదారు భాషల్లో రిలీజ్… సహజంగానే సినిమా మీద అసాధారణమైన అంచనాల్ని పెంచుతాయి…
ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కోసం గుళ్లు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు… అనేక ప్రధాన కేంద్రాల్లో ఫంక్షన్లు, టీవీ షోలు, ఇంటర్వ్యూలతో రాంచరణ్, జూనియర్, రాజమౌళి కొన్నాళ్లుగా తెగతిరిగేశారు… బహుశా ఈ రేంజ్ ప్రమోషన్ దేశంలో ఇంతకుముందు మరే సినిమాకు లేదేమో… మీడియా, సోషల్ మీడియాలను వీలున్నంత మేరకు వాడేశారు… యాడ్స్ ఇవ్వకుండా మీడియాను వాడుకోవడంలో రాజమౌళి మొనగాడు…
ఎలాంటి వాతావరణం ఏర్పడిందంటే… రాజమౌళి పేరుతో ఏది రాసినా చెలామణీ అయ్యేట్టుగా… ఈ వార్త కూడా అలాగే ఉంది… నిజంగా రాజమౌళి రజనీకాంత్, కమల్‌హాసన్‌లతో మల్టీస్టారర్ సినిమా తీయనున్నాడా..? దీనికి సమాధానం లేదు..! ఏదో టీవీ ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పాడు… ‘‘ఎక్కడో ఎవరో అడిగితే వాళ్లిద్దరితో ఓ సినిమా చేస్తే బాగుండును అన్నానే తప్ప, నేను చేస్తున్నాను అని చెప్పలేదు’’ అని క్లారిటీ ఇచ్చాడు… తన తరువాత సినిమా మహేశ్ బాబుతో అనీ అన్నాడు…
Ads
ఐనా ఇద్దరు కురువృద్ధులకు తగిన వేషాలు, వాళ్లిద్దరి రేంజుకు తగిన కథ ఉత్తుత్తి మాటలు కాదు… ఎంతటి విజయేంద్రప్రసాదుడికైనా కష్టమే… పైగా తమిళనాడులో ఈ ఫ్యాన్స్ ఇగోలు మరీ ఎక్కువ… తన్నులాటల రేంజ్ ఎక్కువ… ఎక్కడ చిన్న తేడా బెడిసినా ఊరుకోరు… పైగా ఇప్పుడు అక్కడ విజయ్, సూర్య వంటి కొత్తతరం హీరోల హవా నడుస్తోంది…
రాజమౌళి సినిమా అంటే ఓ మూడునాలుగు నెలల కాల్‌షీట్లు ఇస్తే సరిపోవు… తన సినిమాలు నెలల్లోనే తయారైపోవు… ఏళ్లు పడుతుంది… మినిమం రెండేళ్లు, లేదా మూడేళ్లు… తన వర్క్ కూడా అలాగే హెక్టిక్‌గానే ఉంటుంది… టాప్ ఎండ్ టెక్నాలజీ వాడతాడు… ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చూడండి, త్రీడీ మాత్రమే కాదు, డోల్బీ విజన్ ప్రవేశపెట్టాడు… అఫ్‌కోర్స్, దేశంలో ఆ హై ఎండ్ టెక్నాలజీలో సినిమా ప్రదర్శనకు తగిన థియేటర్లు లేవు, కానీ అవి ఉన్న విదేశాల్లో ఈ టెక్నాలజీలో సినిమా చూడటం కన్నులకు పండుగే… పైగా రాజమౌళి సినిమాలో గ్రాఫిక్స్, సీన్ల చిత్రీకరణ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది…
ఈ స్థితిలో మహేశ్ బాబు సినిమా వెంటనే స్టార్ట్ చేసినా 2024 వరకు రాజమౌళి ఇంకో సినిమా చేసే స్థితి ఉండదు… ఒకవేళ రజినీ, కమల్ మల్టీస్టారర్‌కు అంగీకరించినా సరే, మరో రెండేళ్లు అనుకుందాం… అంటే 2026 వరకు పూర్తి చేయాలి… రెండేళ్లు ఇక ఏ ఇతర సినిమా చేయకూడదు… ఇప్పటికే రజినీకాంత్ వయస్సు 71… కమల్‌హాసన్ వయస్సు 67 ఏళ్లు… రాజమౌళి బాపతు సినిమా అంటే ఒళ్లు హూనం చేసుకోవడమే… వాళ్లిద్దరూ అలా చేసే స్థితిలో ఉన్నారా..?!
Share this Article