నోట్ల రద్దు నుంచి ఆత్మనిర్భర్ దాకా… అనేకాంశాల్లో మోడీకి పాలన తెలియదనే విమర్శలు కోకొల్లలు… ప్రత్యేకించి నిత్యావసరాల ధరల మీద ఏమాత్రం అదుపు లేదు… గ్యాస్, పెట్రోల్ మాత్రమే కాదు, మార్కెట్‌లో కరోనా అనంతరం ధర పెరగని సరుకు లేదు… అసలు నిజంగానే కొందరు మంత్రులకు వాళ్ల శాఖల గురించి ఏమైనా తెలుసా..? పూర్తిగా బ్యూరోక్రాట్లకు వదిలేశారా అనిపిస్తుంది కొన్నిసార్లు… ప్రత్యేకించి కరోనా దుర్దినాల్లో వైద్య ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖలు కీలకం… అవి రెండూ అట్టర్ ఫ్లాప్… ప్రత్యేకించి నిర్మల సీతారామన్…
వేక్సిన్లకు అనుమతుల దగ్గర నుంచి చికిత్స ప్రోటోకాల్, అత్యవసర మందుల బ్లాక్ మార్కెటింగ్, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీల దాకా వైద్య ఆరోగ్య శాఖ ఫెయిల్యూర్స్‌కు రోజూ కొన్ని వేల ఉదాహరణలు చూశాం… చివరకు వేక్సిన్ల సైడ్ ఎఫెక్ట్స్ మీద ఈరోజుకూ సోయి లేదు దీనికి… మరో శాఖ కూడా ఉందండోయ్… రసాయనాలు, ఎరువుల శాఖ… ఎరువుల ధరలు, కోటాలు, ఇతర కెమికల్స్ అంశాలే కాదు, దీనికి మరో బాధ్యత ఉంది… ఫార్మస్యూటికల్స్ విభాగమూ దీని పరిధిలోకే వస్తుంది…
NPPA… అని ఓ సంస్థ ఉంటుంది… జాతీయ ఔషధ ధరల సంస్థ… ప్రస్తుతం దీనంత దౌర్భాగ్య సంస్థ మరొకటి లేదు దేశంలో… మనం మెడికల్ షాపుల్లో కొనే ప్రతి గోళీ, ప్రతి ఇంజక్షన్, ప్రతి మందుకూ ధరలు నిర్ణయించేది ఇదే… కానీ పేరుకు మాత్రమే ఓ విధానం… అంతా అరాచకం… మోడీ ప్రభుత్వానికి దీని మీద అదుపు జీరో…
Ads
ఇప్పుడు తాజాగా ఏమని ప్రకటించిందో తెలుసా..? 800 నిత్యావసర మందుల ధరల్ని 10.7 శాతం పెంచబోతోందట… అవునులే, గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యావసరాలన్నీ మండిపోతుంటే, వీటిని మాత్రం ఎందుకు వదిలిపెట్టాలి అనుకున్నట్టుంది మోడీ ప్రభుత్వం… ఈ నిత్యావసర మందుల్లో బీపీ, సుగర్, జ్వరం, ఇన్‌ఫెక్షన్లు వంటి వ్యాధుల మందులు కూడా వీటిల్లో ఉన్నయ్…
కేసీయార్ ఆర్టీసీ, కరెంటు ఛార్జీలు పెంచాడు… మోడీ పెట్రోల్, గ్యాస్ పెంచాడు… ప్రజల్ని విపరీతంగా ఉద్దరించడంలో ఎవరూ తక్కువేమీ కాదు, పైగా ఒకరి మీద మరొకరు పడి రోజూ ఏడుస్తూ ఉంటారు… దాన్నలా పక్కన పెడితే… ఈ మందుల ధరలకు సంబంధించి మోడీ ప్రభుత్వం చేసిన ప్రకటన నవ్వు పుట్టించింది…
గత ఏడాదితో పోలిస్తే WPI పెరిగిందట, అందుకే ధరలు పెంచుతున్నారట… అంటే ఏమిటి..? హోల్ సేల్ ధరల సూచిక పెరిగిందట… ఔషధాల ధరలు పెరిగితే ఈ సూచిక ఇంకా పెరుగుతుందిగా… అప్పుడు అది పెరిగిందంటూ మళ్లీ ఔషధాల ధరల్ని పెంచవచ్చునట… ఆహా, సదరు మంత్రికి పద్మభూషణ్, అక్కడ పనిచేసే కీలక బ్యూరోక్రాట్లకు పద్మశ్రీలు అర్జెంటుగా ఇచ్చేయవచ్చు… పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవడూ చూడటం లేదులే అనుకుంటుందట… ఇదీ అంతే…
కరోనా కాలంలో, కరోనా అనంతర కాలంలో కూడా… అన్ని ఫార్మా కంపెనీలు వాటి ధరలు పెంచేసినయ్… రెగ్యులర్‌గా మెడికల్ బిల్లులు కట్టే వాళ్లందరికీ తెలుసు… Paracetamol, Phenobarbitone, Phenytoin Sodium, Azithromycin, Ciprofloxacin Hydrochloride, Metronidazole తదితర మందుల ధరలు ఇప్పుడు పెరుగుతాయి అని చెబుతున్నారు గానీ, అవే కాదు, ప్రతి డ్రగ్ ధర పెరిగిపోయింది ఆల్‌రెడీ… మేం లెక్కప్రకారమే, అన్నీ చూసి ధరలు పెరగడానికి అనుమతినిస్తున్నాం అని చెప్పుకోవడానికి ఈ తాజా ప్రకటన డ్రామా…
ష్, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ శుద్ధపూస కాదులెండి… అప్పట్లో ఫార్మా ధరల మీద కొన్నాళ్లు నియంత్రణ తీసేయాలంటూ సాక్షాత్తూ కేటీయార్ ఢిల్లీకి లేఖ రాసినట్టు గుర్తుంది… ఆగండాగండి… ఇంకా ధరలు పెరగనివి ఏమైనా ఉంటే, పొరపాటున పెంచకుండా ఉంటే… అవీ వదిలిపెట్టరు… జీఎస్టీ స్లాబుల సవరింపు జరగబోతోందట… కరోనా రోగంతో చిక్కి, మూలుగుతున్న ప్రజల మీద వరుసగా తాటిపళ్లు, వడగళ్లు… ఏం పాలకులు దొరికారో కదా…!! ప్రజలంటే భరించలేనంత ప్రేమ..!!
Share this Article