అందరూ రాజమౌళి తన సినిమాను లేటుగా నిర్మిస్తాడు, సంవత్సరాలు తీసుకుంటాడు అంటారు గానీ… పెద్ద సినిమాలు తీసే దర్శకులు దాదాపుగా అందరూ అంతే… ఇలా కొబ్బరికాయ కొట్టేసి, ఏ అయిదారు నెలలకో గుమ్మడి కాయ కొట్టేయడం కుదరదు… అసలు ప్రిప్రొడక్షన్ వర్కే బోలెడు ఉంటుంది… ఒకసారి బ్యానర్ కుదిరాక, ఇక దర్శకుడు, హీరో, హీరోయిన్, సంగీత దర్శకుడు, ఇతర నటీనటులు, కెమెరా, ఎడిటర్ గట్రా సెలక్షన్స్ అయ్యేవరకు రోజులు గడుస్తూనే ఉంటయ్…
సాంగ్స్ రికార్డింగ్, షూటింగ్ సరేసరి.., డేట్లు, అడ్జస్ట్మెంట్లు, లొకేషన్స్, సెట్లు గట్రా ఇబ్బందులు ఉండనే ఉంటయ్… అవయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్… ఇయ్యాల్రేపు గ్రాఫిక్స్ వర్క్ లేకుండా సినిమాలే రావడం లేదు… రీరికార్డింగ్, బీజీఎం మీద కూడా బాగా కాన్సంట్రేట్ చేస్తున్నారు… తరువాత బయ్యర్లు, బేరాలు, ప్రిరిలీజ్ ఫంక్షన్లు, చివరగా రిలీజ్… వీలయితే సక్సెస్ మీట్లు… మధ్య మధ్య లిరికల్ సాంగ్స్ రిలీజులు, ఫస్ట్ లుక్, సెకండ్ లుక్, గ్లింప్స్, ట్రెయిలర్లు, టీజర్లు, సోషల్ మీడియా ప్రమోషన్…
ఇదంతా ఎందుకు అంటే..? ఆర్ఆర్ఆర్ ఖర్చును మించి ప్రభాస్ సినిమా ఒకటి రూపొందుతోంది… 500 నుంచి 600 కోట్లు అంచనా వేస్తున్నారు… పేరు ఆదిపురుష్… రామాయణమే, కొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు… దర్శకుడు ఓం రౌట్… 2015లో బాలగంగాధర తిలక్ బయోపిక్ ఏక్ యుగపురుష్, లోకమాన్య పేరిట తీశాడు… తరువాత 2020లో తానాజీ తీశాడు… ఇప్పుడు ఆదిపురుష్… నిజానికి 2020లోనే దీనికి సంబంధించిన కసరత్తు పూర్తయింది… ఓ ప్రమోషనల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు… ఫిబ్రవరిలో 2021లో షూటింగ్ స్టార్ట్ చేస్తే నవంబర్, డిసెంబరులోపు పూర్తి చేశారు…
Ads
ఐనాసరే, ఈ సినిమా ఇప్పుడప్పుడే రాదు… వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయగలమేమో అంటున్నారు… సినిమా షూటింగ్ పూర్తయిన ఫీడ్ నిడివి చాలా ఎక్కువే ఉందట… సో, సీక్వెల్ పేరిట ఓ సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో పడ్డారట ఇప్పుడు… ఒకవేళ అది రిలీజ్ చేసినా 2024లో గానీ సాధ్యం కాదు… తెలుగు, హిందీ భాషల్లో సమాంతరంగా షూటింగ్ చేసుకున్న ఈ సినిమాను మలయాళం, తమిళం, కన్నడంతో పాటు మరికొన్ని భాషల్లోకి డబ్ చేస్తున్నారు… ఇంగ్లిష్ కూడా…
పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్… జపాన్లో ఆమధ్య తీసిన యానిమేటెడ్ రామాయణం చాలా దేశాల్లో రిలీజైంది… ఈ ఆదిపురుష్ సినిమాకు కూడా అదే స్ఫూర్తి… నిజంగానే రామాయణం సరైన రేంజులో తీయాలే గానీ ఇండియాలోనే కాదు, ఆసియా, ప్రత్యేకించి తూర్పు ఆసియా దేశాల్లో రిలీజ్ చేయొచ్చు… అనేక రామాయణ కథలు వ్యాప్తిలో ఉన్నా సరే, మూల కథ ఒకటే కదా… ఎటొచ్చీ, హిందీ హీరోల్లాగా మీసాలు, గడ్డం లేని రాముడు కాదు… ఈ ఆదిపురుష్ మీసం, గడ్డంతోనే ఉంటాడు… మన సౌతిండియన్ రాముడు కదా… నాగార్జున అన్నమయ్య, రజినీకాంత్ రాఘవేంద్రుడిలా అన్నమాట…!!
Share this Article