బీజేపీ ఎన్నికల గుర్తు కమలం… కానీ మొన్నటి యూపీ ఎన్నికల్లో ప్రచార గుర్తు బుల్ డోజర్… నిజం… దాన్ని అధికారిక చిహ్నం చేసేశారు… యోగీ మార్క్ మస్కట్… నాలుగు రోజులు ఆగండి, మళ్లీ బుల్ డోజర్లు కదులుతాయ్ అని యోగి తలెగరేసి మరీ చెప్పాడు… తను నమ్మింది బుల్ డోజర్‌నే… కాదంటే బుల్లెట్‌ను..! బీజేపీ వాళ్లు బుల్ డోజర్ల ర్యాలీలు తీశారు, బుల్ డోజర్లకు బ్యానర్లు కట్టారు, యోగికి బుల్ డోజర్ బాబా అని పేరు పెట్టారు… బుల్‌డోజర్ అనే పేరుకు వచ్చినంత పాపులారిటీ అంతా ఇంతా కాదు…
ఏ పార్టీ తక్కువేమీ కాదు, యూపీ అంటేనే నేరస్థుల అడ్డా… ప్రత్యేకించి బీఎస్పీ, ఎస్పీ పార్టీల్లో పెద్ద తలకాయల నేరచరిత్ర, నేరస్వభావం అంతా ఇంతా కాదు… నేరం, రాజకీయం కలగలిసిన సంస్కృతి ఆ రాష్ట్రానిది… వేల ఎన్‌కౌంటర్లతో యుద్ధం చేసిన యోగి ఈసారి తిరిగి అధికారంలోకి రాడు, మళ్లీ మన అఖిలేషే వస్తాడు అని చాలామందిలో ఓ ధీమా ఏర్పడింది ఆమధ్య… ఖలిస్థానీ మద్దతుతో సాగిన రైతుల ఆందోళనలు, మళ్లీ బీజేపీ వస్తే బతుకు కష్టమనుకుని చిన్నాచితకా పార్టీలన్నీ కూడగట్టుకుని అఖిలేష్ వెంట చేరడం, గ్యాంగ్‌స్టర్స్ తమ సర్వశక్తులూ క్రోడీకరించడం, పశ్చిమ యూపీలో సర్వేలు చేసి యోగి పనైపోయిందని రాయబడిన కథనాలు మళ్లీ క్రిమినల్స్‌లో ఆశలు రేకెత్తించాయి…
భయంభయంగా బతికిన వాళ్లు మళ్లీ ఎస్పీ బ్యానర్లు పట్టుకుని బజార్లలోకి వచ్చారు… మా ప్రభుత్వమే రాబోతోంది అంటూ తలలెగరేశారు… ఏమైంది..? ఆశలు తుస్సుమన్నయ్… అఖిలేష్‌కే భయం పట్టుకుంది… తన పాత కథలన్నీ తవ్వుతాడేమోనని… యోగి అన్నట్టుగానే బుల్‌డోజర్ మళ్లీ డ్యూటీకెక్కింది… మొన్నొకచోట ఓ రేప్ కేసు, నిందితుడికి ఏదో పార్టీ సపోర్ట్, పోలీసులకే ధమ్కీలు ఇస్తున్నాడు, సింపుల్‌గా ఇంటిముందుకు ఓ బుల్‌డోజర్ వెళ్లి ఆగింది… గంట సేపట్లో వాడు పోలీసులకు లొంగిపోయాడు…
Ads
మొన్నటిదాకా యోగి వ్యతిరేక బ్యానర్లు, జెండాలు పట్టుకుని తిరిగిన వాళ్లలో ప్రాణభయం మొదలైంది… మళ్లీ ఎన్‌కౌంటర్లు స్టార్టయ్యాయి… ఇద్దరు మరణించారు… పెండింగ్‌లో ఉన్న నేరగాళ్ల ఆస్తుల కూల్చివేతలు మళ్లీ ప్రారంభమయ్యాయి… దీంతో తలలెగరేసి మొన్నటి ఎన్నికల్లో తిరిగిన నేరగాళ్లు పాహిమాం పాహిమాం అంటూ ప్లకార్డులు పట్టుకుని మరీ లొంగిపోతున్నారు… ‘‘లొంగిపోతున్నా, ప్లీజ్, ఎన్‌కౌంటర్ చేయకండి’’ ఇదే ఇప్పుడు ప్రాణావసర నినాదం…
కిడ్నాప్, దోపిడీ ఆరోపణలతో పరారీలో ఉన్న గౌతమ్ సింగ్ లొంగుబాటుతో మళ్లీ ‘‘ఆపరేషన్ బుల్‌డోజర్’’ మొదలైంది… సరెండర్ అవుతావా..? ఎన్‌కౌంటర్ అవుతావా..? ఇదే తేల్చుకోవాల్సింది… వాళ్ల అక్రమాస్తుల్ని కూల్చేయడం అదనపు పని… మార్చి 15న గోండా జిల్లాలోని ఛాపియా పోలీస్ స్టేషన్లో గౌతమ్ సింగ్ లొంగిపోగా… మూడు రోజుల్లో మరో 23 మంది అదేబాట పట్టారు. ఒకేసారి సహరాన్‌పూర్లోని చిల్కానా పోలీసుస్టేషన్ కు స్వయంగా వచ్చి లొంగిపోయారు… ఒక్క పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోనే నలుగురు బడా మద్యం స్మగ్లర్లు మళ్లీ నేరం చేయబోమని అఫిడవిట్‌తో దేవబంద్ పోలీసుల ఎదుట లొంగిపోయారు…
పొరుగున ఉన్న షామ్లీ జిల్లాలో 18 మంది గోహత్య నిందితులు ఠానా భవన్, గర్హిపుఖాటా పోలీస్ స్టేషన్లలో లొంగిపోయారు. మరో వాంటెడ్ క్రిమినల్ హిమాన్షు అలియాస్ హనీ ఫిరోజాబాద్‌లోని సిర్సాగంజ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. లొంగిపోయే సమయంలో, తనను కాల్చవద్దని పోలీసులను వేడుకుంటూ ప్లకార్డు చేత్తో పట్టుకుని ఉన్నాడు…
ముఖ్తార్ అన్సారీ తెలుసు కదా… పాత బీఎస్సీ ఎమ్మెల్యే… అధికారికంగానే దాదాపు 50 కేసులున్నయ్… లెక్క తెలియనివి ఎన్నో… యూపీలో ఉంటే ప్రాణాలు దక్కబోవని, ఏదో చిన్న కేసులో పంజాబ్‌తో జైలులో ఉన్నాడు… సుప్రీంకోర్టు వెళ్లి, వాడిని తిరిగి యూపీకి తరలించే పని యోగి సర్కారు చేపట్టింది… కోర్టు కూడా అనుమతించింది… ఇక వాడి పని జీపు బోల్తాపడటమే అనుకున్నారు అందరూ… ఈలోపు ఎన్నికలు వచ్చాయి…
తప్పుడు పేర్లతో అంబులెన్సులు రిజిష్టర్ చేసి, తమ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వాటిని వాడారనే ఆరోపణతో ఇప్పుడు అన్సారీతోపాటు 12 మంది మీద గ్యాంగ్‌స్టర్ చట్టం కింద కేసులు పెట్టారు… పక్కాగా ఫిక్స్ చేసే పనిలో పడ్డారు పోలీసులు… నొటోరియస్ కేరక్టర్లను ఐడెంటిఫై చేయడం, బుక్ చేయడం, లేదంటే ఈ పాపిష్టి లోకం నుంచి విముక్తి కలిగించడం… మళ్లీ మొదలైంది… బుల్‌డోజర్ మళ్లీ డ్యూటీ ఎక్కింది…!! చివరగా :: కర్నాటక కూడా స్పూర్తి పొందింది… ఎస్డీపీఐకి చెందిన ఒకరి ఆస్తుల్ని బుల్‌డోజర్‌కు అప్పగించారు తాజాగా..!!
Share this Article