……… By…. పార్ధసారధి పోట్లూరి……… ఏదో జరగబోతోంది… కేంద్రప్రభుత్వం ఏదో పెద్ద ప్లాన్‌లోనే ఉంది… పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పునఃస్వాధీనం చేసుకునే ప్రణాళిక ఏమైనా రచించబడుతోందా..? త్వరలో ఎన్నికలు ప్రకటించబోతున్నారా..? రకరకాల ఊహాగానాలు సాగుతున్నయ్ కాశ్మీర్ విషయంలో… కానీ అదేమీ లేదు, పీవోకే విముక్తి వంటి పెద్ద ప్రణాళికలేమీ లేవు ఇప్పట్లో…
కానీ ఏమీ లేకుండా ఎలా ఉంటుంది..? అమిత్ షా ఏదో పనిలో ఉన్నాడు, వారం రోజులుగా ఒకదాని తరువాత మరొకటి పరిణామాల్ని గమనిస్తే ఏదో జరగబోతోందనే సందేహాలు సబబే… అమిత్ షా ఏ పని మొదలుపెట్టినా సరే, అది పూర్తయ్యేదాకా రహస్యంగా ఉంచుతాడు… ఆర్టికల్ 370 రద్దు విషయం చూశాం కదా… చివరి నిమిషం వరకూ ఎవరూ కనీసం ఊహించలేదు కూడా… బిల్లు ఆమోదం కోసం వచ్చిన తరువాతే అందరికీ తెలిసింది… అంత సీక్రెసీ…
సరే, కొన్ని అంశాలు పరిశీలిద్దాం…కశ్మీర్ మహారాజు రాజాహరిసింగ్ మనమడు రాజా విక్రమాదిత్య సింగ్ హఠాత్తుగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు… తన రాజీనామా లేఖలో నేరుగా సోనియాను ఉద్దేశించి విమర్శలు చేశాడు… కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఓ దిశ లేకుండా పనిచేస్తోందని ప్రస్తావించాడు…మాజీ ఐపీఎస్ అధికారి ఫరూక్ ఖాన్ గతంలో జమ్ము కశ్మీర్లో ఐజీ హోదాలో పనిచేసి రిటైరయ్యాడు… ప్రస్తుతం కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు చీఫ్ అడ్వయిజర్… ఇప్పుడు ఆయన ఆ పదవికి రాజీనామా చేశాడు…
Ads
గతంలో ఈయన బీజేపీ మైనారిటీ సెల్‌కు జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు… ఈయన తండ్రి పేరు పీర్ మొహమ్మద్ ఖాన్, తను కశ్మీర్ మహారాజు హరిసింగ్ సైన్యంలో పనిచేశాడు… జమ్ము కశ్మీర్లో జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు పీర్ ఖాన్…కొద్దిరోజుల క్రితం అమిత్ షా జమ్ము కశ్మీర్లో పర్యటించాడు… ఆ తరువాతే విక్రమాదిత్య సింగ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, ఫరూక్ ఖాన్ తన పోస్టుకు రాజీనామా చేయడం పరిశీలిస్తే, ఈ ఇద్దరికీ అమిత్ షా ఏదో ఇంపార్టెంట్ పని అప్పగించినట్టు తెలుస్తోంది… అది ఆ రాష్ట్రానికి సంబంధించిన పనే అయి ఉంటుంది…
జమ్ము కశ్మీర్లో నియోజకవర్గ పునర్విభజన ప్రక్రియ (డీలిమిటేషన్) పూర్తయిపోయింది… ఆ వివరాల్ని ప్రభుత్వ డొమైన్లో కూడా పొందుపరిచారు… అక్కడి మాజీ ముఖ్యమంత్రులు లబోదిబోమంటున్నారు… వాళ్లకు ఈ పునర్విభజన మింగుడుపడటం లేదు… ఇష్టం లేదు… ఇన్నాళ్లూ కశ్మీర్ వాళ్ల సొంత కుటుంబ ఆస్తిలా అనుభవించారు… ఆస్తులేమో లండన్‌లో ఉంటాయి… పిల్లలు లండన్‌లో సెటిలయ్యారు… కానీ ఇప్పుడు వాళ్లు అనుకున్న ఆటలు సాగడం లేదు, అదీ ఆక్రోశం…
ఇన్నేళ్లుగా ముఫ్తి గ్యాంగ్, అబ్దుల్లా గ్యాంగ్ ఆడింది ఆట… ఇప్పుడు వాళ్ల ప్రాబల్యం కత్తిరించడానికి డీలిమిటేషన్ జాగ్రత్తగా ప్లాన్ చేశారట… దీనికి రెండేళ్లుగా పెద్ద కసరత్తే సాగింది అమిత్ షా కనుసన్నల్లో…!! ఇన్నాళ్లూ కశ్మీర్ ముస్లింలతోపాటు కశ్మీర్ వేర్పాటువాదులు, వాళ్లకు సహకరించే పాకిస్థానీ మద్దతున్న టెర్రరిస్టులు ఈ పార్టీలకు సాయం చేసేవాళ్లు… మరి ఇప్పుడు..?
జహీర్ అహ్మద్, కశ్మీర్ వీర వేర్పాటువాది, జైలులో ఉన్నాడు….. ఆల్ జమ్ము కశ్మీర్ ప్లెబిసైట్ ఫ్రంట్ ప్రస్తుతం ఉనికిలో లేకుండా పోయింది. అందరూ చెల్లాచెదురయ్యారు… కొందరు పారిపోగా, ఇంకొందరు జైలులో మగ్గుతున్నారు… ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ కూడా నిధుల లేమితో విలవిలాడుతోంది… నిధుల రాకకు భారీగా కత్తెర్లు పడ్డయ్… చాలామంది జైలులో ఉన్నారు… ఆసియా అంద్రాబీ అడ్రస్ లేదు… అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్ ఏడేళ్లుగా సోయిలోనే లేదు… మొహమ్మద్ అబ్బాస్ అన్సారీ, షేక్ అబ్దుల్ అజీజ్ జైలులో ఉన్నారు…
గతంలో పాకిస్థాన్ సైన్యం, ఐఎస్ఐ నుంచి ఆదేశాలు వచ్చేవి… ఈ సంస్థలన్నీ పాటించేవి… చివరకు కశ్మీర్లో ఎవరు అధికారంలో ఉండాలో కూడా ఐఎస్ఐ నిర్ణయించేది… దాన్ని అమలు చేసే పని టెర్రరిస్టులది… ఇప్పుడేమో కనెక్షన్లు కట్టయిపోతున్నయ్… దొంగనోట్ల రాకడ తగ్గిపోయింది… అవి ప్రింట్ చేయడానికీ ఆ దేశం దగ్గర డబ్బులుంటే కదా… రాళ్లు రువ్వే బ్యాచులకు ఎవరెవరు డబ్బులు ముట్టజెబుతున్నారో భారతీయ దర్యాప్తు సంస్థల దగ్గర పూర్తి సమాచారం ఉంది…
గాలిలోకి లేచే ప్రతి రాయి రెండు వేల చొప్పున జరిమానాను కక్కిస్తుంది ఇప్పుడు…కశ్మీర్ అంటే కేవలం ఉగ్రవాదుల అడ్డా మాత్రమేనా..? కాదు… అలా ముద్రపడింది… రోజువారీ ఆదాయం కోసం కష్టపడేవాళ్లకు కొదువ లేదు… వాళ్లకు కశ్మీర్ లోయ ప్రశాంతంగా ఉండాలి… ఇప్పుడది కనిపిస్తోంది… వీళ్లు ఇకపై ఈ ముఫ్తీలకు, ఈ అబ్దుల్లాలకు వోట్లు వేస్తారా..? అదీ అసలు ప్రశ్న…
ముఫ్తీ ముష్టి తెలివితేటలు !
జమ్ము కశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజన మీద పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సాయం కావాలని అర్థించింది ముఫ్తీ… ఇమ్రాన్, మోడీలు కూర్చుని చర్చించాక డీలిమిటేషన్ చర్యలు తీసుకోవాలట… వాళ్లు ఇక మారరు… నిజానికి అక్కడ ఇమ్రాన్ కుర్చీయే కూలిపోయినట్టే… అవిశ్వాస తీర్మానం నుంచి తప్పించుకుని లండన్ పారిపోవాలని ప్లాన్… పాకిస్థాన్ ఆర్మీ సీపీఈసీలో అవినీతికి ఇమ్రానే బాధ్యుడు అని ఆరోపిస్తోంది… అంటే ఇమ్రాన్‌కు చుక్కలు కనిపించబోతున్నాయి అని అర్థం…
ఒక్కసారి ఇమ్రాన్‌ను జైలులో గనుక పారేస్తే, ఇక తన బతుకు ఎలా ఉంటుందో తనకు తెలుసు… ఎదురుతిరగలేడు, తిరిగితే వాళ్ల గతి ఏమవుతుందో కూడా ఇమ్రాన్‌కు తెలుసు… ఆర్మీ చాలా సైలెంటుగా ఖతం చేయగలదు… అందుకే లండన్ పారిపోయే ప్రయత్నాల్లో ఉన్నాడు… ఆ ఇమ్రాన్, మోడీ కలిసి కశ్మీర్లో నియోజకవర్గాల డీలిమిటేషన్ ఖరారు చేయాలట… అదీ ముఫ్తి ముష్టి తెలివితేటలు…
ఇప్పటి పొలిటికల్ పొజిషన్ ప్రకారం ఇమ్రాన్ ఏ స్థితిలోనూ ప్రధానిగా కొనసాగే చాన్స్ అస్సలు లేదు… సైన్యంతో సంధి చేసుకోవడం ఒక్కటే తనకు మిగిలిన దిక్కు… పోనీ, ఓ పనిచేయొచ్చు… ఈమె కూడా లండన్ వెళ్తే, అక్కడే డీలిమిటేషన్ కొత్త ప్లాన్స్ రచించండి… ఈలోపు ఎన్నికలు నిర్వహించేస్తుంది కేంద్ర ప్రభుత్వం…!!
Share this Article