ఎంత సాయిపల్లవి ఉంటేనేం..? ప్రణవాలయ అని కష్టపడి ఎంత శాస్త్రీయంగా నర్తిస్తేనేం..? నానికి కొత్త లుక్కు ఇచ్చి, పాత జన్మలోకి లాక్కుపోయి, ఓ కొత్త కథ రాస్తేనేం..? నాని మరీ రెచ్చిపోయి కృతిశెట్టితో ఘాటు లిప్‌లాకుల్ని పండిస్తేనేం…? జనానికి అంతగా కనెక్ట్ కావాలనేముంది..? కాలేదు… నిజానికి సినిమాకు నెగెటివ్ టాక్ ఏమీ రాలేదు… ఉన్నంతలో మంచి వసూళ్లే రాబట్టింది… కానీ టీవీ ప్రేక్షకులు ఎందుకో పెదవి విరిచారు… ఆసక్తి చూపించలేదు… కానీ మరీ ఇంత తక్కువ రేటింగ్స్ వస్తాయని మాత్రం ఎవరూ ఊహించలేదు…
3 ఏప్రిల్ 2022… ఆదివారం… ప్రైమ్ టైమ్‌లో జెమినీ టీవీ ప్రసారం చేసింది… అసలే ఆ చానెల్ ట్యూన్ చేసేవాళ్లు తక్కువ… రీచ్ తక్కువ… దీనికితోడు ప్రేక్షకులు కూడా లైట్ తీసుకోవడంతో మరీ 4.56 రేటింగ్స్ మాత్రమే దక్కాయి… టీవీ భాషలో చెప్పాలంటే బిలో యావరేజ్ రిజల్ట్… నాని, సాయిపల్లవి రేంజుతో పోలిస్తే ఫ్లాప్…
Ads
ఓ మోస్తరు సినిమాల్ని రెండేసి, మూడేసి సార్లు ప్రసారం చేస్తుంటారు… అవి కూడా అలవోకగా 4, 5 రేటింగ్స్ ఇట్టే సాధిస్తాయి… దాంతో పోలిస్తే శ్యామ్ సింగరాయ్ టీవీ ప్రసారం దారుణంగా ఫెయిలైనట్టే… ఫాఫం, జెమిని ఆశలన్నీ ఇలాంటి సినిమా ప్రీమియర్ ప్రసారాలపైనే… అంతకుమించి దానికి రేటింగులు తెచ్చిపెట్టే షోలు లేవు, సీరియళ్లు లేవు… చివరకు ఇలా సినిమాలు కూడా తన్నేస్తే ఇక చానెల్ ఎన్నో ప్లేసుకు దిగజారిపోనుందో…
ఈసారి బార్క్ రేటింగుల్లో మరొకటి కాస్త ఆసక్తికరంగా అనిపించింది… అది డీజే టిల్లు… ఇది కూడా శ్యామ్ సింగరాయ్ ప్రసారం అవుతున్న టైమ్‌లోనే… అనగా ఆదివారం, మూడో తేదీ… సాయంత్రం ఆరున్నర నుంచి ప్రసారం చేశారు… ఇదేమో స్టార్ మాటీవీ… జనం ఎక్కువగా చూసే చానెల్… దాంతో జనం డీజే టిల్లు చూస్తూ శ్యామ్ సింగరాయ్‌ను వదిలేశారు…
డీజే టిల్లుకు హిట్ టాక్ వచ్చింది… పెద్ద తారలెవరూ లేకపోయినా హీరో ఒక్కడూ సినిమాను తన భుజాల మీద మోశాడు… పర్‌ఫెక్ట్ హైదరాబాదీ స్లాంగ్‌తో, సరదా కథనంతో సినిమాను వినోదాత్మకంగా మలిచారు… వసూళ్లు కూడా బాగానే వచ్చాయి… టీవీ ప్రసారంలో 8.98 టీఆర్పీలు వచ్చాయి… నిజానికి శ్యామ్ సింగరాయ్‌తో పోలిస్తే ఎక్కువే అనిపించినా… టిల్లు టాక్‌తో పోలిస్తే ఈ టీఆర్పీలు కూడా తక్కువే… కాకపోతే ఎబౌ యావరేజీ… ఈ రేటింగులంటేనే అట్లుంటది రాధికా… సో స్వీట్ ఆఫ్ యు…
పండుగ పూట ఈసారి స్లాట్లు పంచుకుని మరీ స్పెషల్ షోలు వేశాయి ఈటీవీ, మాటీవీ, జెమినిటీవీ… శనివారం, రెండో తారీఖున… ఇలాంటి స్పెషల్ షోల విషయంలో ఈటీవీ పర్‌ఫెక్ట్ కదా… అంగరంగవైభవంగా పేరిట ప్రసారమైన షో టీఆర్పీలను దున్నేసుకుంది… 8.83 టీఆర్పీలు వచ్చినయ్… ఈటీవీకి అవి చాలా ఎక్కువే… మాటీవీలో ప్రసారం చేసిన ఆగట్టునుంటావా, ఈగట్టుకొస్తావా షో కూడా మంచి టీఆర్పీలే సాధించింది… 7.89 టీఆర్పీలు అంటే తక్కువేమీ కాదు… ఎటొచ్చీ… జెమినిలో ప్రసారమైన ఫుల్లు కిక్కు అనే షో రేటింగ్స్ బార్క్ జాబితాలో కనిపించలేదు… ఫాఫం… స్పెషల్ షోలు దానికి అచ్చిరావు… నాగబాబును పిలిచి ఏదో కథ చేయబోతే, అదీ భజనలా మారిపోయి తుస్సుమంది…!!
Share this Article