కొన్ని స్టోరీస్ రాయడానికి ఆనందమేస్తుంది… మౌస్, కీప్యాడ్, కంపోజింగ్, అక్షరాలు, పదాలు చకచకా పరుగులు తీస్తుంటాయి… ఇదీ అంతే… అరె, నువ్వు గ్రేట్‌రా బుడ్డోడా… హేట్సాఫ్… హేట్సాఫ్…
ఉజ్వల్ కులకర్ణి… వయస్సు జస్ట్ 19 ఏళ్లు… షార్ట్ ఫిలిమ్స్ ఎడిట్ చేసేవాడు… మస్తు క్రియేటివిటీ… కళ్లల్లోనే కత్తెర్లతో పుట్టాడేమో… పోనీ, చేతి వేళ్లలోనే ఆ విద్యతో పుట్టాడేమో… ఏ సీన్ ఎంతమేరకు ఉంచాలి, ఏది నరకాలి, ఏది తీసేయాలి, ఏది ఎక్కడ జతచేయాలి పుట్టుకతో వచ్చినట్టుంది విద్య…
కర్నాటక పిల్లాడే… తరువాత కొన్నాళ్లకు ఫ్యాన్ వీడియోలను, అదేనండీ సోషల్ మీడియాలో పెడుతుంటారుగా… వాటిని ఎడిట్ చేసేవాడు… ఫుల్ అప్లాజ్ వచ్చేది… అటు చదువు, ఇటు ఈ ప్యాషన్… తన విద్యకు పదును పెట్టుకుంటున్నాడు… ఓసారి కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ ఫ్యాన్ వీడియోను ఎడిట్ చేశాడు… అది కాస్తా సూపర్ హిట్టయింది…
Ads
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ చూశాడు దాన్ని… అబ్బురపడ్డాడు… వీడిలో ఏదో కళ ఉంది, దాన్ని ట్యాప్ చేయాలి అనుకున్నాడు… పోనీ, మొదట ఓ పరీక్ష పెడదాం అనుకున్నాడు… నంబర్ తెలుసుకుని ఫోన్ చేశాడు… నేను ఫలానా అన్నాడు… ఉజ్వల్ కిందపడిపోవడమే తక్కువ… అసలు కేజీఎఫ్ దర్శకుడేమిటి..? తనతో టచ్‌లోకి రావడం ఏమిటి…
‘‘ఒరేయ్ అబ్బాయ్, నీ ఎడిటింగ్ చూశానురా… ఓసారి రా’’ అన్నాడు… ఉజ్వల్ అర్జెంటుగా రెక్కలు కట్టుకుని వెళ్లి ప్రశాంత్ ఎదుట చేతులు కట్టుకున్నాడు… కేజీఎఫ్-2 కొన్ని బిట్లు ఇస్తాను, ఓ ప్రోమో కట్ చేసి ఇవ్వు… నచ్చితే అదే టీజర్‌గా రిలీజ్ చేస్తాను అన్నాడు… ఉజ్వల్ చేతులు ఏమీ వణకలేదు… మహద్భాగ్యం అన్నాడు… ఆ బిట్లు తీసుకున్నాడు…
అలవోకగా.., తనకు అలవాటైన విద్యే కదా… అలా అలా కట్ చేసి పంపించాడు… ఆశ్చర్యం… నిజంగానే ఆ ప్రోమోను అలాగే రిలీజ్ చేశాడు ప్రశాంత్… వావ్… అంతటి దర్శకుడు ఏమిటి..? ఓ పంథొమ్మిదేళ్ల పిల్లాడికి ఆ గుర్తింపేమిటి…? ఆగండాగండి… అక్కడే అయిపోలేదు… సాధారణంగా ప్రశాంత్‌కు ఎడిటర్‌గా శ్రీకాంత్ గౌడ వ్యవహరిస్తాడు…
కానీ, ఈసారి ప్రశాంత్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు… ఈ పిల్లాడిని ఫుల్ టైం ఎడిటర్‌గా తీసుకున్నాడు… మొత్తం రష్ తన చేతుల్లో పెట్టాడు… హీరో, నిర్మాత, బయ్యర్లు షాక్… రిస్కేమో అని గొణిగారు… ప్రశాంత్ అవన్నీ తోసిపుచ్చి, నాదీ బాధ్యత అన్నాడు… నువ్వు గొప్పోడివిరా ప్రశాంత్…
ఉజ్వల్ చాలా సింపుల్‌గా… ఎప్పటిలాగే షార్ట్ ఫిలిమ్స్, ఫ్యాన్ వీడియోలను చేసినంత వీజీగా కేజీఎఫ్-2 ఎడిట్ చేసిపారేశాడు… మీకు తెలుసు కదా… బోలెడు భారీ భారీ బడ్జెట్ సినిమాలే ఎడిటింగ్ ఫెయిల్యూర్లతో బాక్సాఫీసు దగ్గర తన్నేశాయి… అలాంటిది కేజీఎఫ్-2 అంత గ్రిప్పింగుగా సాగిందీ అంటే ఈ బుడ్డోడే కారణం… ఉజ్వల్, నీకు బంగారు భవిష్యత్తు బాకీ ఉంది, ఉరికేంత మైదానం ఉంది… కేజీఎఫ్ సర్టిఫికెట్ ఉంది… ఇంకేం..? దున్నెయ్… దున్నెయ్…!!
Share this Article