రాష్ట్రంలో పేరుమోసిన సంపాదకులున్నారు… నిజం నిష్ఠురంగానే ఉంటుంది… ఏ కలానికీ సూటిగా, పాఠకుడి బుర్రలోకి ఎక్కేలా రాయడం రాదు… నాలుగు పడికట్టు పదాల్నే వాడుతూ, భజిస్తూ, స్తుతిస్తూ… తామేదో మర్మగర్భంగా గొప్ప భావాల్ని చెబుతున్నట్టు బిల్డప్… వాళ్లతో పోలిస్తే రాధాకృష్ణ చాలా బెటర్… మనం నచ్చినా నచ్చకపోయినా తను అనుకున్నది మాత్రం సూటిగా, అర్థమయ్యేలా చెబుతాడు… ధైర్యంగా రాస్తాడు… జర్నలిస్టులు పెద్దగా వ్యాఖ్యానాలు చేయడానికి ఇష్టపడని న్యాయమూర్తులు, తీర్పులు, రాజకీయ ప్రభావాల గురించి కూడా రాస్తాడు… తన లైన్ ఏమిటి, ఎవరిని సపోర్ట్ చేస్తున్నాడనేది వేరే సంగతి…
కేసీయార్ గురించి నిర్భీతిగా రాశాడు… జనం ఏమనుకుంటున్నారో, కేసీయార్ రీసెంటు ఢిల్లీ యాత్రపై అనుమానాలేమిటో ఖుల్లంఖుల్లా రాసేశాడు… మనకు నచ్చకపోవచ్చుగాక… తన అంచనా ఏమిటో ధైర్యంగా ఆవిష్కరించాడు… తన గురించి ఢిల్లీ సర్కిళ్లలో ఉన్న అభిప్రాయమేంటో చెప్పాడు… జగన్ గురించి ఏం రాస్తాడో మాత్రం మనం వదిలేయాలి… ఎందుకంటే ఆర్కే కలం ప్యూర్ యాంటీ-జగన్… జగన్ అనగానే ఆ కలంలోని పచ్చసిరా సునామీలా పోటెత్తుతుంది…
Ads
రాధాకృష్ణ జర్నలిజానికి మరక అదే… సరే, ఆయన దాన్ని మరక అనుకోడు, తన అవసరం అనుకుంటాడు… తన చంద్రబాబు, తన తెలుగుదేశం కాబట్టి ఆ బయాస్డ్ జర్నలిజం తప్పదు అనుకుంటాడు… అనుకుంటూ అనుకుంటూ దారితప్పిపోతాడు… ఎంత తప్పిపోతాడంటే… తనకు తెలియని విషయాల్ని కూడా రాసిపారేసి, చాలాదూరం వెళ్లిపోతాడు… ఇదే సత్యం, నమ్మకపోతే మీ ఖర్మ అని కూడా పాఠకులకు చెప్పేస్తాడు… అదీ ఏ స్థాయిలో అంటే… ‘‘హైకోర్టులు సుప్రీంకోర్టుకు సబార్డినేట్ కోర్టులు కాదు, వాటికి స్వయంప్రతిపత్తి ఉంటుంది..’’ అని రాసేంత…!!
జగన్ ప్రభుత్వానికీ, ఒక హైకోర్టు జడ్జికీ నడుమ ప్రచ్ఛన్నంగా సాగుతున్న విభేదపర్వం… ఆయన రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపై చేసిన వ్యాఖ్యల్ని ఇటీవల సుప్రీంకోర్టు తప్పుపట్టి, కొన్ని పరుషవ్యాఖ్యలు చేసింది… ఈ నేపథ్యాన్ని రాస్తూ… సో వాట్, ఓ హైకోర్టు జడ్జి అలాంటి వ్యాఖ్యలు చేయడానికి దారితీసిన పరిస్థితులను మనం గుర్తించాలి కదా, ప్రభుత్వ న్యాయవాదులు రెచ్చగొట్టి, ఆ పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు, పోనీ, సుప్రీంకోర్టే రాష్ట్రంలో పరిస్థితులను అర్థం చేసుకోవడానికి పర్యటిస్తే తప్పేమిటి అంటాడు ఆర్కే… ఇదే పేర్కొంటూ ఓ ప్రజాప్రయోజనవ్యాజ్యం కూడా వేస్తాడేమో (వేయిస్తాడేమో) బహుశా… ఇక్కడ తనకు సుప్రీంకోర్టు వ్యాఖ్యల అర్థం కూడా అంతుపట్టలేదు… సుప్రీంకోర్టు ఏపీలో పోలీసుల తీరును ఏమీ సమర్థించలేదు… రాజ్యాంగవిచ్ఛిన్నం దాకా వెళ్లిపోయి, చేస్తున్న వ్యాఖ్యల్ని తిరస్కరించింది… (ఇదీ కేవలం వ్యాఖ్య మాత్రమే, అంతిమ తీర్పు ఏమీ కాదు)
ఆ చర్చలోకి మనం వెళ్లడం లేదు… హైకోర్టులకు స్వతంత్ర ప్రతిపత్తి ఏమీ ఉండదు… కచ్చితంగా మన రాజ్యాంగం, మన దేశ న్యాయవ్యవస్థ తీరు, ఆనవాయితీలు, సంప్రదాయాల మేరకు… సుప్రీంకోర్టే సుప్రీం… అది దేశంలోని అన్నిరకాల ట్రిబ్యునళ్లు, కోర్టులు, ఇతరత్రా అన్నిరకాల జుడిషియల్ వ్యవస్థలకూ అపెక్స్ బాడీ… అది రాజ్యాంగ అంశాలు సహా అన్నిరకాల అంశాలనూ విచారిస్తుంది… విశ్లేషిస్తుంది… సూచనలు చేస్తుంది… కొట్టిపారేస్తుంది… స్టే ఇస్తుంది… ఏదైనా కేసును ఒక హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు కూడా మార్చగలదు… మొత్తం విచారణే ఆపేయగలదు… కింది కోర్టుల వ్యవహారశైలినీ పట్టించుకుంటుంది… మార్గదర్శకాలనూ వెలువరిస్తుంది… ఇంకా చాలా చాలా అధికారాలున్నయ్…
హైకోర్టు జడ్జిలు తన విచారణ పరిధిలోని అంశాలపై వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరూ అభ్యంతరపెట్టరు… అంతిమంగా తను వెలువరించే తుది తీర్పే లెక్కలోకి వస్తుంది… కానీ ఏపీలో జరిగేది వేరు… న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించబడుతున్నయ్… సుప్రీం జడ్జి హైకోర్టును ప్రభావితం చేస్తున్నాడని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సుప్రీం చీఫ్ జస్టిస్కే లేఖ రాసిన నేపథ్యంలో… ప్రతిదీ రాజకీయ కోణంలో, మరింత నిశితంగా పరీక్షకు గురవుతోంది… అలాంటప్పుడు ఎహె, హైకోర్టులకు స్వయంప్రతిపత్తి, ఇవేమీ సుప్రీంకు సబార్డినేట్ కోర్టులు కావు అని ఓ మీడియా అధిపతి అంత అల్లాటప్పా వ్యాఖ్యలు చేయడం ఏమిటి..?
ఒక మెయిన్ స్ట్రీమ్ పత్రిక ఓనర్… ప్రూఫ్ రీడింగు కోసమే కాదు, తను రాసింది పబ్లిష్ చేసేముందు, ఎవరికైనా ముందస్తుగా ఓసారి చూపించి, ప్రాథమిక అభిప్రాయం తీసుకోవడం బెటరేమో ఇకమీద…! ఓ ట్రెయినీ జర్నలిస్టుకు చూపించినా తప్పు ఏమిటో చెప్పేవాడు… లేకపోతే రేప్పొద్దున… ఆఫ్టరాల్ కేంద్ర ప్రభుత్వానిది ఏముంది..? రాష్ట్ర ప్రభుత్వాలే సుప్రీం, రాష్ట్ర ప్రభుత్వాలకు జెడ్పీలు సబార్డినేట్ ఏమీ కాదు… వాటికీ స్వతంత్ర ప్రతిపత్తి ఉందని రాసినా రాసేస్తాడు…! ఏమో… అసలు సుప్రీం రాష్ట్రాల హైకోర్టుల జోలికి రాకుండా రాజ్యంగాన్ని మార్చాలని కూడా డిమాండ్ చేయస్తాడేమో…!!
Share this Article