ఆర్యానంద బాబు… వయస్సు పన్నెండేళ్లు… కేరళలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో ఏడో, ఎనిమిదో చదువుతోంది… హిందీ ఒక్క ముక్క కూడా రాదు… తల్లి పేరు ఇందు… మ్యూజిక్ ఎగ్జామినర్, మ్యూజిక్ టీచర్… తండ్రి పేరు రాజేష్ బాబు… అల్ హరామే స్కూల్లో మ్యూజికల్ ట్రెయినర్… ఊరి పేరు వెల్లిమదుకున్ను….. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… ఈ అమ్మాయి గొంతు జీ5 ఓటీటీలో… యూట్యూబులో మారుమోగిపోతోంది కాబట్టి… మంచి హిందీ సింగర్స్, మెంటార్స్ కూడా ఆ పిల్ల గొంతులో పలుకుతున్న శ్రావ్యత, నిపుణత, శాస్త్రీయత గమనించి ఆశ్చర్యపోతున్నారు కాబట్టి.,.!
ఒక్కసారి ఈ ఫోటో చూడండి… ఓ పెద్ద సైజు బార్బీ బొమ్మలా ఉంది కదా… ఈ పిల్ల ఎనిమిదేళ్ల వయస్సులో ఉన్నప్పుడు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కేసింది… రెండుమూడేళ్ల వయస్సు నుంచే పాడటం ప్రారంభించిన ఈమెకు తల్లిదండ్రులు మంచి శిక్షణ ఇచ్చారు… ఇద్దరూ సంగీతం తెలిసినవారే కదా… నేర్పించేవారే కదా… ఈమె రక్తంలోనే సంగీతం ఉన్నట్టుంది… ఎనిమిదేళ్ల వయస్సుకే బోలెడు కచేరీలు చేసింది… బుడిబుడి నడకలతోనే గమకాలు, రాగాలు, శృతులు కూడా నేర్చేసుకుంది… సంగీత పరికరాలతో ఆడుకుంటూ పెరిగింది…
Ads
అయిదేళ్ల క్రితం… ఓచోట ఓ ప్రోగ్రాం ఇచ్చింది… చిన్న బ్రేక్ కూడా లేకుండా వరుసగా 25 సినిమా పాటలు, అవీ రకరకాల పాటలు పాడి… నాన్ స్టాప్ సింగర్‌గా లిమ్కా బుక్‌లోకి ఎక్కింది… తరువాత అనేక ప్రోగ్రాములు ఇచ్చేది… ఇటు చదువు, అటు సంగీతం… రాగాలు, ఆలాపనలు ఈ పిల్లకు నీళ్లు తాగినంత ఈజీ… మధ్యలో ఓసారి జాతీయ స్థాయిలో ది వాయిస్ ఇండియా కిడ్స్ పోటీలో పార్టిసిపేట్ చేసింది… కొన్ని పాటలు ఏకంగా రెండు కోట్ల దాకా యూట్యూబ్ వ్యూస్ ఉన్నయ్…
ఈమధ్యే జీ5 వాళ్లు ప్రజెంట్ చేసిన సరిగమప లిటిల్ చాంపియన్స్ పోటీలో విన్నర్ ఈ అమ్మాయి… మీకు సంగీతం మీద ఆసక్తి ఉంటే ఒక్కసారి యూట్యూబ్‌లో ఆ ఎపిసోడ్లు ఓసారి… మరీ ప్రత్యేకంగా సత్యం శివం సుందరం పాట చూడండి... ఆరు, ఏడో తరగతి చదివే పిల్లల్లో ఆ గొంతు లేతగా పలుకుతుంది… కానీ ఈ అమ్మాయి వెల్ ట్రెయిన్డ్ ఫిమేల్ సింగర్‌లాగే… అనుభవమున్న పాటగత్తెలాగే ఇరగదీసేసింది… మెంటార్లు, జడ్జిలు, తోటి కంటెస్టెంట్లు కూడా అందరూ ఓ తాదాత్మ్యతలో, తన్మయత్వంలో మునిగిపోయారు…
నిజానికి మనవాళ్లు ఇండియన్ ఐడల్ వంటి చాలా పోటీల్లో పాల్గొన్నారు… కారుణ్య దగ్గర్నుంచి మొన్న మొన్న షణ్ముఖప్రియ దాకా బోలెడు పాటలతో జాతీయ పోటీ వేదికలను అదరగొట్టేశారు… అయితే పదే పదే హిందీ సింగర్స్, జడ్జిలు, మ్యూజిషియన్లు, కంపోజర్ల నుంచి వినవచ్చే ఫిర్యాదు ఏమిటంటే..? మనవాళ్ల హిందీలో సౌత్ ఇండియన్ జీర, యాస… వద్దన్నా, ఎంత ప్రయత్నించినా సరే, బయటికి వినిపిస్తూ ఉంటుందని..! కుళ్లు… హిందీలో లక్షా తొంభయ్యారు మాండలికాలు ఉంటయ్…
ఆయా గాయకులు పాడుతుంటే వాళ్ల మాండలికాలు ధ్వనిస్తూనే ఉంటయ్… ఒక బెంగాలీ గాయకుడు పాడే హిందీ పాటకు, ఒక పంజాబీ గాయకురాలు పాడే పాటకూ బోలెడు తేడా ఉంటుంది… అలాగే మనవాళ్ల హిందీలోనూ కాస్త టిపికల్ యాస ఉంటుంది… అందుకే బాలీవుడ్లో మన గాయకులకు చాన్స్ ఇవ్వరు, రానివ్వరు, ఎదగనివ్వరు… అంతటి మన బాలసుబ్రహ్మణ్యమే తట్టుకోలేకపోయాడు దీన్ని… ఇప్పుడు ఈ అమ్మాయి పాడుతుంటే… ఆ లోపం కూడా ఎన్నలేకపోయారు ఆ పోటీ న్యాయవేత్తలు… దటీజ్ ఆర్యానంద… నువ్వు రాను రాను చాలా రికార్డులు బ్రేక్ చేయాల్సి ఉంది… కీప్ రాకింగ్ తల్లీ…
Share this Article