గుడ్… కేసీయార్ ఓ ఆంధ్రా రైతుకు ఫోన్ చేశాడు… ఆదర్శరైతు ఆయన… ఓ రెండురోజులు మా ఫారమ్ హౌస్కొచ్చి, మా వ్యవసాయం చూసి, మీ అనుభవాన్ని మాతో షేర్ చేసుకొండి, కారు పంపిస్తా, భోజనం పెడతా అన్నాడు… వెరీ గుడ్… శనివారం ఫోన్ చేస్తే, ఈనాడులో వార్త వచ్చేవరకు కేసీయార్ బజానా బ్యాచ్ నిద్రపోయిందేమో… ఈనాడులో వార్త వచ్చాక మిగతా పత్రికలు కూడా తాపీగా… మరుసటిరోజున ఆ వార్త రాసుకుని బాగా సంబరపడిపోయాయి…
ఈయన ఫోన్ చేసి అడిగింది ఏమిటి..? మీ దగ్గర వెద పద్దతిలో, సీడ్ డ్రమ్మర్‌తో ప్రయోగాలు చేస్తున్నారట, మంచి దిగుబడులు వస్తున్నాయట, నిజమేనా..? అని కొన్ని వివరాలు కనుక్కున్నారు… మరి ఫోన్ చేసింది కేసీయార్, కారు పంపిస్తాను, భోజనం పెడతాను అని కూడా అన్నాడు… ఇంకేం..? గబగబా గీకిపారేశారు వార్తను… (సిగ్గుపడండి, ఒకటీరెండు వార్తల్లో సీడ్రిల్ పద్దతి అని రాసేశారు… చివరకు ఈ వార్తను స్కోర్ చేసిన ఈనాడుతో సహా…)
Ads
అది సీడ్రిల్ కాదు తండ్రీ… సీడ్ డ్రిల్… నిజానికి ఓ అభ్యుదయ, ఆదర్శ, ఆధునిక రైతు కేసీయార్‌కు ఇన్నిరోజులుగా ఈ వరి సాగు పద్ధతి గురించి తెలియకపోవడం విస్మయకరం… నాట్లకు కూలీలు దొరక్క, ఖర్చు తగ్గించడానికి వేల మంది రైతులు చాలా ఏళ్లుగా ఈ వెద పద్దతిని అవలంబిస్తున్నారు… డ్రమ్ సీడర్లను బోలెడు మంది తయారు చేస్తున్నారు… మెట్ట వరికి కూడా కొత్త కొత్త డ్రమ్ సీడర్లు వచ్చాయి… తెలంగాణలో కూడా, తన నియోజకవర్గంలో కూడా బోలెడు మంది… ఇది తెలంగాణ సన్నాలు అనబడే రకానికే కాదు, అన్ని రకాలకూ ఉపయుక్తమే…
కేసీయార్ ఫోన్ చేసి అడిగాడు అనగానే… ఈనాడు ఇదుగో… వెద పద్థతిపై అర్జెంటుగా ఓ ‘అన్నదాత’ వ్యాసాన్ని కుమ్మిపారేసింది… అసలు సీడ్ డ్రిల్, డ్రమ్ సీడర్ల కాదు… వేల మంది రైతులు నేరుగా విత్తనాన్ని స్వయంగా చేతులతో వెదజల్లే పద్దతిని కూడా అవలంబిస్తున్నారు… ఆ ఆదర్శరైతును పరిచయం చేయడం వేరు… వెద పద్దతిని కొత్తగా పరిచయం చేయడం వేరు… ఫాఫం, ఈనాడు…
నిజానికి ఈ రైతు సాగు చేస్తున్నది ఏం సన్నాలో తెలుసా..? ఈమధ్య ఆరోగ్యానికి మంచిది అని ప్రచారం పొందిన నల్లబియ్యం సాగు… ఇదీ సన్నరకమే, బీపీటీ పాత రకాలతో కలిపి, మన నేలలకు బాగా పనికొచ్చే ఓ కొత్తరకాన్ని ఈమధ్య బాపట్ల పరిశోధన కేంద్రం సైంటిస్టులే డెవలప్ చేశారు… అది సాగుచేస్తున్నాడు ఈయన…
నిజానికి తను వ్యవసాయంలో చాలా ప్రయోగాలు చేస్తున్నా, తను ప్రధానంగా ఆదాయాన్ని పొందేది పశుపెంపకం ద్వారానే… గేదెలు, ఆవులతోపాటు బ్లాక్ బెంగాల్ మేకల్ని కూడా పాడి కోసం పెంచుతున్నాడు… నాటుకోళ్ల పెంపకం కూడా…! గుడ్… రైతు ఎటువైపు వెళ్లాలనే దిశను చూపిస్తున్న ఆదర్శ రైతు… అంతేతప్ప కేసీయార్ ఆయన్ని అడిగింది, ఆరా తీసింది… తను ప్రమోట్ చేసిన ‘‘తెలంగాణ సన్నాల’’ గురించి కాదు…
సర్.., మీరు ఫోన్ చేసి ఏం అడిగారో, ఆయన ఏం చెప్పాడో, మీరు కారు పంపిస్తే వచ్చి ఆయన మీ ఫామ్ హౌస్ వ్యవసాయానికి ఏం సంస్కరణలు సూచిస్తాడో… మీ ఇష్టం… కానీ మళ్లీ ఈసారి తెలంగాణ సన్నాలను వదిలేసి… లేదా గత ఏడాది తెలంగాణ సన్నాలు వేయండహో అని ప్రమోట్ చేసి, తరువాత ఆ సన్నాలేసిన రైతుల్ని గాలికి వదిలేసినట్టుగా…….. ఈసారి నల్లబియ్యం వేయండహో, ఇదే అత్యుత్తమ, ఆధునిక నియంత్రిత సాగు అని చెప్పకండి… తెలంగాణ సన్నాలు సుగర్ లెస్ అని ప్రచారం చేసినట్టుగా… ఈ నల్లబియ్యం సకలరోగనివారిణి అనీ, ఆ రకాన్ని వెద పద్దతిలో సాగుచేయాలనీ ఆదేశించకండి… ప్లీజు…
Share this Article