ఈటీవీలో వచ్చే ఆలీతో సరదాగా చాట్ షో కొన్నాళ్లుగా మసకబారిపోయింది… అందరూ మరిచిపోయిన పాత నటీనటుల్ని తీసుకొచ్చి, ముచ్చట్లు పెట్టి రక్తికట్టించేవాడు… కొన్ని పిచ్చి ప్రశ్నల మాట ఎలా ఉన్నా… తనకున్న సత్సంబంధాలతో సినిమా ఇండస్ట్రీలో ఏ రేంజులో ఉన్నవారినైనా ఈ చాట్ షోకు తీసుకురాగలడు… సినిమాలు, రాజకీయాల్లో పడి తనకూ ఆసక్తి తగ్గిపోయినట్టుంది… కానీ చాన్నాళ్ల తరువాత తన నుంచి ఓ పదునైన ప్రశ్న వినిపించింది… భేష్ ఆలీ…
ఎంఎస్‌రాజు అనే నిర్మాత కమ్ దర్శకుడు ఉండేవాడు తెలుసు కదా… సంక్రాంతి సినిమాల నిర్మాత, దర్శకుడు అనేవాళ్లు అందరూ… మంచి హిట్లు ఇచ్చాడు… 2009లో మస్కా తరువాత మాయమైపోయాడు… ఇక తెరమరుగే అనుకుంటున్న దశలో రీఎంట్రీ అన్నాడు… పోయి పోయి డర్టీ హరి అనే ఓ ఫోర్త్ గ్రేడ్ సినిమా తీశాడు… జనమంతా తిట్టిపోశారు… ఫోఫోవయ్యా, ఏం సినిమాలు ఇవి, ఒకప్పుడు పెద్ద పెద్ద హిట్లు ఇచ్చిన మొహమేనా అనేశారు… వైల్డ్ హరి అని కూడా పేరు పెట్టేశారు…
ఇంకా పట్టుదల పెరిగింది… అసలు డర్టీ పిక్చర్లలో కూడా ఓ రేంజ్ ఉంటుందని నిరూపించుకోవాలి అనుకున్నట్టున్నాడు… సెవెన్ డేస్, సిక్స్ నైట్స్ అని ఓ సినిమా తీస్తున్నాడు… ఎలాగూ కొడుకు సుమంత్ అశ్విన్ హీరోయే కదా… (ఈ సినిమాకు కాదు)… ఇద్దరూ కలిసి ఆలీ చాట్ షోకు వచ్చారు… ఈ సందర్భంగా ఆలీ అడిగాడు… అంత పెద్ద దర్శకుడు డర్టీ హరి వంటి సినిమా ఎందుకు చేయాల్సి వచ్చింది అని…
Ads
ఏమో, తన మీద వచ్చే విమర్శలకు జవాబు ఇవ్వడం కోసం తనే అడిగించుకున్నాడేమో కూడా..! పోనీ, అదైనా కాస్త కన్విన్సింగ్ సమాధానం ఇవ్వొచ్చుగా… అదీ చేతకాలేదు… ‘‘నేను గతంలో చేయని ప్రతి జానర్ ట్రై చేయాలని అది తీశాను, ఎవడేం అనుకున్నా సరే’’ అని చెప్పుకొచ్చాడు… ఇదెక్కడి జవాబు… రేప్పొద్దున ఆ బాపతు జానర్ సినిమాలు కూడా తీస్తారా కొంపదీసి..? ఇప్పటికే రాంగోపాలవర్మ అనే పర్వర్టెడ్ కేరక్టర్ ఆ బాటలోనే ఉంది…
ఒక్కడు సినిమా షూటింగ్ సందర్భంగా భూమిక హఠాత్తుగా ఎవరో ఫైటర్ మీద భీకరమైన ఇంగ్లిష్ బూతులతో దాడి చేసిందని ఏదో చెప్పుకొచ్చాడు… అదేదో అప్రస్తుత ప్రస్తావనలా అనిపించింది… ఆ ప్రశ్నకు సందర్భశుద్ధి ఏమీ ఉన్నట్టుగా అనిపించలేదు… మంచి పేరు చెడగొట్టుకోవడం, చెత్త పేరు కూడగట్టుకోవడం మీద ఇంకాస్త చాటింగ్ నడిపిస్తే బాగుండేది… అడగాల్సింది, కడగాల్సింది అదే సబ్జెక్టు మరి..!!
Share this Article