పార్ధసారధి పోట్లూరి ….. 2020, జులై 5 న… మొదటిసారిగా వెలుగు చూసిన కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో అప్పట్లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వైపే అన్ని ఆధారాలు చూపబడ్డాయి కానీ విజయన్ వాటిని ఖండించిన సంగతి తెలిసిందే !.అయితే ఈ దుబాయి బంగారం స్మగ్లింగ్ కేసులో అప్పట్లో ప్రముఖంగా వినిపించిన పేరు స్వప్న సురేష్ సెక్షన్ 165 ప్రకారం వాంగ్మూలంని కోర్టులో వెల్లడించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో పాటు NIA ఈ కేసుని విచారిస్తున్నది. ఇప్పటికే చాలాసార్లు స్వప్న సురేష్ ఈ కేసుతో తనకేమీ సంబంధం లేదని చెప్తూ వచ్చిన సంగతి తెలిసిందే…
కోర్టులో స్వప్న సురేష్ ఇచ్చిన వాంగ్మూలం ఏమిటంటే…: దుబాయిలో కొందరు వ్యక్తులు అక్కడి నుండి కొచ్చిన్ లోని దుబాయి రాయబార కార్యాలయానికి పెద్ద పెద్ద బిర్యానీ పాత్రలలో బంగారం పెట్టి కొచ్చిన్ కి పంపించేవారు… కానీ అవి UAE రాయబార కార్యాలయానికి వస్తాయి కాబట్టి సెక్యూరిటీ చెకింగ్ ఉండదు… అలా ఆ పెద్ద పెద్ద బిర్యానీ పాత్రలలో ఉన్న బంగారాన్ని కొచ్చిన్ లోని UAE కాన్సులేట్ నుండి నేరుగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారిక నివాసానికి వెళ్లిపోయేవి.
నేను కొన్నాళ్ళు UAE కాన్సులేట్ లో పనిచేశాను కాబట్టి అక్కడి అధికారులతో నాకు పరిచయం ఉండేది… అలాగే పినరయి విజయన్ అధికారిక కార్యక్రమాలకి ఆయనతో పాటు నేను కూడా కొచ్చిన్ లోని UAE కాన్సులేట్ కి హాజరయ్యే దానిని… నన్ను కొత్తగా వచ్చిన అధికారులకి పరిచయం చేసేవారు విజయన్… ఇందులో నాకేమీ సంబంధం లేదు… ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆయన కుటుంబ సభ్యులకి ఈ స్మగ్లింగ్ తో నేరుగా సంబంధం ఉంది……….. ఇదీ స్వప్న సురేష్ కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం!
Ads
అయితే కేరళ CPM సెక్రటరీ కొడుకు అయిన బినీష్ కోడీయేరి [BINEESH KODIYERI] అదే సంవత్సరం, అంటే 2020 అక్టోబర్ 6న ఒక డ్రగ్స్ కేసులో బెంగుళూరులో అరెస్ట్ అయ్యాడు. అంతకు ముందు అంటే ఆగస్ట్ 22 న డ్రగ్స్ కేసులో NCB మహమ్మద్ అనూప్ ని అరెస్ట్ చేసింది. ఈ మహమ్మద్ అనూప్ తో కేరళ CPM సెక్రటరీ కొడుకు అయిన బినీష్ కోడియేరితో సంబంధాలు ఉన్నట్లు బయటపడ్డది…
ముఖ్యమంత్రి పినరయి విజయన్ కార్యాలయంలో ప్రిన్సిపల్ కార్యదర్శికి ఈ బంగారం స్మగ్లింగ్ కేసులో నేరుగా సంబంధం ఉండడంతో అతనిని అరెస్ట్ చేసింది NIA… ప్రస్తుతం పినరయి విజయన్ ముఖ్య అనుచరులు చాలా మంది బెంగుళూరు జైళ్ళలో ఉన్నారు. తాజాగా స్వప్న సురేష్ ఇచ్చిన సాక్ష్యం వలన ఇప్పుడు పినరయి విజయన్ కూడా చిక్కుల్లో పడ్డాడు.
అసలు కేరళలో డ్రగ్స్,బంగారం స్మగ్లింగ్ కి PFI ఉగ్రవాద కార్యకలాపాలకి ఉన్న సంబంధం సాక్ష్యాలతో నిరూపించాలని NIA భావిస్తున్నది. తగిన ఆధారాలు దొరికితే PFI దాని అనుబంధ సంస్థల మీద పూర్తి స్థాయి నిషేధం విధించడానికి వీలుపడుతుంది… కానీ కేరళ ప్రభుత్వ అండ దండలు ఉన్నంతకాలం అంత సులువుగా ఆధారాలు దొరకకపోవచ్చు… ప్రస్తుతం దేశంలో ఎక్కడయినా అల్లర్లు, హింస జరుగుతున్నా అది నేరుగా PFI వైపే అన్ని వేళ్ళూ చూపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ప్రజ్వరిల్లిన హింస వెనుక హవాలా ద్వారా PFI కి చేరిన డబ్బు ప్రభావం ఉంది అని ఖచ్చితంగా నిరూపించే దిశలో ఎన్ఐఏ ప్రయత్నాలు…!!
Share this Article