WRITER… రివ్యూయర్ :: రమణ కొంటికర్ల
పెన్ను పట్టేటోడు.. గన్నెందుకు పట్టాల్సొచ్చింది..?
ఆర్డర్లీ వ్యవస్థపై తూటా పేల్చేందుకు రాసుకున్న స్క్రిప్ట్ WRITER!
Ads
సినిమాలో క్యారెక్టర్సెన్ని ఉన్నా.. సముద్రఖని ఏకపాత్రాభినయమే సినిమా ఆసాంతం నడిపిస్తుంది.
తమ క్రెడిట్ కోసం.. ప్రాసిక్యూషన్ లో కేసు వీగిపోకుండా ఉండటం కోసం.. మొత్తంగా వారి లొసుగులు, డొల్లతనం బయటపడకుండా.. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఉన్నతాధికారులు అల్లే కథలతో.. సామాన్యులు.. అందులోనూ ఎలాంటి ఐడెంటిటీ లేనివారు అసలేమాత్రం సంబంధం లేని కేసుల్లో ఇరుక్కుని ఎలా బలవుతారో ఓ సోదాహరణతో కళ్లకు కట్టాడు దర్శకుడు.
మోనోపాలీకి అడ్డుకట్ట వేసేందుకు.. ఐక్యమవుదామంటే.. యూనియన్ల పుట్టుకకే ఆస్కారం లేకుండా హైరార్కీ ఎలా అడ్డుపడుతుందో చూపిస్తాడు దర్శకుడు.
ఒక అమాయకుడు బలయ్యేందుకు తనకు తెలీకుండానే ఓ రైటర్ ఎలా ఇరుక్కుపోతాడు.. ఎలా కాపాడాలని యత్నిస్తాడు.. ఆ తర్వాత ఏం జరుగుతుంది… WRITER పశ్చాత్తాపానికి కారణమేంటన్నవి ఇక సినిమాలోనే చూడాల్సిన సంగతులు!
అదే సమయంలో తమకు తాము పోలీసులు గొప్పగా చెప్పుకునే ఫ్రెండ్లీ పోలీస్ అనే మాట.. ప్రజల వైపు నుంచి చూస్తే ప్రతిబింబమెందుకు కాకుండా పోతుందన్నది WRITTER పాత్రతో చెప్పించడంతో పాటు.. పలు సీన్లలో కళ్లకు కట్టాడు డైరెక్టర్ జాకబ్ ఫ్రాంక్లిన్.
మనుషుల కంటే గ్రాఫిక్స్ ఎక్కువ హల్చల్ చేసే రోజుల్లో.. సబ్జెక్ట్ పక్కకు పోయి సెట్టింగ్స్ ఆకర్షించే కాలంలో.. సో నేచురల్ గా ఫ్రేమ్ టూ ఫ్రేమ్ ఎలాంటి ఆర్భాటం లేకుండా సాగుతుంది WRITER.
ఈ మధ్యకాలంలో వచ్చిన మళయాళ సినిమా జనగణమన కూడా టాక్ ఆఫ్ మౌత్ కావడంతో.. దానితో కంపేర్ చేస్తూ.. ఈ సినిమాపై విశ్లేషణలు సాగుతున్నై.
అందుకు అన్నివిధాలా అర్హత ఉన్న సినిమా WRITER. అయితే జనగణమనలో ఇంటర్ లింక్డ్ స్టోరీస్ మల్చిన తీరు ఆసక్తికరమే అయినా.. ఆ లింక్స్ ఎక్కువవ్వడం.. కోర్ట్ సీన్ తర్వాత లాయర్ ను హీరో గా చూపే బ్యాక్ డ్రాప్ సాగతీత విమర్శలకు కారణమైంది. అదే సమయంలో పలు అంశాలను ఒకే చోట గుదిగుచ్చి చెప్పాలనుకోవడంతో.. ఫోకస్ ఔటైపోయింది. కానీ ఆ విషయంలో WRITER ఓ సక్సెస్ స్టోరీ. కథ నడిచే విధానం.. పెద్దగా ట్విస్టులు లేకపోవడం.. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే కలహాలు, ఆప్యాయతలు, ప్రేమలు.. ఇలా అన్నింటినీ స్పృశిస్తూనే.. చెప్పదలచుకున్న సబ్జెక్ట్ డైవర్ట్ కాకుండా సాగుతుంది WRITER!
తాను చేసిన అన్ని క్యారెక్టర్స్ కు సహజంగానే న్యాయం చేసే సముద్రఖనికి.. తన నట జీవితంలో ఉవ్వెత్తున ఎగిసిన ఓ అల.. ఈ WRITER! ఇక డైరెక్టర్ గా .. ఎలాంటి అనవసర మూస మసాలాలద్దకుండా తెరకెక్కించిన జాకబ్ ఫ్రాంక్లినే ఈ సినిమాకు WRITER కూడా కావడంతో సహజంగా సాగింది ఈ WRITER!
Share this Article