ఒకసారి పేరొస్తే చాలు… ఇక తను ఏం చేసినా చెల్లుబాటే… ఆహా ఓహో అని చప్పట్లే… ప్రత్యేకించి సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన హిపోక్రసీ.., పదునైన విమర్శ ఉండదు, పనికొచ్చే సమీక్ష ఉండదు, బట్టలిప్పి నిజస్వరూపం చూపించే ఒక్క అభిప్రాయమూ బయటికి రాదు… రానివ్వరు… ఇక్కడ డప్పులు, డబ్బులు మాత్రమే… పాదదాస్యాలు, పాదతీర్థ సేవనాలు తప్ప ఇంకేమీ కనిపించవు… ఇండస్ట్రీ పారేసే బిస్కెట్ల మీద మీడియాకు అమితమైన ప్రేమ… ‘కవరేజీ’ కక్కుర్తి బతుకుల్లో వీసమెత్తు నిజాయితీ కనిపించని దురవస్థ…
ఈ స్థితిలో ఫేస్‌బుక్‌లో మిత్రుడు Ravindranath Sriraj దిగ్దర్శకుడిగా అకారణ డొల్ల ప్రశంసలకు పాత్రుడిగా కనిపించే రాఘవేంద్రరావుతో రాయబడిన ఓ పుస్తకం మీద రాసిన బ్రీఫ్ రివ్యూ అమితంగా ఆకట్టుకుంది… తను ఫీల్డ్‌తో లింకై ఉన్నవాడు కాబట్టి ఇంకాస్త మర్యాదగానే చెప్పినట్టు అనిపించింది… మెయిన్ స్ట్రీమ్‌లో ఉన్నవాళ్లయితే కోసి కారం పెట్టేవాళ్లేమో… ఫస్ట్ ఆ బుక్ రివ్యూ చదవండి… (తెలుగులో బుక్ రివ్యూలు కనిపించవు… కనీసం సోషల్ మీడియాలో కొందరు మిత్రులైనా ఆ లోటు తీరుస్తున్నందుకు ఆనందంగా ఉంది…)
Ads
*రాఘవేంద్రరావుగారి అన్ని సినిమాల పూర్తి వివరాలు
*హీరోలతో ఆయనకున్న అరుదైన జ్ఞాపకాలు
*ఎప్పుడూ వినని షాకింగ్ ఇన్సిడెంట్స్
*దర్శకేంద్రుల కెరీర్ లోని ముఖ్యమైన ఘట్టాలు
*ఆనాటి పోస్టర్లు, లాబీ కార్డ్స్
*ప్రపంచం మొదటిసారి చూస్తున్న రేర్ ఫోటోస్
*ఇండస్ట్రీలో ఎదురుకున్న అవమానాలు, సత్కారాలు
*ఇతర దర్శకుల గురించి విశ్లేషణలు
*ఆయన తీసిన బ్లాక్ బస్టర్స్, ఫ్లాప్స్ గురించిన పోస్ట్ మార్టం
*రాబోయే దర్శకులకు స్ఫూర్తినిచ్చే ఉదాహరణలు
పైన చెప్పినవేవి ఇందులో లేవని చెప్పబోయేలోపే ఎగ్జైట్ అయిపోయారు… మరి ఏమున్నాయనేగా మీ డౌట్…
– నామమాత్రంగా చెప్పిన కొన్ని సంఘటనలు
-ట్విట్టర్, గూగుల్ లో ఈజీగా దొరికే ఫోటోలు
-యూట్యూబ్ వీడియోల ఎన్లార్జ్ చేసిన స్క్రీన్ షాట్లు
-అల్లరి మొగుడు పెద్ద పోస్టర్ లో రమ్యకృష్ణ శివగామి స్టిల్
-చంద్రబాబునాయుడు, రామోజీరావు etc వీళ్లకు ప్రత్యేక పేజీలు
-సుమ, ఝాన్సీల పెద్ద ఫొటోలతో ఒక ఫుల్ పేజీ
-OTT గురించి రెండు పేజీలు
-కొత్త పెళ్ళి సందD గురించి 6 పేజీలు
ఇంకా చాలా ఉన్నాయి నావల్ల కాక ఆపేస్తున్నా…
ముఖ్య గమనిక : దీని ధర కేవలం 5000 (అయిదు వేల రూపాయలు).
పేజీలు 180
ఆహా… పెద్ద మెదడులో డబ్బు, చిన్న మెదడులో ఆడదాని బొడ్డు తప్ప ఇంకేమీ బుర్రలో ఉండని ఓ సబ్ స్టాండర్డ్ దర్శకుడు రాసిన బుక్కు మీద ఎంతటి పదునైన రివ్యూ ఇది.,.!! ఆమధ్య వర్మ అనబడే మరో దిగ్దర్శకుడు ఓ సినిమా తీశాడు… అది షార్ట్ ఫిల్మ్‌కు ఎక్కువ… ఫుల్ లెంత్ సినిమాకు చాలా తక్కువ… కంటెంటు మరీ నీచస్థాయి… థియేటర్లకు పనికిరాదు, థియేటర్లు వర్మను చీదరించుకుంటాయి కాబట్టి పే పర్ వ్యూ పద్ధతిలో నెట్‌లో రిలీజ్ చేసి, సొమ్ము చేసుకున్నాడు… రాఘవేంద్రరావు పుస్తకానికీ, వర్మ సినిమాకూ పెద్ద తేడా ఏమీలేదు… భ్రష్టచరితులు…
ఆమధ్య సౌందర్యలహరి అనే ఓ దిక్కుమాలిన షో వస్తూ ఉండేది ఈటీవీలో… అదీ ఈ పుస్తకంలాంటిదే… చివరకు ఆ షో ఎవడూ చూడటం లేదని అదే షోలో జూనియర్ ఆర్టిస్టులతో మతిమాలిన డాన్సులు చేయించేవాళ్లు… ఈ పుస్తకం దానికి భిన్నం ఏమీ కాదు… ఓ చెత్త సినిమా ట్రిపుల్ ఆర్‌కు అడ్డగోలు రేట్లు పెట్టి టికెట్లు అమ్ముకున్నట్టే ఉంది ఇది కూడా…! Telugubooks.in సైట్ లో దీని ధర 3200 అట…
ఇది కూడా చాలా ఎక్కువే… అంత ధర పెట్టి కొందామని కొందరు ఫాఫం ఆసక్తిగా ఉన్నారు… కానీ అందులో ఏముందో తెలియదు కదా… కొనేసి, ఆనక పరుష పదాలతో తిట్టుకుంటారేమో తరువాత… అదేమీ అయన ఆత్మకథ కూడా కాదు. ఆయన జీవితంలోని కొన్ని సినిమాల గురించీ, కొంతమంది వ్యక్తుల గురించీ రాసుకున్నాడు… ఒక పిచ్చి టైటిల్ “నేను సినిమాకు రాసుకున్న ప్రేమలేఖ”
ఈ రోజుల్లో బుక్స్ చదివేవాళ్ళే చాలా తక్కువ… ఈ రేటుతో ఈ నాసిరకం పుస్తకంతో రాఘవేంద్రరావు సాధించేదేముంది..? ఏమీ లేదు… తన సుదీర్ఘ సినిమా కెరీర్‌లో ఇదీ నా సినిమా అని చెప్పుకునేది ఒక్కటీ లేదు… ఈ పుస్తకమూ సేమ్ సేమ్… పైగా నాసిరకం శైలి… దారుణమైన ఎడిటింగ్… స్పెల్లింగ్ మిస్టేకులు, చీప్ ఫోటోషాప్డ్ ఇమేజెస్… ఎనభై ఏళ్ల జీవితం, కోట్ల సంపద తరువాత కూడా ఇంకా ఇంకా ఇదేం పోకడలు సామీ…!!
సినిమా ప్రముఖులు పుస్తకాలు రాయడం కొత్తేమీ కాదు… మల్లెమాల బ్రహ్మాండంగా రాశాడు… ఉన్నదున్నట్టు రాసుకున్నాడు తన అనుభవాల్ని… కానీ బయటికి రానివ్వలేదు కొడుకు… మురారి కూడా ‘నవ్విపోదురుగాక’ అని బోలెడు కుండలు బద్దలు కొట్టేశాడు… పరుచూరి ఏదో రాశాడన్నారు… ఆ బ్రదర్స్ పోకడల మీద ఓ అంచనా ఉంది కాబట్టి పొరపాటును కూడా దానివైపు చూసే సాహసం చేయలేదు… మిగతావి సోసో… డప్పులు..!!
Share this Article