అదీ మరి ఆంధ్రజ్యోతి దెబ్బ అంటే… ఆంధ్రా మేధావుల సంఘం దెబ్బ అంటే… వెంకయ్యనాయుడిని విజయవంతంగా ఇంటికి పంపిస్తే ఈ ఆంధ్రా కూటమి ‘ప్రత్యేక ద్రవిడనాడు’ పేరిట ఎక్కడ ప్రత్యేకదేశం కోసం గాయిగత్తర లేపుతారో అని భయపడిపోయి… మంట రేగకముందే చల్లార్చడానికి మోడీ నలుగురు సౌతిండియన్లను రాజ్యసభకు నామినేట్ చేయిస్తున్నాడు……. రేప్పొద్దున ఆంధ్రజ్యోతిలో ఈ అర్థమొచ్చేలా ప్రత్యేక కథనం వస్తే ఎవరూ హాహాశ్చర్యపోవద్దు సుమీ… ఏబీఎన్‌లో ఓ డిబేట్ రన్ చేసినా చేయవచ్చు కూడా…
రాజ్యసభలో నామినేటెడ్ కోటాలో ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి… (12 వరకూ నింపొచ్చు)… అధికార పార్టీ ఇష్టం… ఇప్పుడు పిటి ఉష, ఇళయరాజా, విజయేంద్రప్రసాద్, వీరేంద్ర హెగ్డేలను ఇప్పుడు నామినేట్ చేస్తున్నారు… కర్నాటక నుంచి వీరేంద్ర, ఏపీ నుంచి విజయేంద్రప్రసాద్, కేరళ నుంచి ఉష, తమిళనాడు నుంచి ఇళయరాజా… తెలంగాణ నుంచి ఎవరూ లేరు… (ఒక గవర్నర్ పోస్ట్ తెలంగాణ నుంచి ఉండవచ్చు)… పర్లేదు, బ్రహ్మాండమైన ఎంపికలు అని చెప్పలేం గానీ తప్పుపట్టడానికి ఏమీలేదు… ఒక్క విజయేంద్రప్రసాద్ పేరు తప్ప…
కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన నఖ్వీని ఉపరాష్ట్రపతిని చేయబోతున్నారని వార్తలొస్తున్నయ్… ఇక వెంకయ్యనాయుడి ప్రస్థానం బీజేపీ పార్టీ మార్గదర్శక మండలే… నఖ్వీ ఎంపిక పర్లేదు, కానీ కేరళ గవర్నర్ ఆరిఫ్‌ను గానీ, కశ్మీర్‌కు చెందిన ఆజాద్‌ను గానీ ఎంపిక చేస్తే కశ్మీరీ ప్లస్ ముస్లిం కోణంలో సరైన చాయిస్ అయి ఉండేదేమో… పంజాబ్ అమరీందర్‌ను ఎంచుకున్నా బాగుండేది… ఇప్పుడు సిక్కు కోణం కూడా ప్రధానమే… సరే, రాజ్యసభకు నామినేషన్ల విషయానికి వస్తే…
Ads
ఉష… పరుగుల రాణి… వివాదరహితం… భారత జాతికి ఖ్యాతి తెచ్చిన కేరక్టర్… ఎన్నడూ సరిగ్గా పార్లమెంటు మొహం చూడని సచిన్, రేఖలతో పోలిస్తే చాలా బెటరేమో… ఇళయరాజా ఆమధ్య మోడీ అనుకూల వ్యాఖ్యలు చేసినప్పుడే అందరికీ అర్థమైపోయింది, కాబట్టి ఆశ్చర్యం ఏమీ లేదు… ఐనా వీళ్లు సామాజికవర్గాలు, ప్రాంతాల సమీకరణాలకు అతీతులు… ఇక వీరేంద్ర హెగ్గడే ఎంపిక బాగుంది… ధర్మస్థలి ధర్మాధికారి ఆయన… తుళు సామాజికవర్గానికి చెందినవాడు… సోషల్ సర్వీస్‌లో పేరొందిన ఈయన నిజానికి దిగంబర జైన పరంపరకు చెందినవాడు… ఇక విజయేంద్రప్రసాద్…?
ఈయన ఎంపిక ఆశ్చర్యమే… బాహుబలి వంటి పాపులర్, కమర్షియల్ ప్రాజెక్టులకు కథలు రాయడమేనా సొసైటీకి ఈయన కంట్రిబ్యూషన్..? ఆమధ్య ఈయన కొడుకు రాజమౌళి కుటుంబం మోడీని కలిసివచ్చారని సమాచారం… మోడీ అనుకూలురు… పైగా మణికర్ణిక కంగనా రనౌత్ సిఫారసు ఉండే ఉండవచ్చు… నిజానికి ఈ విజయేంద్రుడి బదులు కంగనానే నామినేట్ చేసి ఉంటే కథ భలే ఉండేది… ఐనా ఈ నామినేటెడ్ సభ్యులతో ఒరిగేది ఏముంది అంటారా..? ఏమీ ఉండదు పెద్దగా… కాకపోతే సమాజంలో భిన్నరంగాలకు చెందిన వారిని గుర్తించి, గౌరవించి, మన చట్టసభల్లో భాగస్వాములను చేయడం… ఉద్దేశం మంచిదే… కానీ సద్వినియోగం చేసుకునేవాళ్లు అరుదు…!!
Share this Article