వాడు అంతే… ఆ చైనావాడు అంతే… ఇండియా అంటేనే ఓరకమైన కసి… చివరకు వాణిజ్య వ్యవహారాల్లోనూ, చిన్న చిన్న అంశాల్లోనూ అది చూపిస్తూ ఉంటాడు… వ్యాపారం చేసుకునేవాడు ఏం చేయగలడు..? భరించాలి… అంతేకదా… విషయం ఏమిటంటే..? మన దేశానికి చెందిన రెండు కార్గో నౌకలు చైనా పోర్టుల్లో నెలల తరబడీ నిలిచిపోయిన ఓ ఉదాహరణ…
అన్ లోడ్ చేయనివ్వరు… సిబ్బందిని అనుమతించరు… వీళ్లేమో వెనక్కి పోతే లాస్… అందుకని రేపు అనుమతిస్తారేమో, ఎల్లుండి అనుమతిస్తారేమో చూద్దాం అన్నట్టుగా నిరీక్షిస్తూనే ఉంటారు… తప్పదు కదా… ఇప్పుడు సమాచారం తెలుస్తున్న రెండు నౌకలకు సంబంధించి 39 మంది కార్గో నౌకల సిబ్బంది కూడా దేవుడా, ఇంకెన్నాళ్లురా బాబూ అని వేచి చూస్తూనే ఉన్నారు…
Ads
MV Jag Anand అనే నౌక హెబే ప్రావిన్సులోని Jingtang పోర్టులో చిక్కుకుపోయింది… ఎప్పటి నుంచి తెలుసా..? గత జూన్ 13వ తేదీ నుంచి.., అంటే ఆరు నెలలుగా పడిగాపులు… అందులో 23 మంది ఉన్నారు… సేమ్, MV Anastasia అని మరో నౌక Caofeidian పోర్టులో సెప్టెంబరు 20 నుంచీ ఉండిపోయింది… అందులో సిబ్బంది సంఖ్య 16… (MV అంటే ఫుల్ ఫాం మోటార్ వెసెల్…)
ఇక్కడ విషయం ఏమిటంటే..? నౌకాశ్రయ అధికారులు ఏమీ సరిగ్గా చెప్పి చావరు… కరోనా కండిషన్ల కారణంగా అని చెబుతారు అంతే… కానీ తమకన్నా లేటుగా అవే పోర్టులకు వచ్చిన ఇతర దేశాల నౌకల నుంచి అన్ లోడింగుకు అనుమతిస్తున్నారు… ఇండియన్ వెసెల్స్ను మాత్రం సతాయిస్తారు… చివరకు ఇది విదేశాంగ శాఖ దృష్టికి వచ్చింది…
బాబూ, ఇదేం సంగతి నాయనా అడిగితే… సరే, మేం చూస్తాం అంటున్నది చైనా విదేశాంగ శాఖ… మా నౌకల సిబ్బంది భీకరమైన స్ట్రెస్‌కు గురవుతున్నారు… ఏదో ఒకటి త్వరగా తేల్చవయ్యా అనడిగితే… అలాగే ఉంటారు గానీ ఎప్పుడు ఆ నౌకల అన్ లోడింగుకు పర్మిషన్ ఇప్పిస్తారో ఎవరూ చెప్పరు… అవునూ… చైనా నుంచి వచ్చి ఇండియా పోర్టుల్లో ఏమైనా నౌకలు అన్ లోడింగు దశలో ఉన్నాయేమో కాస్త చూడండి బ్రదర్… ఇక్కడ సెగ తగిలితే తప్ప అక్కడ ఓడలు ఖాళీ కావు మరి…!!
Share this Article