ఆమె పేరు మూర్తిదేవి… తరచూ అస్వస్థతగా ఉండేది… ఓసారి లక్నో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఓ సీనియర్ నర్స్ ఆమెకు ఓ తప్పు ఇంజక్షన్ ఇవ్వబోయింది… అక్కడే ఉన్న ఓ ట్రెయినీ నర్స్ వెంటనే అడ్డుపడింది… ఆ ఇంజక్షన్ ఇస్తు ఉపద్రవం జరిగిపోయేది… ఇది గమనిస్తున్న ఆ మూర్తిదేవి కొడుకు ఆ ట్రెయినీ నర్స్‌కు కృతజ్ఞతలు చెప్పాడు… అక్కడ కళ్లు కలిశాయి… తరువాత మనసులు కలిశాయి… ఆ తరువాత బతుకులు కూడా… ఆ కొడుకు పేరు ములాయం సింగ్… ఆ నర్స్ పేరు సాధన గుప్త…
వాళ్ల ప్రేమకు బీజం వేసింది ఆ తప్పుడు ఇంజక్షనే… అయితే ఈ సాధన గుప్తకు పెళ్లయింది… భర్త పేరు చంద్రప్రకాష్ గుప్త… ఓ కొడుకు కూడా ఉన్నాడు… పేరు ప్రతీక్… కొడుకు పుట్టాక ఆమె భర్తకు విడాకులు ఇచ్చేసింది… ములాయంతో బంధం మరింత బలపడింది… కానీ బహిరంగం కాదు… కొన్నేళ్లపాటు ఆమెది గుప్త ప్రేమకథే… ములాయం మొదటి భార్య పేరు మాలతీదేవి… ఆమె కొడుకే అఖిలేష్… 2003లో ఆమె మరణించింది… ఆ తరువాతే ములాయం ఈ సాధన గుప్తను తన భార్యగా ప్రకటించాడు… అంతేకాదు, ‘‘ఆమె కొడుకు’’ ప్రతీక్‌ను కూడా తన కొడుకుగా స్వీకరించాడు… ఐనా సాధన తన కులాన్ని దాచుకోలేదు, యాదవ్ అనే ట్యాగ్ తగిలించుకోలేదు…
... (mulayam, sadhana gupta) …
Ads
1994లోనే సాధన గుప్త ప్రతీక్ తండ్రి పేరు ఎంఎస్ యాదవ్ అని రాయించింది… ఆఫీస్ అడ్రస్ ఇచ్చింది… 2000లో మరో సందర్భంలో ములాయంను గార్డియన్‌గా రాయించింది… అఖిలేష్‌కు ఈ సాధన, అనగా పినతల్లి అంటే అస్సలు పడదు… ప్రతీక్‌ను అసలు సోదరుడిగా గుర్తించేవాడే కాదు… యూపీ రాజకీయ సమీకరణాల్లో ములాయంకు యాదవ నేపథ్యమే తప్పనిసరి రాజకీయ అవసరం… అఖిలేష్ యాదవ కుమారుడు… అందుకని అఖిలేష్‌నే ఎంకరేజ్ చేస్తూ, ప్రతీక్‌ను రాజకీయాల్లోకి రానివ్వలేదు… మరి గుప్తుడు కదా… సమాజవాదీ పార్టీ లెక్కల్లో ఇమడడు…
…. (sadhana gupta) ….
సాధన గుప్త రాజపత్నిగా బాగానే ఉంది… కానీ ప్రతీక్ విషయంలో అసంతృప్తి ఉండేాది… ఈలోపు ఇంకో ప్రేమకథ… ఈ ప్రతీక్ అపర్ణతో ప్రేమలో పడ్డాడు… ఆమె తండ్రి అప్పటి టైమ్స్ ఆఫ్ ఇండియా బ్యూరో చీఫ్ అరవింద్ సింగ్ బిస్త్… ప్రతీక్ చదివే స్కూల్లో ఈ అపర్ణ చిన్న వయస్సులోనే శాస్త్రీయ సంగీత కచేరీలు ఇచ్చేది… తుమ్రి డాన్స్ చేసేది… అక్కడ చూపులు కలిశాయి… తరువాత ఇద్దరి నడుమ మెయిళ్లు నడిచేవి… ఇలా ఎనిమిదేళ్లు… ఆమె లండన్ వెళ్లి గ్రాడ్యుయేషన్, పీజీ చేసి వచ్చింది… ఆ స్నేహం అలాగే ఉంది…
… (mulayam, maltidevi)…
సాధన కొడుకు ప్రేమకు వోకే చెప్పింది… తప్పనిసరై ములాయం కూడా వోకే చెప్పాల్సి వచ్చింది… ఈ కోడలు కులం బిస్త్… ఐనా ప్రేమను అంగీకరించి, వైభవంగా పెళ్లి కూడా చేశాడు… ఈ అపర్ణకు రాజకీయాల మీద ఆసక్తి… కానీ అఖిలేష్ ఎక్కడికక్కడ కట్ చేసేవాడు… పినతల్లి కోడలు, ఎదిగితే తనకే తలనొప్పి అనే భావన… పైగా అఖిలేష్ ఎవరితోనూ సరైన సంబంధాలు మెయింటెయిన్ చేయడు… అపర్ణ బిస్త్ కాబట్టి, పినతల్లి గుప్త కాబట్టి పనికిరాలేదు… కానీ తన భార్య డింపుల్ కూడా యాదవ్ కాదు… రావత్… ఆమెను మాత్రం పార్లమెంటుకు పంపించాడు…
…. (prateek, aparna) ….
చూసీ చూసీ అపర్ణ బీజేపీలోకి వెళ్లిపోయింది… సాధన గుప్త సోదరుడు ప్రమోద్ కుమార్ గుప్త అలియాస్ ఎల్ఎస్ కూడా అఖిలేష్‌కు బైబై అనేశాడు… సో, సాధన గుప్త కుటుంబం నేరుగానే అఖిలేష్ మీద తిరగబడింది… ఈలోపు ములాయం సోదరుడు శివపాల్ యాదవ్‌తో కూడా అఖిలేష్‌కు చెడింది… కోపంతో ఓసారి శివపాల్ ఏదో సొంత పార్టీ పెట్టుకున్నాడు కానీ వర్కవుట్ కాలేదు… అఖిలేష్ మాత్రం ఉంటే ఉండు, పోతేపో అనేశాడు… తండ్రి ములాయంనే అధ్యక్ష పదవి నుంచి పీకేసినవాడికి బాబాయ్ ఓ లెక్కా ఏం..?
…. (mulayam with sadhana gupta family) …..
ఇదంతా ఇప్పుడు ఎందుకంటారా..? సాధన గుప్త నిన్న మరణించింది… సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఈ ఎనభయ్యేళ్ల ములాయం ఇప్పుడు పార్టీకి అక్కరలేదు, పైగా జీవితంలోనూ ఒంటరివాడైపోయాడు… యోగి కూడా అఖిలేష్ కుటుంబంపై దృష్టి పెట్టాడు ఇప్పుడు… అఖిలేష్ మళ్లీ బాబాయ్‌ను దూరం పెడుతుండేసరికి యోగి విందుకు పిలిచాడు, మాట్లాడాడు… రాష్ట్రపతి అభ్యర్థిని ద్రౌపది ముర్ముకు వోట్లేయటానికి అంగీకరించింది బాబాయ్ వర్గం… (మూడేళ్ల క్రితం ములాయంనే కలిసి పనిచేద్దామని ఆహ్వానించాడు యోగి)…
… (yogi and mulayam) ….
అంతేకాదు, ఆరో ఏడో సీట్లున్న ‘‘సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్‌భర్’’ కూడా యోగి వైపు తిరిగిపోతున్నాడు… ద్రౌపది ముర్ముకే మా వోట్లు అనేశాడు… యశ్వంత్ సిన్హాకు వోట్లు విషయలో చర్చలకు ఎస్పీ కూటమి మీటింగు పెట్టిన అఖిలేష్ వీళ్లిద్దరినీ పిలవలేదు… వీళ్లు కుతకుతలాడుతున్నారు… సాధన గుప్త మరణించింది కాబట్టి ములాయం కుటుంబంతో ఉన్న సన్నని బంధం కూడా అపర్ణకు, సాధన సోదరుడు ఎల్ఎస్కు తెగిపోయినట్టే… మరోవైపు శివపాల్‌యాదవ్ కత్తులు నూరుతున్నాడు… వీళ్లను యోగి ఎలా వాడుకోనున్నాడు..?! రాజకీయాల్లో కులమే కాదు, కుటుంబం పాత్ర కూడా కీలకమే కదా…!!
Share this Article