పార్ధసారధి పోట్లూరి ……….. చైనాకి చెందిన మొబైల్ తయారీ సంస్థ ‘వివో’ [VIVO] పన్నుల ఎగవేత కేసులో ఇరుక్కుంది ! ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ [ED] వివో ఇండియాకి చెందిన 117 బ్యాంక్ అకౌంట్లలో ఉన్న465 కోట్ల రూపాయాలని స్థంభింప చేసింది. దేశవ్యాప్తంగా 48 నగరాలలో ED వివోకి చెందిన పలు సంస్థల మీద దాడి చేసిన సందర్భంలో పెద్ద మొత్తంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. వివో మొత్తం 62,476 కోట్ల రూపాయలని చైనాకి తరలించింది. ఇది కేవలం పన్నులు ఎగవేయడానికి ఉద్దేశించి చేసిన పని. వివో మొత్తం టర్నవోర్ లో ఇది 50%… పన్నులు ఎగవేయడానికి నష్టం చూపించడానికి ఈ మొత్తం చైనాకి తరలించింది వివో…
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ VIVO Mobiles India Private Limited తో పాటు దాని అనుబంధ సంస్థ Grand Prospect International Communication Pvt Ltd (GPICPL) మరో 23 అనుబంధ సంస్థల మీద దాడి నిర్వహించింది. రెండు కిలోల బంగారు బార్స్ తో పాటు 73 లక్షల నగదుని సీజ్ చేసి మనీ లాండరింగ్ [PMLA] కింద కేసు నమోదు చేసింది.
1. ఢిల్లీ పోలీసుల FIR ని ఆధారంగా చేసుకొని ఫిబ్రవరి, 2022 లో ED కేసు నమోదు చేసింది Grand Prospect International Communication Pvt Ltd (GPICPL) మీద.
Ads
2. GPICPL కి సంబంధించి దాని డైరెక్టర్లు,షేర్ హోల్డర్లు,సర్టిఫైయింగ్ ప్రొఫెషనల్స్ మీద కేసు నమోదు చేసింది ED.
3. ED నమోదు చేసిన FIR ప్రకారం GPICPL డైరెక్టర్లు, షేర్ హోల్డర్లు తప్పుడు గుర్తింపు పత్రాలు [ID] మరియు తప్పుడు చిరునామా లు ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడి అయ్యింది. గుర్తింపు పత్రాలు ఫోర్జరీ చేసినవి ఇచ్చారు రిజిస్ట్రార్ ఆఫ్ కంపనీకి,
4. GPICPL డైరెక్టర్లు ఇచ్చిన అడ్రస్ అయితే మరీ ఘోరం ! వీళ్ళు ఇచ్చిన అడ్రస్ లో ఒక ప్రభుత్వ బ్యూరోక్రాట్ ఉంటున్నారు అదీ కేంద్ర ప్రభుత్వానికి చెందిన బిల్డింగ్ !
5. Bin Lou అనే డైరెక్టర్ GPICPL లో డైరెక్టర్ మరియు VIVO మాజీ డైరెక్టర్. అయితే బిన్ లూ అనే డైరెక్టర్ GPICPL ని రిజిస్టర్ చేసిన సమయంలోనే [2014-2015] ఆర్ధిక సంవత్సరంలో దేశంలోని వివిధ రాష్ట్రాలలో 18 కంపనీలని రిజిస్టర్ చేశాడు.
6. ఇక రెండవ డైరెక్టర్ అయిన Zhixin Wei దేశంలో వివిధ ప్రాంతాలలో 4 కంపనీలని రిజిస్టర్ చేశాడు బిన్ లూ రిజిస్టర్ చేసినట్లుగానే… అదే సమయంలో…
7. మొత్తం దేశవ్యాప్తంగా వీళ్ళు ఏర్పాటు చేసిన కంపనీలు అన్నీ కలిసి వివో ఇండియాకి తమ తమ అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తాన్ని జమ చేశాయి.
8. మొత్తం మొబైళ్ల అమ్మకాల ద్వారా వచ్చిన నగదు 1,25,185 [ఒక లక్షా ఇరవై అయిదువేల నూట ఎనభై అయిదు కోట్ల రూపాయలు ]. ఈ మొత్తం 26 కంపనీల ద్వారా వివో ఇండియాకి చేరాయి అలాగే వివో నుండి ఈ మొత్తంలో దాదాపు 50% అంటే 62,476 వేల కోట్ల రూపాయాలని చైనాకి తరలించింది వివో ఇండియా లిమిటెడ్… ఇది కేవలం తమకి నష్టం వచ్చినట్లు చూపించి, పన్నులు ఎగవేయడానికి ఉద్దేశించి చేసిందే !
9. ED అధికారులు తనిఖీ చేసిన సమయంలో 23 సంస్థలలో ఉన్న ఉద్యోగులు వాళ్ళకి అధికారులుగా ఉన్న చైనా వాళ్ళు ED అధికారులకి సహకరించకుండా, సమాచారం ఉన్న హార్డ్ డిస్క్ లు, మొబైళ్ళు, లాప్ టాప్ లతో సహా పారిపోవడానికి ప్రయత్నించారు. మరి కొందరు సమాచారాన్ని వెంటనే డిలీట్ చేశారు. కానీ ED అధికారులు డిలీట్ చేసిన డాటా రికవరీ చేశారు.
10. భారతీయ ఉద్యోగుల విశ్వాసం ఎలా ఉంది అంటే తాము పనిచేసే చైనా సంస్థని కాపాడడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. భేష్ !
ప్రస్తుతం వివో ఇండియా లిమిటెడ్ కోర్టు తలుపులు తట్టింది. ఉద్యోగులకి జీతాలు ఇవ్వడానికి వీలు లేకుండా ED మా బాంక్ అక్కౌంట్లని సీజ్ చేసిందని, కనీసం జీతాలు వరకు అయినా డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలి అంటూ !
మరోవైపు ఢిల్లీలోని చైనా రాయబారి మాట్లాడుతూ… తమ దేశ సంస్థ అయిన వివో ఇండియా మీద పక్షపాతం లేకుండా విచారణ చేస్తే మంచిదే అంటూనే భారత్ లో విదేశీ సంస్థలు వ్యాపారాలు చేసుకునే [స్వేచ్ఛగా పన్నులు ఎగవేస్తూ ] వాతావరణం ఉండేట్లుగా చూడలంటూ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.
భారత ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసింది 26 May 2014… 2014 ఆగస్ట్ 1 న Vivo Mobiles India Pvt Ltd మొదటిసారిగా మన దేశంలో Multi Accord Ltd అనే హాంకాంగ్ కి చెందిన సంస్థకి అనుబంధ సంస్థగా ఢిల్లీలో రిజిస్టర్ చేసుకుంది. అంటే మోడీ ఎలా వ్యవహరిస్తారో తెలుసుకోకుండానే ప్రమాణ స్వీకారం జరిగిన రెండు నెలల తరువాత వివో మన దేశంలోకి అడుగుపెట్టిందన్నమాట… ఇంకా చైనా మొబైళ్ల కథలెన్ని ఉన్నాయో…!!
Share this Article