విధి నడ్డి మీద నాలుగు తంతేగానీ తత్వం బోధపడదు అని ఓ ముతక మోడరన్ సామెత… శివసేన పరిస్థితి అదే… 40 మంది ఎమ్మెల్యేలు తిరగబడి, వెళ్లిపోయారు… కుర్చీ దక్కించుకున్నారు… ఆఫ్టరాల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంత..? మా వారసత్వానికి సలాములు కొట్టే గులాములే కదా అనుకున్న ఆ శివసేన బాస్ పరిస్థితి హఠాత్తుగా అరేబియా సముద్రంలో పడ్డట్టయింది…
చేతులు కాలాక ఆకులు పట్టుకునే ప్రయత్నంలో పడ్డాడు ఠాక్రే… అందులో ముఖ్యమైంది మళ్లీ హిందుత్వ పాట అందుకోవడం… ఇన్నాళ్లూ అధికారం కోసం దాని బేసిక్ బలమైన హిందుత్వనే తుంగలో తొక్కాడు… అది కాస్తా ఎదురతన్నేసరికి మళ్లీ అదే దిక్కయిపోయింది… ఈ దిశలో కీలకనిర్ణయం ఎన్‌డీయే బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అడక్కపోయినా మద్దతు ప్రకటించడం…
ఈ నిర్ణయం మహారాష్ట్ర మాత్రమే కాదు, జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది… కానీ తమతో ఇన్నాళ్లు అంటకాగిన ఎన్సీపీ, కాంగ్రెస్‌కు మాత్రం మండుతోంది… అవి అసలే యాంటీ హిందూ పార్టీలు… ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వానికి పక్కా వ్యతిరేకం… ఎప్పుడైతే ఠాక్రే ఆమెకు మద్దతు అని ప్రకటించాడో ఇక ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలాసాహెబ్ థోరట్ దాన్ని వ్యతిరేకిస్తూ, ఖండిస్తూ ఓ ట్వీట్ కొట్టాడు…
Ads
https://twitter.com/bb_thorat/status/1546850091222564865?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1546850091222564865%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2Findia%2Fstory%2Fcongress-expresses-concern-uddhav-thackeray-supports-nda-nominee-droupadi-murmu-presidential-elections-1975053-2022-07-13
‘‘రాష్ట్రపతి ఎన్నిక ఓ సైద్ధాంతిక పోరాటం… రాజ్యాంగం, ప్రజాస్వామ్య రక్షణ కోసం ప్రయత్నం… అంతే తప్ప, అభ్యర్థి ఆడా, మగా అని కాదు… ట్రైబలా, నాన్ ట్రైబలా కాదు… శివసేన ద్రౌపది ముర్ముకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నట్టు..? అసలు శివసేనలో ఏం జరుగుతోంది..? మహావికాస్ అఘాడి కూటమి ఇంకా ఉనికిలో ఉంది… శివసేన ఓ ఇండిపెండెంట్ పార్టీయే అయినా కూటమిలో చర్చించాలి కదా… కూటమి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి కదా…’’ అని సీరియస్ అయిపోయాడు…
వెరసి ఈ కూటమి చిత్తిపోయే సూచనలు కనిపిస్తున్నాయి… అసలు ఈ కలయికే ఓ అక్రమ సంబంధం… తెలంగాణలో ఓ సామెత ఉంది… ఉసికె ముడి, పెండముడి అని..! కేవలం కుర్చీ కోసం, ఓ కామన్ మినిమం ప్రోగ్రాం అని రాసేసుకుని, కూటమి కట్టేసి, చేతులు కలిపేసిన బాపతు అవి… అఫ్ కోర్స్, దేశంలో దీనికి మినహాయింపు నైతిక పార్టీలు ఏమీ లేవు.., అది వేరే సంగతి… ఆలెక్కన ఈ పార్టీలన్నింటికీ బీజేపీ ఈ విషయంలో తాత…
ఇప్పుడు అధికారం పోయింది, ఎంత పోరాడినా అదేమీ తిరిగి రాదు… ఇక కూటమి దేనికి అనుకున్నట్టున్నాడు ఠాక్రే… అలాగే ఇంకా హిందూవ్యతిరేక పార్టీలైన ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో అంటకాగితే జనం, మామూలు కార్యకర్తలు కూడా ఛీకొట్టే పరిస్థితి వస్తుందనే ఆత్మమథనంలో పడ్డాడు… దిద్దుకునే పనిలో పడ్డాడు… సో, ఈ కూటమి విచ్ఛిన్నం కాబోతోంది… మరి శివసేన తిరుగుబాటు వర్గం, బీజేపీ సంసారం సజావుగా ఉంటుందా..? అది రాబోయే రోజుల్లో తెలుగు థ్రిల్లర్ సినిమా కథలా ఇంకా రసకందాయంలో పడబోతోంది… వెండితెరపై చూడాల్సిందే…!!
Share this Article