Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇంపాజిబుల్… శ్రీలంకను ఇండియా టేకోవర్ చేయడం అసాధ్యం…

July 16, 2022 by M S R

పార్ధసారధి పోట్లూరి …….. లెబనాన్ ఉత్థాన పతనాలు ! The Rise and Fall of Lebanon ! 1990 లలో దుబాయి వార్తలలోకి రాకముందు మధ్య ప్రాచ్యం [Middle East ] లో అలాంటి నగరమే ఒకటి ఉండేది. దాని పేరు బీరూట్ [Beirut] ! మొత్తం మధ్య ప్రాచ్యంలో ఆర్ధిక లావాదేవీలకి తోడు హాలిడే స్పాట్ గా ఉండేది. ఒక్క మిడిల్ ఈస్ట్ కే కాదు అటు పడమటి దేశాలకి కూడా ఒక ముఖ్యమయిన నగరంగా ఉండేది బీరూట్ !

1930 నుండి 1970 వరకు లెబనాన్ రాజధాని బీరూట్ మధ్య ప్రాచ్యంతో పాటు అటు నార్త్ అమెరికాకి కూడా ఆర్ధిక రాజధానిగా ఉండేది. అప్పట్లో బీరూట్ నగరం గ్లామర్ తో పాటు స్వేచ్చగా ఉండడానికి అనువైన నగరంగా విలసిల్లింది. ముఖ్యంగా ఫ్రెంచ్ నాగరికత తాలూకు ఆనవాళ్ళతో, ఇటు ఫ్రెంచ్ ముఖ్య భాషగా, మరోవైపు ఇంగ్లీష్ కూడా మాట్లాడగలిగిన ప్రజలతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేది. ప్రపంచం నలుమూలల నుండి బాగా డబ్బు ఉన్నవాళ్ళు సేద తీరడానికి బీరూట్ నగరాన్ని ఎంచుకునేవారు. టూరిజం ఎంతలా ఉండేది అంటే… అప్పటి హాలీవుడ్ అందాల తార మార్లన్ బ్రాండో [Marlon Brando] తోపాటు ప్రముఖ హాలీవుడ్ నటులు అయిన బ్రిగిట్ బార్డాట్ [Brigitte Bardot], పీటర్ ఒ టూల్ [Peter O’Toole], ఒమర్ షరీఫ్ [Omar Sharif] లు తరుచూ తమకి షూటింగ్ లేని సమయాల్లో అమెరికాలో కాకుండా బీరూట్ లో సేద తీరేవారు…

బీరూట్ ఇంతలా కీలకమయిన నగరం అవడంలో ప్రధాన పాత్ర ఫ్రాన్స్ దేశానిదే ! 1920 నుండి 1930 వరకు ఫ్రెంచ్ వలస పాలనలో ఉన్న సమయంలో లెబనాన్ లో ఉన్న ఫ్రెంచ్ అధికారులు స్థానిక లెబనాన్ వ్యాపారాలకి స్వేచ్ఛని ఇవ్వడమే కాదు, కొత్తగా బాంక్ లు ఏర్పాటు చేసుకోవడానికి సహకరించారు. అలా స్థానిక లెబనాన్ వ్యాపారులు ఏర్పాటు చేసిన బాంక్ లు వాటిలో డబ్బు,బంగారం డిపాజిట్ చేసిన వివరాలని రహస్యంగా ఉంచేవి. దాంతో మిడిల్ ఈస్ట్ దేశాలనుండి కాక ఇతర యూరోపియన్, అమెరికన్, ఆఫ్రికన్ దేశాలలోని ధనవంతులు తమ దగ్గర ఉన్న డబ్బుని, బంగారాన్ని బీరూట్ లోని ప్రైవేట్ బాంకులలో జమ చేసేవారు పోటీలు పడి మరీ !

Ads

అప్పట్లో స్విస్ బాంకులు ఖాళీగా ఉండేవి బీరూట్ బాంకుల వ్యాపారాలతో పోటీ పడలేక. ఒక దశలో బీరూట్ బాంకులు స్విస్ బాంకుల కంటే ఎక్కువ డిపాజిట్స్ తో కళకళలాడేవి. వివిధ దేశాల నుండి డబ్బు మూటలతో బీరూట్ వచ్చి అక్కడి బాంకులలో తమ సొమ్ముని డిపాజిట్ చేసే కనీసం రెండు మూడు నెలలు బీరూట్ బీచ్ రిసార్ట్స్ లో సేద తీరేవారు దాంతో బీరూట్ బీచ్ దగ్గర హోటళ్లు, రిసార్ట్స్ కి గిరాకీ పెరిగి వాటి నిర్మాణం కూడా జోరు అందుకుంది.

క్రమంగా ఫ్రెంచ్ శైలిలో బార్లతో పాటు ఫ్రెంచ్ స్టైల్ రెసార్ట్స్ కూడా వెలిశాయి. టూరిజం శిఖరానికి చేరుకున్న వేళ ఫ్రెంచ్ కంపనీలు బీరూట్ సముద్రం ఒడ్డున వినూత్నమయిన విహారకేంద్రాలని నెలకొల్పడంతో అప్పట్లో ’లక్జరీ కాపిటల్ ఆఫ్ మిడిల్ ఈస్ట్’ గా పిలవడం మొదలుపెట్టారు బీరూట్ ని. అప్పటి వరకు విహార యాత్రకి కేంద్రంగా మరియు నల్ల డబ్బుని దాచుకునే దేశంగా విలసిల్లిన స్విట్జర్లాండ్ బోసిపోయింది అని చెప్తారు. అరబిక్ కాకుండా ఫ్రెంచ్ అధికార భాషగా ఉండడం కూడా లెబనాన్ వెలుగుకి కారణం. 1970 వ దశకం నాటికి ‘స్విట్జర్లాండ్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ ‘ అనే బిరుదుని కూడా స్వంతం చేసుకుంది లెబనాన్!

అయితే ఎంతలా అభివృద్ధి చెందినా అది శాశ్వతం కాదు. లెబనాన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఫ్రెంచ్ భాషని కాదని అరబిక్ తో పాటు స్థానిక భాషలని కూడా గుర్తించాలని మొదలయిన ఆందోళన క్రమంగా మతపరమయిన రాజకీయాలకి తెరలేపింది. దృజ్ [Druz అనేది 11వ శతాబ్దంలో ఇస్మాయిల్ ముస్లిం తెగ నుండి విడిపోయి వేరు కుంపటి పెట్టుకున్న మతోన్మాద తెగ ఈ దృజ్ ] తో పాటు షియా, సున్నీ ముస్లిం తెగలు, మరొనైట్ క్రిస్టియన్లు [Maronite Christians], ల మధ్య రాజకీయ వైరుధ్యాలు మొదలయ్యాయి. ఈ రాజకీయ, మత పరమయిన సెగలు 70 వ దశకం మధ్యలోకి వచ్చేసరికి బోయిలింగ్ పాయింట్ కి చేరుకున్నాయి. 1975 కి వచ్చేసరికి వేడిగా ఉన్న కుండ ఒక్కసారిగా బద్దలయ్యింది. లెబనాన్ లో సివిల్ వార్ మొదలయ్యింది. అంతర్యుద్ధం చాలా హింసాత్మక రూపం ధరించింది… అదీ ఎంతలా అంటే అప్పటి వరకు ఒక్కో ఇటుక పేర్చుకుంటూ కట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నామరూపాలు లేకుండా చేసేంతలా…

బీరూట్ లో అంతర్యుద్ధం దాదాపుగా 15 ఏళ్లు కొనసాగింది… ఇజ్రాయెల్ కి పక్కనే ఉన్న అరబ్ దేశం అంతలా అభివృద్ధి చెందడం ఇష్టం లేదని చెప్తారు కాబట్టి, ఇజ్రాయిలీ గూఢచార సంస్థ మొస్సాద్ జాతుల మధ్య చిచ్చుపెట్టిందని, దాని ఫలితమే లెబనాన్ అంతర్యుద్ధం అంటారు. కానీ ఈ సిద్ధాంతాన్ని బలపరిచే ఎలాంటి ఋజువులు ఇంతవరకు ఎవరికీ దొరకలేదు… కానీ లెబనాన్ మాత్రం తమ పూర్వపు కళని కోల్పోయింది… దాంతో పాటు పెట్టుబడులు పెట్టే వారి విశ్వాసం కోల్పోయింది. ఇంతా చేస్తే అరబ్బులతో సహా అందరూ ఇప్పటికీ ఫ్రెంచ్ మాట్లాడతారు…

దుబాయి మహర్దశ ఆరంభం !

ఒక పక్క బీరూట్ పతనం మొదలవగానే మరోవైపు దుబాయ్ నిర్మాణానికి పునాదులు పడ్డాయి. అప్పటివరకు బీరూట్ వంటిది మిడిల్ ఈస్ట్ లో లేదు… కాబట్టి ఆ లోటు వాడుకొని వేగంగా అభివృద్ధి చెందడానికి కావాల్సినంత స్థలం దుబాయ్ లో ఉంది. 1980 ప్రాంతాలలో అప్పటి దుబాయ్ పాలకులు వేగంగానే స్పందించారు. అప్పటికి దుబాయ్ తనంత తానుగా అంత ధనిక దేశం కాదు. పక్కనే ఉన్న మిగతా ఎమిరేట్స్ లాగా ఆయిల్ బావులు లేవు అక్కడ… కానీ బీరూట్ లాగా అభివృద్ధి చేయాలనే అభిలాష బలంగా ఉండేది. ఒకే ఒక్క పాయింట్ ని బీరూట్ నుండి స్ఫూర్తిగా తీసుకుంది దుబాయ్. అది బ్యాంకింగ్ రంగం.

ఫ్రెంచ్ వలస పాలకుల ఫార్ములా అయిన ఫ్రీ బ్యాంకింగ్ ని స్ఫూర్తిగా తీసుకున్నారు దుబాయ్ పాలకులు. అప్పటి వరకు కఠినంగా ఉన్న బాంకింగ్ నిబంధనలని సరళీకృతం చేశారు. దాంతో అన్ని ప్రధాన అమెరికన్ బాంకులు తమ శాఖలని దుబాయి లో ప్రారంభించాయి. వెస్ట్రన్ ఆడిటింగ్ సంస్థలు దుబాయ్ లో తమ శాఖలని ఏర్పాటు చేశాయి. ఇక ఇన్వెస్ట్మెంట్ బాంకింగ్ అయితే శరవేగంగా దుబాయ్ చేరుకుంది. ఇక బాంకింగ్, లా ఆఫీసులు కూడా దుబాయ్ కి వచ్చేశాయి. మధ్య ప్రాచ్యంలో దొరకని ప్రొఫెషనల్ సర్వీసులు వాటి తాలూకు ఆఫీసులు దుబాయి లో పెట్టారు. ఇక అంతర్యుద్ధంతో మసకబారుతున్న బీరూట్ లోని బాంకుల నుండి ధన ప్రవాహం దుబాయ్ కి మళ్లడం మొదలుపెట్టింది. మధ్య ప్రాచ్యంలోని ధనిక దేశాలు అప్పటి వరకు ప్రొఫెషనల్ సేవల కోసం లండన్, పారిస్, జ్యూరిచ్ వెళ్ళేవాళ్ళు కాస్తా దగ్గరలో ఉన్న దుబాయ్ కి రావడం మొదలుపెట్టారు. లండన్, పారిస్, జ్యూరిచ్ లలో దొరికే టాప్ క్లాస్ అకౌంటింగ్ సర్వీసు కావొచ్చు లేదా చట్టపరమయిన సేవల కోసం కావొచ్చు అక్కడి వెళ్ళకుండానే వాళ్ళ బ్రాంచ్ ఆఫీసులు దుబాయిలో తెరవడం పెద్ద రిలీఫ్ పక్కన ఉన్న దేశాలకి…

ఇక అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం కావాలి. అప్పటికే ఉన్న విమానాశ్రయాన్ని చాలా పెద్దగా విశాలంగా విస్తరించి కట్టారు దాంతో ఎయిర్ ట్రాఫిక్ అప్పటివరకు టర్కీలోని ఇస్తాంబుల్ కి మళ్లించేవారు… ఇప్పుడు దుబాయి వైపే వెళ్ళేట్లు ప్లాన్ చేశాయి విమానయాన సంస్థలు… అప్పట్లో ఈజిప్ట్ లోని కైరో అంతర్జాతీయ విమానాశ్రయం ఒక హబ్ గా ఉండేది… కానీ అతి పెద్ద దుబాయ్ విమానాశ్రయం అన్ని అవసరాలు తీర్చే విధంగా ఉండడంతో కైరో తన కళని కోల్పోయింది ఇస్తాంబుల్ తో కలిసి… అన్ని వసతులతో హంగులతో నిర్మించిన దుబాయ్ విమానాశ్రయం క్రమంగా దూర ప్రాంతాలకి వెళ్ళే విమానాలకి చెంజింగ్ పాయింట్ గా మారడంతో, విమానం మారడానికి పట్టే మూడు గంటలు లేదా నాలుగు గంటలు దుబాయ్ విమానాశ్రయంలోని మాల్స్ కి విపరీతంగా వ్యాపారం జరిగి డాలర్ల వర్షం కురవడం ప్రారంభం అయ్యింది.. టూరిజం పెరిగి అక్కడ కూడా డాలర్ల పంట పండింది…

1995 లోకి వచ్చేసరికి దుబాయి పాలకులు రియల్ ఎస్టేట్ రంగంలో చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేయడం ప్రారంభించారు. అంతే కాదు పశ్చిమ దేశాల ధనవంతులతో పాటు ఆయిల్ రిచ్ దేశాల నుండి దుబాయి రియల్ ఎస్టేట్ రంగంలో వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ముఖ్యంగా దుబాయి పాలకులు ఒక నినాదం వ్యాపింపచేయడంలో సఫలీకృతం అయ్యారు అది “if you build it, they will come…” ఇది బాగానే ప్రభావం చూపించింది దుబాయి రియల్ రంగం మీద… 1995 లో దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందడం మొదలవడంతో ప్రపంచవ్యాప్తంగా దుబాయి పేరు మారుమోగడం మొదలయ్యింది. అప్పటివరకు చాలా కొద్దిగా అదీ ధనవంతుల వరకే తెలిసిన దుబాయ్ పేరు సామాన్యుల నోట కూడా పలకడం ప్రారంభమయ్యింది…

1995 నుండి 2008 వరకు దుబాయ్ రియల్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందింది. 2008 లో ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మందగమనం ఉన్న రోజుల్లో కూడా దాని తాలూకు ఛాయలు దుబాయ్ మీద పడలేదు. దుబాయిలో మంచినీళ్లు దొరకవు. బయట దేశాల నుండి షిప్పుల్లో తెచ్చుకోవాలి. ఇక రోజువారీ అవసరాల కోసం సముద్రపు నీటిని డీశాలినేషన్ చేసి మంచినీళ్లుగా మార్చి వాడుకోవాలి… ఇది చాలా ఖరీదు అయిన ప్రక్రియ కానీ దుబాయ్ అభివృద్ధికి ఇవేవీ అడ్డు రాలేదు…

dubaఇక శ్రీలంకని భారత్ లో ఎందుకు కలుపుకో కూడదు అంటూ చాలామంది అడుగుతున్నారు… కానీ అది సాధ్యం కాదు…

1. బండారు నాయకే లేదా రాజాపక్ష కుటుంబ పార్టీలు చైనాకి తొత్తులుగా వ్యవహరించాయి ఇప్పటివరకు. వాళ్ళ దేశం వదిలి వెళ్లిపోయినా వాళ్ళ తాలూకు వ్యవస్థలు బలంగానే ఉంటాయి ఎప్పటికీ అక్కడ… కాబట్టి మనం భరించలేము.

2. శ్రీలంకలోని హంబన్తోట పోర్ట్ ప్రస్తుతం చైనా అధీనంలో ఉంది. గోటబయ స్వార్ధబుద్ధి తో ఆ రేవు కాంట్రాక్ట్ చైనాకి ఇచ్చాడు. అది పూర్తి అయినా దాని నుండి ఆదాయం లేకపోవడంతో తీసుకున్న అప్పుకి వడ్డీ కూడా కట్టలేక పోవడంతో అగ్రిమెంట్ ప్రకారం చైనాకి 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చింది శ్రీలంక… అ చైనా అధీనంలో ఉన్న హంబన్తోట రేవుని చైనా నుండి విడిపించాలంటే ఆ డబ్బు మనమే కట్టాల్సి ఉంటుంది… కాబట్టి కుదరదు.

3. ప్రస్తుతం శ్రీలంకకి ఉన్న అప్పు 54 బిలియన్ డాలర్లు… దానికీ మనమే హామీ ఇవ్వాల్సి ఉంటుంది…

4. 54 బిలియన్ డాలర్లకి మనం హామీగా ఉండి శ్రీలంకని యూనియన్ టెరటరీగా చేసి కలుపుకుంటే, ఇప్పుడున్న సంక్షోభం నుండి బయటపడాలి అంటే, మరో 10 బిలియన్ డాలర్లని ఖర్చు చేయాలి మనం… మొత్తం 100 బిలియన్ డాలర్లని ఖర్చు పెడితే మళ్ళీ శ్రీలంక యధాపూర్వ స్థితికి వస్తుంది.

5. శ్రీలంక జనాభా 2 కోట్ల 15 లక్షలు. వీళ్ల కోసం మనం 100 బిలియన్ డాలర్లని ఖర్చుపెట్టడం అవసరమా ? అవి తిరిగి మళ్ళీ ఎప్పటికి రాబట్టుకోగలం మనం ?

6. శ్రీలంకని భారతదేశంలో కలుపుకోవాలంటే ముందు అక్కడ ప్రజా ప్రభుత్వం ఏర్పడి, తరువాత అక్కడి పార్లమెంట్ లో బిల్లు పెట్టి, దానిని అందరూ ఆమోదించాలి… అప్పుడే కలుపుకోవడం సాధ్యపడుతుంది. లేకపోతే అంతర్జాతీయంగా మనం విమర్శలని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

7. ఇంతా చేస్తే 100 బిలియన్ డాలర్లతోటే సరిపెట్టవచ్చా ? లేదు, అవి చాలవు… ఎప్పుడయితే శ్రీలంక మన దేశంలో అంతర్భాగం అవుతుందో అప్పుడు ఆటోమాటిక్ గా చైనా శత్రుదేశం అవుతుంది శ్రీలంకకి. మన దేశం నుండి రోడ్డు మార్గం లేదు అక్కడికి… కాబట్టి ప్రతిదీ నౌకల ద్వారా తరలించాలి… అది చాలా శ్రమ, ఖర్చుతో కూడిన పని. శ్రీలంక నావీ చాలా తక్కువ కాబట్టి రక్షణగా మన నావీని అక్కడ మోహరించాల్సి ఉంటుంది… కాబట్టి అది కుదరదు.

8. అంతా సవ్యంగానే జరిగిపోయింది అనుకుందాము… కానీ అంతా బాగున్న తరువాత రాజపక్షే మళ్ళీ తిరిగి వచ్చి చైనా సహాయంతో మళ్ళీ చిచ్చు పెడతాడు అక్కడ… అదొక చండాలం. మనకి అవసరమా ?

9. పోనీ రాజపక్షే వచ్చినా రాకపోయినా, అక్కడ మనం ఖర్చు చేశాక ప్రజలు మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాం, మీరు వెళ్లిపోండి అని ఆడగరని ఎవరన్నా హామీ ఇవ్వగలరా ?…. నన్ను ఇలాంటి ప్రశ్నలు అడిగేవాళ్ళకి మరియు whats up లలో ఉండే మేధావులకి ఈ విషయం తెలియాలనే వ్రాస్తున్నాను…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలంగాణ సీఎం ఎవరు..? అసలు ఈ మీనాక్షి నటరాజన్ ఎవరు..?
  • పోక్సో కేసులో లంచంగా ఆరు సమోసాలు… పోలీసుల ఇజ్జత్ తీసేశాడు…
  • మేజిక్ + హిప్నాటిజం + రచన + బోధన+ సైకాలజీ + కౌన్సెలింగ్… వాట్ నాట్..?
  • ఓ ప్రియురాలి పాదయాత్ర..! ప్రేమ + భక్తి + విశ్వాసం + వ్యక్తీకరణ…
  • సినిమాల క్లైమాక్స్ గొడవలు… ఎటూ తేలక, తేల్చలేక మథనాలు…
  • విలన్‌పై పగ తీరాలంటే విలన్ బిడ్డను పడేయాలా..? సినిమా నీతి అదే..!!
  • ఫాఫం హైపర్ ఆది..! ఈటీవీ షోలో రోజురోజుకూ ఈ దిగజారుడేమిటో..!?
  • హిందుత్వ ప్రసంగాలు… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కేసు…
  • ‘మెగా దాడి’… రచ్చ… ఆఖరికి లెంపలేసుకున్న దిల్ రాజు సోదరుడు..!!
  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions