చైనీస్ సోషల్ మీడియా వుయ్ చాట్, వీబోలలో పోలీసులే ఈ వివరాలన్నీ చెప్పారు… అనేక నేరాల్లో డీఎన్ఏ రికార్డులు సాయపడుతున్నాయనీ వివరించారు… ఓ చైనీస్ మీడియా ఈ వార్త రాస్తూ… కొన్నాళ్ల క్రితం తూర్పు చైనాలోని జీజాంగ్ పోలీసులు ఇలాగే ఓ కేసు ఛేదించారని గుర్తుచేసింది… ఓ మహిళ ఓ మొక్కజొన్న కంకిని ఎన్నో అంతస్థుల పైనుంచి కిందకు నిర్లక్ష్యంగా విసిరేసింది… అది నేల మీద ఓ ముసలావిడి ఎత్తుకునిపోతున్న ఎనిమిదేళ్ల ఓ బేబీ తలకి తగిలింది… తీవ్రంగా గాయం, రక్తం… హాస్పిటల్‌కు పంపించారు…
Ads
ఎవరిని అడిగినా ఆ కంకిని ఎవరు విసిరారో ఎవరూ అంగీకరించలేదు… ఆ కంకిని కొరికిన ఎంగిలి (ఉమ్మి)ని జాగ్రత్తగా కలెక్ట్ చేసి డీఎన్ఏ పరీక్షలకు పంపించారు… ఫలితాల్ని ఆ అపార్ట్‌మెంట్లలో ఉండే మహిళల్లో ఎవరైతే సంఘటన రోజు మొక్కజొన్న కంకులు కొన్నారో, వారి డీఎన్ఏ డేటాతో సరిపోల్చారు… జూ అనే మహిళ డేటాతో సరిపోలింది… ప్రశ్నిస్తే మొదట మొరాయించింది… కానీ చివరకు అంగీకరించింది… కావాలని కాదు, రూఫ్ మీద ఎండిన బట్టల్ని కలెక్ట్ చేసుకుంటూ చేతిలో ఉన్న కంకిని పారేశానని చెప్పింది… ఆమెను అరెస్టు చేశారు… ఇదీ వార్త… కనీసం పదిశాతం కేసుల్ని డీఎన్ఏ డేటా పరిష్కరిస్తోంది… ఇదీ చైనా పోలీసులు అబ్జర్వేషన్…
సీన్ కట్ చేయండి… ఇండియాకు రండి… పాత నేరస్థుల డీఎన్ఏ తీసి, ఆ డేటాను అన్ని ప్రాంతాల పోలీసులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం అనుకుంది, ఓ బిల్లు ప్రవేశపెట్టింది… అదొక రచ్చ… గోప్యత హక్కు, డేటా సెక్యూరిటీ హక్కు అంటూ అడ్డుపడ్డారు… మీడియాలో నెత్తిమాశిన వ్యాసాలు… అనుమానితుల డీఎన్ఏ సేకరించడానికి కూడా ఆ బిల్లు ఉపకరిస్తుంది… నిజానికి ఒక వ్యక్తి నడత మంచిదైతే తన డీఎన్ఏ వివరాలు పోలీసుల దగ్గర ఉంటే ఎందుకు భయపడాలి..? ఈ ప్రశ్నకు మాత్రం ఎవడూ జవాబు చెప్పడు… అదీ ప్రజలందరి డీఎన్ఏ డేటా కలెక్ట్ చేస్తామంటే ఏమంటారో ఇక..? డీఎన్ఏ పరీక్షలకు విస్తృత అందుబాటు కూడా అవసరం… ప్రస్తుతం 70 దేశాలు డీఎన్ఏ డేటా విషయంలో కఠినంగా ముందున్నాయి… ఇండియాలో మాత్రం ఇలాంటివి చెల్లవు…
Share this Article