ఆమె బీజేపీ ప్రతిపాదిత అభ్యర్థి… సో వాట్..?
ఆమె కాబోయే ఓ రబ్బర్ స్టాంప్… సో వాట్..?
ఆమెతో గిరిజనానికి ఏ లబ్ఢీ లేదు… సో వాట్..?
Ads
ఆమె సొంతూరికే కరెంటు రాలేదు… సో వాట్..?
అన్ని విపక్షాలూ మద్దతునిచ్చాయి… సో వాట్..?
.
ఇన్ని సోవాట్‌ల నడుమ ‘ముచ్చట’ పలుసార్లు ఓ ప్రశ్న వేసింది…? ఒక ఆదివాసీ, ఒక మహిళ ఈ దేశ అత్యున్నత పదవికి ఎందుకు అర్హురాలు కాదు..? వైనాట్ ద్రౌపది…? చదువుకుంది… కొలువు చేసింది… రాజకీయాల్లోకి వచ్చింది… గవర్నర్‌గా కూడా చేసింది… ఏమీ తెలియని అజ్ఙాని కాదు ఆమె… మన ప్రజాస్వామిక వ్యవస్థ తీరూతెన్నూ మీద సంపూర్ణ అవగాహన ఉంది… వ్యక్తిగత జీవితంలో భర్తను, ఇద్దరు పిల్లలను పోగొట్టుకున్నది, అది వేరే సంగతి…
ఆమెకు ఇంకేం అర్హత కావాలి..? ఈ చిల్లర మల్లర వేషాల విపక్షాల మద్దతు కావాలా..? నెవ్వర్… అవసరం లేదు… ఆమె రాష్ట్రపతి కావడం Really The Beauty Of Indian Democracy… మరీ ఆమె అభ్యర్థిత్వం మీద ఎంత ట్రోలింగ్ అంటే… ఆమె ఎక్కడికి వెళ్లినా కెన్యా పౌరురాలు అనుకుంటారు అంటాడు ఒకడు… మరీ ఓ బురద పంది అయితే ఆమె ద్రౌపది సరే, పాండవులు ఎవరు, కౌరవులు ఎవరు..? అని వెక్కిరిస్తుంది… ఒరే ఇడియెట్… ద్రౌపది అనే పేరును గర్వంగా తీసుకుంది తప్ప చిన్నతనంగా భావించలేదురా ఆమె అని ఎవడూ సమాధానం చెప్పలేదు… కారణం, బురద పందులకు జవాబు చెప్పడం ఇష్టం లేక…
ఆమె రాష్ట్రపతి కావడం వల్ల గిరిజనానికి ఒరిగేదేముంది అనేదే ఓ అబ్సర్డ్ ప్రశ్న… ఆమె ఎన్నికైంది రాష్ట్రపతి పదవికి… ఆ పదవికి ఎన్ని పరిమితులున్నాయో గవర్నర్‌గా పనిచేసిన ఆమె తెలుసు… రాష్ట్రపతి అనే పదవి ఒక సెరిమోనియల్ పదవి… ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా… కేంద్ర మంత్రివర్గం ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే, అంతిమంగా ఆమె సంతకమే ఆమోదించాలి… కానీ అదీ లాంఛనప్రాయమే… అయితేనేం..?
భారతదేశ మహారాజ్ఙి వంటి పదవి… తరతరాలుగా తొక్కేయబడుతున్న, వెక్కిరించబడుతున్న ఓ ఆదివాసీ తెగకే కాదు, దేశంలోని అన్ని తెగల గిరిజనానికి ఆత్మగౌరవ పతాకం కాదా..? మేమూ ఈ దేశవాసులమే ఆనే సకారాత్మక భావనలకు ఉద్దీపన కాదా..? ఈ దేశ ప్రజాస్వామిక వ్యవస్థకూ, ఈ దేశ రాజ్యాంగానికి ఆమె ఎన్నిక ఓ గౌరవ సూచిక కాదా..? ఎస్, వైనాట్ షి..?
చిల్లర రాజకీయాలతో ఆమెను వ్యతిరేకించి, ఓ పర్వర్టెడ్ ప్రత్యర్థి పల్లకీ మోసిన పార్టీలకు నివాళి… నాయకులకు నివాళి… అయితే ఈ ఎన్నిక ఓ ప్రహసనం కదా… ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్న ఒకింత డిబేటబులే… అయితే అది ద్రౌపది మీద వ్యక్తిగత చర్చగా కాదు… రాష్ట్రపతి పరిమితుల మీద మాత్రమే కావాలి… అంతే…!!
Share this Article