ఎంతకీ సమజ్ కాలేదు… ఓ వార్త ఆంధ్రజ్యోతిలో కనిపించి చాలాసేపు ఆలోచనల్లో పడేసింది… ఆ వార్త సంక్షిప్తంగా ఏమిటంటే….? ‘‘‘ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న హామీల మేరకు రాష్ట్రంలో వివిధ సంస్థల ఏర్పాటును వేగవంతం చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు… సంస్థల ఏర్పాటు పురోగతిపై ఆయన సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో మంగళవారం సమీక్షించారు…
సెంట్రల్ యూనివర్శిటీ (అనంతపురం), సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (విజయనగరం), ఐఐటీ (తిరుపతి), నిట్ (తాడేపల్లిగూడెం), ఐఐఎం (విశాఖపట్నం), ఐఐఎస్ఈఆర్ (తిరుపతి), పెట్రో వర్శిటీ (విశాఖపట్నం), వ్యవసాయ వర్శిటీ (గుంటూరు), ఐఐఐటీ డిజైన్స్ (కర్నూలు), ఎయిమ్స్ (మంగళగిరి), డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్…. వీటి ఏర్పాటును సమీక్షించారు… ఈ సమీక్షకు కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ మూర్తితోపాటు ఆరోగ్య మంత్రి మాండవీయ, హోం సహాయమంత్రి నిత్యానందరాయ్ కూడా హాజరయ్యారు… నెల్లూరులోని ‘ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం’ సొంత భవనం ఏర్పాటుకు నిధుల గురించి ఆయన చర్చించారు…
ఇదీ వార్త… ప్రధాన ప్రశ్న ఏమిటంటే…? ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఆయన రాష్ట్ర విభజన హామీలపై ఎందుకు కాన్సంట్రేట్ చేసినట్టు..? అదీ కేవలం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన సంస్థల ఏర్పాటును మాత్రమే ఎందుకు సమీక్షిస్తున్నట్టు..? ఆయన ఆంధ్రప్రదేశ్‌కే ఉపరాష్ట్రపతా..? తెలంగాణకు కాదా…? నిజానికి ఆయన ఈ దేశం మొత్తానికి ఉపరాష్ట్రపతి కాదా..? మరి ఆ సమీక్షలో తెలంగాణ ప్రస్తావన ఏది..? ఓహో, తన జన్మప్రదేశం మాత్రమే తనకు ముఖ్యమా..? సూపర్…
Ads
ఉపరాష్ట్రపతిగా ఆయన పిలవగానే మంత్రులు, అధికారులు వెళ్లారు సరే… ఆయన అడిగిన వాటికి జవాబులు చెప్పారు సరే… మరి విభజన హామీల అమలుకు అల్టిమేట్ బాధ్యత వహించాల్సిన ప్రధాని మోడీని కూడా పిలిస్తే బాగుండేది కదా… ఈ బాధ్యతలు నిర్వర్తించాల్సిన హోం మంత్రి అమిత్ షాను కూడా పిలిస్తే బాగుండేది కదా… వాళ్లిద్దరూ వచ్చినప్పుడు కేబినెట్ సెక్రెటరీ రాకపోతే బాగుండదు కదా… మరి ఆయన్ని కూడా సమీక్షకు రమ్మంటే బాగుండేది కదా…
మరి ఒక ఉపరాష్ట్రపతిగా ఆయనకు ఇంతకుమించిన విశేష కర్తవ్యం ఇప్పుడు ఏమున్నదని..? ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థల ఏర్పాటులో పురోగతి మాత్రమే తనకు అత్యంత ప్రాధాన్యాంశంగా కనిపించింది సరే… మరి మిగతా హామీల మాటేమిటి..? ప్రత్యేక హోదాలు, ప్యాకేజీలు, పోలవరం తదితరాల మాటేమిటి..? ఓ సందేహం… ఉపరాష్ట్రపతి విధులు, బాధ్యతలు, పరిమితులు ఏమిటి..? జస్ట్ ఫర్ డిబేట్ సేక్… మన సరిహద్దుల్లో చైనా అలజడి, మన రక్షణ శాఖ అప్రమత్తత మీద ఆయన సమీక్ష సమావేశం పెడితే ఎవరెవరు ఆ సమీక్షకు హాజరు కావాలి..? ఫలానా చర్యలు అర్జెంటుగా తీసుకోవాలని ఆదేశించవచ్చా..? వాటిని కేంద్ర ప్రభుత్వం పాటించాలా..?
అరెరె, మరో ప్రధాన సందేహం… ఆయన సమీక్షలు జరుపుతూ, తన శక్తియుక్తులు వెచ్చిస్తున్నది ఆంధ్రప్రదేశ్ గురించి కదా… విభజన హామీల గురించి కదా…. తెలంగాణ సమస్యలు ఎలాగూ ఆయనకు అక్కర్లేదు కదా… మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ముఖ్యమంత్రిని, ప్రధాన కార్యదర్శిని కూడా సమీక్ష సమావేశానికి పిలిస్తే బాగుండేదా..? ఫాఫం, వాళ్ల సమస్యలేమిటో కూడా చెప్పుకునేవారు కదా…!! వాట్ మోడీజీ..? వాట్ అమిత్ షాజీ… మీరు సరిగ్గా పనిచేస్తే పాపం ఉపరాష్ట్రపతికి ఈ తిప్పలు ఉండేవి కాదు కదా… పూర్ పర్‌ఫామెన్స్…!! Go and give explainations Once…
Share this Article