రజినీకాంత్ ఆరోగ్యానికి ఏమీ ఢోకా లేదు… సంతోషం… మొన్ననే కరోనా నెగటివ్ రిజల్ట్ వచ్చింది… మరీ సంతోషం… కానీ ఇంతలోనే బీపీ ఒడిదొడుకులు ఏమిటి..? అసలు ఏం జరుగుతోంది..? ఆఫ్టరాల్ బీపీ ఫ్లక్చువేషన్స్కి తనను ఐసోలేట్ చేసి, ఎవరూ చూడనివ్వకుండా చేయాలా..? సరే, కరోనా సిట్యుయేషన్ కాబట్టి, అవాయిడ్ చేస్తున్నారు సరే… కానీ అది అసలే అపోలో… దాని క్రెడిబులిటీ ఏమిటో జయలలిత కేసులో చూశాం… రోజుల తరబడీ సాగిన డ్రామాలు చూశాం… అన్ ఫెయిర్, అన్ ట్రాన్స్ పరెంట్, డౌట్ ఫుల్…
మరి ఇప్పుడు ఏం చేయాలి..? కొన్ని కోట్ల మందికి తను ఓ దేవుడు… పైగా ఈ నెలాఖరులో తన పార్టీ ఏమిటో, జెండా ఏమిటో, ఎజెండా ఏమిటో, యాక్షన్ ప్లాన్ ఏమిటో ప్రకటించబోతున్నాడు… ఆధ్యాత్మిక రాజకీయం అనే ఓ కొత్త కాన్సెప్టులో నాస్తిక తమిళ రాజకీయాలను ఢీకొనబోతున్నాడు… ఎస్, తన ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన సహజం… కానీ అపోలో మళ్లీ ఏం చేసింది..?
Ads
అన్నీ అనుమానాలే… వచ్చేవి కీలకమైన ఎన్నికలు… అసలే పక్కకు నెట్టేయబడిన ఓ తెలుగు బీజేపీ వృద్ధ, పెద్ద, సీనియర్ నాయకుడికి రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదట… ఎందుకో తెలియదు… తను ఏమైనా ప్లే చేస్తున్నాడా..? అందుకే బీపీ పేరిట చెన్నైను కాదని, హైదరాబాదులో హాస్పిటల్ పాలు చేశారా..? మోడీ, అమిత్ షా కళ్లుగప్పడానికి ఏవో కుట్రలు సాగుతున్నాయా..?
అరె, ఆప్టరాల్ బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్లను కుటుంబసభ్యులు కలవడానికి ఓ అద్దాల ఛాంబర్ ఏర్పాటు చేశారు… మరి అంతటి ఘన అపోలో ఒక మోహన్‌బాబు కోసమో, ఒక చిరంజీవి కోసమో ఆ తరహా కలయిక ఏర్పాటు చేయలేకపోయిందా..? ఈ ప్లెయిన్ టెక్స్ట్ మెడికల్ బులెటిన్ కాదు, తనను లైవ్‌గా చూపిస్తూ ఓ వీడియో ఎందుకు రిలీజ్ చేయడం లేదు..?
ఈ కార్పొరేట్ హాస్పిటళ్ల సంగతి అందరికీ తెలుసు… అసలే అపోలో… పరమ నొటోరియస్… సెలబ్రిటీలకు, ప్రత్యేకించి రాజకీయ నాయకులకు సింహస్వప్నం అది… అరె, మీ చిరంజీవిని కలనివ్వండి, మాట్లాడనివ్వండి… ఎంత ఐసోలేటెడ్ కేటగిరీ అయినా, ఇదేమీ కరోనా కేసు కాదు కదా… మెగాస్టార్ వాళ్ల వియ్యపు ఆసుపత్రి, సేమ్ రేంజ్ మెగాస్టార్, ఆల్రెడీ రాజకీయాల్లో ఫ్లాప్ స్టార్… ఈయనేమో రాజకీయాల్లోకి వస్తున్న స్టార్… ఏదో జరుగుతోంది..? ఏమిటది..?
కోట్లాది మంది రజనీ అభిమానుల్లో ఆందోళన ఉంది… సహజం… తను వెండితెర దేవుడు… ఈ దుష్ట రాజకీయాల్ని, ఈ నీచ కార్పొరేటు హాస్పిటళ్లను జనం నమ్మడం లేదు… అందుకని తను ఎలా ఉన్నాడో ఎందుకు చూపించే ప్రయత్నం చేయడం లేదు..? జస్ట్, బీపీ ఫ్లక్చువేషన్స్ ఉన్న ఒక స్టార్ పేషెంటు చుట్టూ ఇన్ని ఆంక్షలా..? పైగా ఇంకా బొచ్చెడు పరీక్షలు చేస్తారా..? మొన్నటిదాకా బాగున్న రజినీకాంత్ అసలు పరిస్థితి ఏమిటి..? ఎవరు చెప్పాల్సింది..? రజినీ… ఈ నీచ, దుష్ట, కుట్ర రాజకీయాల్లో నిన్ను బలిచేస్తారేమో… ఆ దేవుడు నిన్ను కరుణించుగాక…!!
Share this Article