పార్ధసారధి పోట్లూరి ……. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేషనల్ హెరాల్డ్ స్కామ్ మీద మొత్తం 12 చోట్ల దాడులు నిర్వహించింది బుధ, గురు వారాలలో [ఆగస్ట్ 3, 4 తేదీలలో]… ఆగస్ట్ 3 వ తేదీన 11 చోట్ల దాడి చేసి పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ! ఆగస్ట్ 4 వ తేదీన, అంటే గురువారం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మల్లిఖార్జున ఖర్గేకి సమన్లు పంపింది తమ ఎదుట హాజరు కమ్మని ! ఈ విషయంపైన మల్లిఖార్జున ఖర్గే రాజ్యసభలో ఒక వ్యాఖ్య చేశాడు కూడా : ఒకపక్క రాజ్య సభ వర్షాకాల సమావేశాలు జరుగుతుంటే ED ఎదుట హాజరు కమ్మని సమన్లు పంపింది అంటూ…
అయితే ED తన సమన్లలలో చెప్పిన సమయానికే ఖచ్చితంగా హాజరయ్యాడు మల్లిఖార్జున ఖర్గే ! ఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ బిల్డింగ్ లో ఉన్న ఆఫీసు తాళాలు తీసి, మల్లిఖార్జున ఖర్గేని వెంటబెట్టుకొని మరీ, నేషనల్ హెరాల్డ్ ఆఫీసులోని ఒక్కో డాక్యుమెంట్ ఎదురుగా పెట్టి మల్లిఖార్జున ఖర్గేని ప్రశ్నించింది ED… విచారణలో భాగంగా చివరి ఘట్టం అయిన పంచనామా జరిగింది.
ED: మేము అడిగిన ప్రశ్నలకి మీరు చెప్పిన సమాధానాలకి చాలా వ్యత్యాసం ఉంది. దీని మీద మీరేమంటారు ? యంగ్ ఇండియాకి కలకత్తాలోని షెల్ కంపెనీ అయిన డోటెక్స్ మర్చండైస్ ప్రైవేట్ లిమిటెడ్ [Dotex Merchandise Pvt Ltd] చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్లు మీ ముందు ఉన్న డాక్యుమెంట్స్ చెప్తున్నాయి. ప్రతీ డాక్యుమెంట్ మీద మీ సంతకం కూడా ఉంది. ప్రతీ లావాదేవీకి సంబంధించిన మనీ లాండరింగ్ కి సంబంధించి ఆధారాలు కప్పిపుచ్చడానికి ప్రయత్నించినట్లు స్పష్టంగా కనపడుతున్నది.
Ads
మల్లిఖార్జున ఖర్గే : ఇవేవీ నాకు తెలియదు. మా ఆడిటర్ ని అడిగి మళ్ళీ చెపుతాను.
దాదాపుగా 7 గంటల పాటు ఎలాంటి విరామం లేకుండా ఒక్కో ప్రశ్నని గుచ్చి గుచ్చి అడిగారు ED అధికారులు. మల్లిఖార్జున ఖర్గే నేషనల్ హెరాల్డ్ CEO గా ప్రతి డాక్యుమెంట్ మీద సంతకం చేశాడు. 80 ఏళ్లు పైబడిన మల్లిఖార్జున ఖర్గే నెహ్రూ- గాంధీ కుటుంబానికి నమ్మిన బంటు… కానీ అదే ఆ గాంధీ కుటుంబ ధనదాహానికి బలవబోతున్నాడు. మొదటి ముద్దాయిగా రికార్డులలోకి ఎక్కబోతున్నాడు. దళిత నాయకుడుగా మల్లిఖార్జున ఖర్గే ఈ గాంధీ కుటుంబ సభ్యుల మోసానికి జైలుకి వెళ్లబోతున్నాడు.
నేషనల్ హెరాల్డ్ బిల్డింగ్ పత్రిక కోసం ఉద్దేశించినది కానీ ఆ బిల్డింగ్ ని వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుతున్నారు. నేషనల్ హెరాల్డ్ బిల్డింగ్ లో ఒక భాగం టాటా కన్సల్టెన్సీ లిమిటెడ్ మరియు పాస్పోర్ట్ ఆఫీసుకి అద్దెకి ఇచ్చారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో మొదటి ముద్దాయిగా మల్లిఖార్జున ఖర్గే జైలుకి వెళితే, దానిని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నది గాంధీ కుటుంబం. వచ్చే సంవత్సరం కర్ణాటకలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో దళిత నేతగా మల్లిఖార్జున ఖర్గేని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించే అవకాశాన్ని కాంగ్రెస్ పరిశీలిస్తున్నది. ఇప్పటికే కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు DK శివకుమార్ తో భేటీ అయ్యాడు మల్లిఖార్జున ఖర్గే ! అయితే అదంత సులభంగా జరగకపోవచ్చు.
శివకుమార్ ఈసారి ఎలాగయినా సరే తానే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బరిలోకి దిగాలనే పట్టుదలతో ఉన్నాడు. అయితే ఇదంతా ED ప్రత్యేక కోర్టు మల్లిఖార్జున ఖర్గేకి బెయిల్ ఇవ్వడం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ విచారణ పూర్తయిపోయి ఈలోపు శిక్షలు పడితే మాత్రమే ఈ గాంధీల ఆశల మీద నీళ్ళు చల్లినట్లు అవుతుంది. ఇదే మల్లిఖార్జున ఖర్గే సిద్ధ రామయా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో PFI, SDPI ల మీద ఉన్న దాదాపు 175 కేసులని బేషరతుగా కొట్టేయించాడు… అదే ఇప్పుడు కర్ణాటకలో పెద్ద సమస్య అయి కూర్చుంది. ఇప్పుడు మళ్ళీ కర్ణాటక ముఖ్యమంత్రి అవుదామని కలలు కంటున్నాడు !
Share this Article