నాగబాబు వెళ్లిపోయిన తరువాత ఈటీవీ జబర్దస్త్‌కు రోజా అల్టిమేట్ జడ్జి అయిపోయింది… ప్రోగ్రాం ఆమె గుప్పిట్లోకి వచ్చేసింది… మనోతోపాటు అప్పుడప్పుడూ ఎవరెవరో గెస్టు జడ్జిలుగా వచ్చివెళ్తున్నా రోజాయే సూపర్ జడ్జిగా చెలాయించింది… నిజానికి ఆమె పక్కన కోజడ్జిగా ఎవరూ సరిగ్గా కుదురుకోలేకపోయారు… తరువాత మంత్రి అయ్యాక ఆమె మానేయాల్సి వచ్చింది… సీన్ కట్ చేస్తే…
అప్పటి నుంచీ జబర్దస్త్‌కు ఓ అక్కరకొచ్చే జడ్జి దొరకలేదు… నిజానికి అక్కడ చేసేదేమీ లేదు… కమెడియన్లు స్కిట్ చేస్తారు, మధ్యమధ్య పగులబడి నవ్వాలి… తరువాత బాగుంది అని మెచ్చుకోవాలి… వీలైతే ఎంట్రీ సమయంలో డాన్స్ అనబడే నాలుగు స్టెప్పులు వేయాలి… ఓ పెదరాయుడు ఆర్ ఓ పెదరాయిని తరహాలో కూర్చోవాలి… ఐనా సరే, ఎవరెవరినో తీసుకొస్తున్నారు, కూర్చోబెడుతున్నారు… ఎవరూ నాలుగు ఎపిసోడ్లు కుదురుగా జడ్జిగా చెలాయించలేకపోయారు…
Ads
అటు ఢీ షోకు ప్రియమణి పక్కన ఎవరూ స్థిర జడ్జి దొరకడం లేదు… అక్కడా ఇవే తిప్పలు… ఎవరో వస్తారు, నాలుగు ఎపిసోడ్లకు జంప్… ఈ స్థితిలో శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్‌కు ఇంద్రజ జడ్జిగా రావడం మొదలైంది… సుధీర్‌ను కొడుకా కొడుకా అని పిలుస్తూ మెల్లిగా పాతుకుపోయింది… కాకపోతే ఈటీవీ, మల్లెమాల మార్క్ బూతులు, వెగటు కామెడీ కొన్నిసార్లు ఆమెకు మింగుడుపడేది కాదు… మొహం పక్కకు పెట్టుకోవడమో, మరీ కిందకు వంచేయడమో చేస్తూ ఇబ్బందిపడేది…
డ్రామా కంపెనీకన్నా జబర్దస్త్ మరీ ముదురు కదా… అసలు దాని కేరక్టరే డర్టీ కామెడీ… జనం వరుసగా బూతులు తిడుతుండేసరికి ఆమధ్య కాస్త బూతుల డోసు తగ్గించారు… అప్పటికే క్వాలిటీ దారుణంగా పడిపోయింది… స్కిట్లలో అసలు కంటెంట్ బదులు కమెడియన్ల స్కిట్ల బాగోగులు, వ్యక్తిగతాలు చొచ్చుకువచ్చేశాయి… ఇక ఇప్పుడు మళ్లీ డర్టీడోస్ పెంచేసినట్టున్నారు… మరి పేరున్న కమెడియన్లందరూ వెళ్లిపోతే, రేటింగ్స్ పడిపోకుండా ఉండేందుకు బూతే శరణ్యం అనుకున్నట్టున్నారు…
విశేషం ఏమిటంటే… మొదట్లో కొన్ని పదాలు, డర్టీ వ్యాఖ్యలకు బాగా ఇబ్బంది పడినట్టు కనిపించిన ఇంద్రజ ఇప్పుడు అలవాటైపోయినట్టుంది… కాదు, బాగానే ఎక్కింది ఆ కల్చర్… ఈమధ్య జబర్దస్త్‌కు కూడా జడ్జిగా వస్తోంది కదా… తాజా ప్రోమోలో ఓ స్కిట్…. తాగుబోతు రమేష్ స్కిట్… తనను తాను పూర్తిగా భ్రష్టుపట్టించుకున్నాడు రమేష్ ఈమధ్య… మొన్నామధ్య అనసూయ వేషం వేసి నవ్వులపాలయ్యాడు కూడా… తాజా స్కిట్‌లో తను గోవాకు హనీమూన్ పోదాం అంటాడు, భార్య అక్కడ ఏం చేద్దాం అంటుంది… మూన్‌ను చూస్తూ హానీ నాకడమే అంటాడు, చేతల్లో చూపిస్తూ… నాకడానికి గోవా దాకా పోవాలా అంటుంది ఆవిడ… ఇంద్రజ పడీ పడీ నవ్వుతూ సంతోషంగా చూస్తోంది ఆ స్కిట్… పక్కన ప్రగతి పకపకా నవ్వులు…
అందులోనే రమేష్ ఏదో చెబుతూ… హ్యాష్ ట్యాగ్ మంగళవారం అని ఉంటుంది తెలుసా అని చెబుతుంటాడు పెళ్లాంతో… డ్యాష్ డ్యాష్ మంగళవారం అంటే ఆ డర్టీ కామెడీ ఏమిటో తెలుసు కదా… వెంటనే ఇంద్రజ అందుకుని తాగుబోతు రమేష్ కాదు, మీరు మంగళవారం రమేష్ అని మార్చేసుకుంటే సరి అంటుంది… ఇక ఫికర్ లేదు… జబర్దస్త్ షోకు అక్కరకొచ్చే జడ్జి దొరికేసినట్టే… ప్రగతినీ, ఇంద్రజనూ అలా కంటిన్యూ చేసేయండి సార్…!!
Share this Article