Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అదీ కిక్కిచ్చే పంచ్… వెగటు బుర్ర పగులుబారేలా..! కరణ్ కిక్కుమంటే ఒట్టు…!!

August 10, 2022 by M S R

కొత్తేమీ కాదు… కానీ అత్యంత అరుదు… సినిమా ఇండస్ట్రీలో ఆడది అంటే ఓ సరుకు… సినిమా సెట్టింగ్ భాషలో చెప్పాలంటే ఓ ప్రాపర్టీ… ఓ ఆబ్జెక్ట్… దానికి దేహం తప్ప ఆత్మ ఉండటానికి వీల్లేదు… పొరపాటున ఆత్మ కనిపిస్తే చంపేస్తారు… తొక్కేస్తారు… ఇండస్ట్రీ పెద్దలకు వ్యతిరేకంగా నోరిప్పితే పాతేస్తారు… అంతే… మళ్లీ సెట్లలో కనిపించడానికి వీల్లేదు…

వ్యక్తిత్వం, పనివాతావరణం, లైంగికవేధింపులు, కమిట్మెంట్లు, సమవేతనాలు గట్రా మాట్లాడటం కాదు… ఏ చిన్న వ్యాఖ్య చేయడానికి కూడా వీల్లేని దురవస్థే చాన్నాళ్లు… కొంచెం కొంచెం మాలీవుడ్ కాస్త నయం… కొంత ప్రోగ్రెసివ్ నేచర్ ఉన్నవాళ్లు, వివిధ టెక్నికల్ విభాగాల్లో పనిచేసేవాళ్లు ‘ఓ సమూహంగా’ ఏర్పడి, మరీ ఇబ్బందులు ఎదురైతే ఎదిరించడం నేర్చుకున్నారు… అదీ ప్రాథమిక దశ… ఈ వివక్ష మరీ సౌతిండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీల్లో మరీ ఎక్కువ…

ఈ స్థితిలో రాధిక ఆప్టే ఓ బాంబు పేల్చింది… ఓ స్టార్ హీరో వెకిలి, చిల్లర తత్వాన్ని తిట్టేసి, ఇక జన్మలో తెలుగు సినిమాలు చేయనుపో అనేసింది… ఔరా, ఈమెకు ఎంత ధైర్యం అనుకున్నారు కొందరు మర్యాదగా… మర్యాద తప్పినవాళ్లు దీనికి ఏం బలుపు ఇది..? ఇక మళ్లీ కనబడకుండా తొక్కేస్తారు అని తేల్చిపారేశారు… ఏం జరిగింది..? ఏమీ జరగలేదు… నిక్షేపంగా సినిమాలు చేసుకుంటూనే ఉంది… నిజం చెప్పాలంటే, భవిష్యత్తులో ఏమైనా జరగనీ అనే తెగింపు ఉంటే తప్ప ఆ స్టాండ్ తీసుకోలేదు…

Ads

ఆమధ్య తాప్సి బొడ్డు పైత్యం మీద ఎవరో మిత్రులతో ఏవో కామెంట్స్ చేస్తున్న వీడియో బయటికొచ్చింది… అదేదో సినిమాలో మరీ నాయిక బొడ్డు మీద కొబ్బరిచిప్పల్ని పడేయడం సదరు పైత్యానికి పరాకాష్ట… పైగా దాన్ని గొప్పతనంగా చెప్పుకోవడం పరాకాష్టకే పర్వర్షన్… తాప్సి మీద ఈ దర్శకేంద్రుడి వీరాభిమానులు చిందులు తొక్కారు… చివరకు ఏమైంది..? ఏమీ కాదు… నిలబడాలి… ఏమీకాలేదు… పాపులర్ హీరోయిన్ అయిపోయింది… అంతేకాదు, ఇప్పుడు మరో బాంబ్ పేల్చింది…

బాలీవుడ్‌లో బాగా పాతుకుపోయిన ఓ సిండికేట్ మెంబర్ ఉన్నాడు… పేరు కరణ్ జోహార్… తన పర్వర్షన్ గురించి మనం ఇక్కడ చెప్పుకోబోవడం లేదు… కాకపోతే తను హాట్‌స్టార్‌లో కాఫీ విత్ కరణ్ అని చాట్ షో చేస్తుంటాడు… పరమ చెత్త షోలలో ఇదొకటి… వచ్చే గెస్టుల అక్రమ సంబంధాలు, డేటింగులు, బ్రేకప్పులు, శ‌ృంగార అభిరుచులు, అసహజ బంధాల మీద ప్రశ్నలు వేస్తుంటాడు… సినిమాల ప్రమోషన్ ప్లస్ చాట్ షో ఒకేసారి జరుగుతూ ఉంటాయన్నమాట…

తన ప్రశ్నల సరళి, పైత్యం మీద చాలామందికి కోపం ఉంది… ఎవరో తాప్సిని అడిగారు… మీ దొబారా సినిమా ప్రమోషన్ కోసం కరణ్ షోకు వెళ్తారా అని… అబ్బే, నా శృంగార జీవితం అంత ఆసక్తికరంగా ఉండదులెండి అని చెప్పిందామె… జబర్దస్త్ పంచ్… ఒక్కమాటలో ఆ షో పైత్యాన్ని ఎండగట్టేసింది… అదేసమయంలో బాలీవుడ్‌ను ఏలుతున్న బలమైన సిండికేట్ తనను ఏదో చేస్తుందనే తత్తరపాటు గానీ, భయం గానీ ఏమీ లేవు…

అఫ్‌కోర్స్, ఇలా మాట్లాడిన కేరక్టర్లలో కంగనా నంబర్ వన్… ఆమె కథే డిఫరెంటు… బాలీవుడ్ మాఫియాతోనే కాదు, ఏకంగా శివసేన సర్కారుతోనే పెట్టుకుంది… తిక్కరేగితే మణికర్ణిక సినిమా నుంచి దర్శకుడితోపాటు చాలామందిని తరిమేసి, తనే కంప్లీట్ చేసింది… కారణాలు ఏవైనా సరే, ఇలా ఇంకొన్ని కేరక్టర్లు తిరగబడితే అప్పుడు కదా మగఇగో లబోదిబో…! కరణ్ షో మీద తాప్సి వేసిన పంచ్ మాత్రం ఇప్పట్లో మరిచిపోవడం కష్టం…!! ఇప్పటికీ కరణ్ కిక్కుమంటే ఒట్టు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పేరుకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ … గణేష్ బీడీ పొగ… శ్రీశ్రీశ్రీ రాజావారి లంకచుట్ట పొగ…
  • ఇండియాలోకెల్లా హయ్యెస్ట్ పెయిడ్ ఫిమేల్ టీవీ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?!
  • వేములవాడ ఆవులు, కోడెల ఉసురు ఎవరికి తగలబోతోంది..?!
  • ఈవారం తెలుగు టీవీ వినోద చానెళ్ల స్థితిగతులు, రేటింగులు ఇవీ…
  • తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!
  • బాలయ్య దంచూదంచూ అని దరువేశాడు గానీ… దంచికొట్టింది భానుమతే…
  • ఫాఫం అనసూయ..! కాస్త మారిందేమో అనుకున్నారా..? నో, నెవ్వర్..!!
  • ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…
  • దిక్కుమాలిన క్షుద్రానువాదాలు… దరిద్రపు పర్యవేక్షణ అంటే ఇదే…
  • సిల్క్ స్మిత హర్టయ్యింది… ఆ గ్రేట్ కొరియోగ్రాఫర్ కెరీర్ క్లోజయ్యింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions