గోరంట్ల మాధవ్ ఉదంతం మనమిక్కడ సమీక్షించుకోవడం లేదు… తన భాష, తన వ్యవహారశైలి, తన నడత, తన వ్యక్తిత్వం జగన్‌కు ముద్దేమో గానీ ప్రజలకు కాదు… ఆ అశ్లీల వీడియో ఫేకే కావచ్చుగాక… కావాలనే టీడీపీ వాళ్లు దీన్ని రచ్చరచ్చ చేస్తుండవచ్చుగాక… లేక ఆ వీడియో నిజమైందే కావచ్చుగాక… టీడీపీ క్యాంపు నుంచే ఈ ప్రసారం ప్రారంభమై ఉండవచ్చుగాక… సజ్జల, రోజా, వనిత, ఆ జిల్లా ఎస్పీల వింత వ్యాఖ్యానాలు, సమర్థనలతో అధికార పార్టీ పరువు మరింత పోయిఉండవచ్చుగాక… గోరంట్ల మీద ఆర్కే పరువునష్టం దావా వేస్తుండవచ్చుగాక… బూతుల్లేకుండా ఏపీ పాలిటిక్స్ లేవు అనుకునే ఓ నిర్లిప్త ధోరణికి, ఓ వైరాగ్యానికి ఇదంతా మరో ఉదాహరణ అయిఉండవచ్చుగాక… దాన్నలా వదిలేద్దాం…
తెలుగు జర్నలిజం అంటేనే… రంగుల పాత్రికేయం… అంటే ఏదో ఒక పార్టీ రంగు పూసుకుని, బజారులో బట్టలిప్పి నర్తించడం… నిజానికి ఈ పైత్యంకన్నా గోరంట్ల వీడియో పెద్ద ఘోరమేమీ కాదనిపిస్తోంది… అంటే ఆ వీడియోను సమర్థిస్తున్నట్టు కాదు… అదెలాగూ బూతుదరిద్రమే… అయితే పచ్చదనం పులుముకున్న చానెళ్ల పైత్యాన్ని ఏమనాలి..? ప్రత్యేకించి టీవీ5 దిగజారుడుతనాన్ని ఏమనాలి..? ప్రత్యేకించి జర్నలిస్టో కాదో తెలియని సాంబశివరావు అనే కేరక్టర్ భాషను, వ్యాఖ్యల్ని, సలహాల్ని ఏమనాలి..?
సౌతిండియా విప్లవకారుడు వెంకటకృష్ణ, పోస్కో రజినీకాంత్, గెటవుట్ రుధిరం దేవి, అద్భుతమైన యాంకర్ మూర్తి మాత్రమే కాదు… పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో చాలామంది న్యూస్ ప్రజెంటర్ల మీద సెటైర్లు పడ్డాయి… వృత్తి జీవితంలో ఇవన్నీ సహజమే అనుకుని వాళ్లు కూడా లైట్ తీసుకున్నారు… అవసరం కూడా… ప్రతిదీ హృదయానికి తీసుకుని, బాధపడాల్సిన అవసరం లేదు… అయితే టీవీ5 సాంబశివరావు తాజా ధోరణిని ఎలా వర్గీకరించాలి..?
Ads
తన భాష, తెలుగుదేశం కార్యకర్త అన్నట్టుగా సాగే తన డిబేట్ల సరళి అందరికీ తెలిసిందే… కానీ ఇదే మాధవ్ వీడియో మీద మాట్లాడుతూ… అమ్మా, నన్ను క్షమించమ్మా అంటూనే… “మాధవ్ వీడియోను వాళ్లింట్లో చూపిస్తే, ఒరిజినలో కాదో ఆమె సెకనులో తేల్చిచెబుతుంది కదా..’’ అంటూ తన పాత్రికేయ నైచ్యాన్ని ప్రదర్శించాడు… ఆమెను ఎందుకు లాగినట్టు ఈ డర్టీ వివాదంలోకి..? ఛిఛీ… ఎలపరం… ఒక దిగ్భ్రమ… సదరు చానెల్‌కు తను గర్వకారకుడైన మణిరత్నం కావచ్చుగాక… కానీ తన తాజా ధోరణి అసహ్యంగా ఉంది… ఆమెకు చూపించి వీడియో ఫేకో కాదో తేల్చాలట… ఇక రాయడానికి కూడా అసహ్యంగా ఉంది… తెలుగు పాత్రికేయానికి నివాళ్లు అర్పించడం తప్ప ఇంకేం చేయగలం..?!
తన భాషలోనే చెప్పాలంటే…. ‘‘నన్ను క్షమించు బ్రో, ఇలా అనొచ్చో అనకూడదో తెలియదు… కడుపు చించుకుంటే పడేది మన కాళ్ల మీదే… ఐనా అదే చిరిగిపోతోంది… అశుద్ధంతో తడిసిపోతోంది…’’
Share this Article